14, సెప్టెంబర్ 2021, మంగళవారం

థైరాయిడ్ వ్యాధి సంపూర్ణ వివరణ

 థైరాయిడ్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -


  ఈ థైరాయిడ్ వ్యాధి నందు రెండు రకాలు కలవు. అవి .


  * హైపో థైరాయిడిజం .


  * హైపర్ థైరాయిడిజం .


      ముందుగా మీకు హైపో థైరాయిడిజం గురించి వివరిస్తాను.


 హైపో థైరాయిడ్ -


      థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువుగా ఉండటం వలన హైపొ థైరాయిడ్ వస్తుంది. ఇది T3 ( Tridothyronine) , T4 (Thyroxine) ను థైరాయిడ్ గ్రంథి తక్కువుగా స్రవించడం మూలాన ఈ సమస్య వచ్చును.


 లక్షణాలు -


 * వీరి చర్మం పొడిగా ఉంటుంది. ముఖం ఉబ్బుగా , గుండ్రంగా అవుతుంది. త్వరగా అలిసిపోవడం , బలహీనంగా ఉండి చలికి తట్టుకోలేరు.


 * చెమట తక్కువుగా వస్తుంది. జుట్టు ఎక్కువుగా రాలిపోతుంది. మానసికపరమైన ఆందోళన ఎక్కువుగా ఉండును.


 * గుండె పెరుగుతుంది . గొంతులో మార్పు వస్తుంది. కళ్ల కింద ఉబ్బుగా ఉంటుంది. మాటల స్పష్టత తగ్గును. కండరాల శక్తి క్షీణిస్తుంది. మలబద్దకం , పొట్ట ఉబ్బుగా ఉండును. రక్తహీనత కలిగి ఉండి దేనిమీద ఆసక్తి లేకపోవటం , కోపం , చిరాకు , విసుగు ఎక్కువుగా ఉండును. జుట్టు రంగు తగ్గును. శరీరం ఉదయం ఒకలాగా సాయంత్రం ఒకరకంగా ఉండును.


 * ఈ సమస్య ఎక్కువుగా స్త్రీలలో కనిపిస్తుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్యవయస్సు ఉన్నవారికి వస్తుంది. ఉదయం పూట వదులుగా ఉన్న జాకెట్లు సాయంత్రం అయ్యేసరికి బిగుతుగా అగును. బరువు పెరుగుతారు.


 * మలబద్దకం ఎక్కువుగా ఉండును. ఋతువు సరైన సమయానికి రాదు . ఋతు సమయంలో కడుపులో నొప్పి ఉండును.


 * కండరాలు మరియు జాయింట్ నొప్పులు అధికంగా ఉండును. భుజాలు , చేతులు , కాళ్లు నొప్పి ఎక్కువుగా ఉండును.


 * శరీరం నందు బద్ధకం ఎక్కువుగా ఉండును. ఎక్కువుగా జలుబు చేయును .


 * చేతి మరియు కాలు వేళ్ళ గోళ్లు పగుళ్లు రావచ్చును. సీరం సోడియం తక్కువుగా ఉండును. రక్తహీనత ఉండును.


 * లివర్ ఎంజైమ్స్ ఎక్కువుగా ఉండును. శరీర ఉష్ణోగ్రత తక్కువుగా ఉండును. గుండెవేగం తక్కువుగా ఉండును. రక్తపోటు తక్కువుగా ఉండును.


 * హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు క్యాబేజి , సోయాబీన్స్ , వేరుశనగ , మొక్కజొన్న , బఠాణి , ముల్లంగి మెదలైనవి వాడకూడదు.


 * విటమిన్ - C , విటమిన్ - E , విటమిన్ - B2 , జింక్ , నియాసిన్ , B3 , B6 మరియు టైరోసిన్ ఉన్న ఆహారపదార్ధాలు వాడాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ ను కూడా బాగా తీసుకోవాలి .


 * థైరాయిడ్ బాగా పనిచేయాలి అంటే ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవాలి . పసుపుపచ్చ రంగులో ఉండే పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి . డ్రై ఫ్రూట్స్ , పచ్చికొబ్బరి తినవలెను .


  హైపర్ థైరాయిడ్ -


     థైరాయిడ్ గ్రంథి అతిగా హార్మోన్ ను ఉత్పత్తి చేయుచున్న హైపర్ థైరాయిడిజం అంటారు. T3 మరియు T4 లను ఎక్కువుగా స్రవించును.


 లక్షణాలు -


 * రోజురోజుకి బరువు తగ్గుట.


 * గుండె వేగం పెరగటం .


 * చెమట ఎక్కువుగా పట్టడం .


 * వేడి వాతావరణాన్ని భరించలేకపోవడం .


 * ఆకలి ఎక్కువుగా ఉంటుంది.


 * వికారంగా ఉండును.


 * మలబద్దకం లేదా విరేచనాలు , అతిమూత్రం , నీరసం , అలసట ఉంటుంది.


 * మతిమరుపు , దుఃఖం , శరీరం వేడిగా ఉంటుంది. జుట్టురాలడం , నిద్ర సరిగా లేకపోవటం వంటి లక్షణాలు కనపడును.


 * దేని మీద శ్రద్ధ లేకపోవటం , అసహనంగా ఉండటం , కోపంతో కేకలేయడం , చేతులు వణుకుతుంటాయి .


 పాటించాల్సిన నియమాలు -


 * వీరు ఆహరంలో ఎక్కువుగా క్యాబేజి , చిక్కుడు , సోయాబీన్స్ , వేరుశనగ వాడాలి. ముల్లంగి కూడా వాడవచ్చు .


 * విటమిన్ - C , E , B2 , B6 , జింక్ , నియాసిన్ లు థైరాయిడ్ గ్రంథికి శక్తిని ఇస్తాయి . ఇవి టమాటా , నారింజ , ఉసిరి వంటి పండ్లలో ఎక్కువుగా ఉండును.


 * మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి . ధ్యాన సాధన చేయడం మంచిది .


 * రోజుకి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయుట మంచిది . సర్వాంగాసనం , హలాసనం , మత్స్యసనం , భుజంగాసనం , ధనురాసనం వేయడం మంచిది .


         కొన్ని ప్రాంతాలలో ఆహారం , నీటిలో అయొడిన్ లవణం తక్కువుగా ఉండటం వలన "గాయిటర్" అనే వ్యాధి వస్తుంది. గాయిటర్ వ్యాధి ఉన్నవారిలో మీద ముందు థైరాయిడ్ గ్రంథి కణిత వలే పెద్దగా కనపడును. అయోడిన్ లవణం అధికంగా తీసుకోవడం వలన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు . సహజ ఆహారపదార్దాల ద్వారానే దీనిని పొందడం ఉత్తమం . అయొడిన్ ప్రతిరోజు పెద్దవారు 150 మి.గ్రా , గర్భిణి స్త్రీలు 175 మి.గ్రా తీసికొనవలెను . ఇది ముఖ్యంగా కూరగాయలలో అధికంగా ఉండును.


       ఆయుర్వేదం నందు దీనిని "గళగండ " వ్యాధిగా పిలుస్తారు . ఆయుర్వేదం నందు అత్యద్భుతమైన మరియు సంపూర్ణంగా వ్యాధిని నివారించు ఔషధాలు కలవు.


     

కామెంట్‌లు లేవు: