హరి యను రెండక్చరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహత్త్వము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!
క్రుష్ణా ! 'హరి' అనే రెండు అక్షరాలు సకల పాపాలను హరింపజేస్తాయి
(నశింపచేస్తాయి).పద్మనాభా! ఓ శ్రీహరీ !నీ పేరులో ఉన్న మహాత్యాన్ని తెలుసుకుని స్తుతించడానికి హరి హరి నాకు సాధ్యమా!(అసాధ్యం అని అర్ధం)
హరి అన్న రెండు అక్షరములతో సకల పాపములు హారాయించును అన్నది భావము. అలా వదిలించుకోలేకపోతే ఏమైందని. అలా మిగిలిపోయిన పాపాల లక్షణాలే పాతకాలుగా మారి మనలను జన్మ, మరుజన్మ ఇలా చక్ర భంధములో వుంచుతున్నాయి.
ఆ పాతకాలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనేవి ఆరింటిని జీవుడు జయంచనంతకాలము ఇలా జరుగుతూనే వుంటది. మరి మానవుని కర్తవ్యము ?
అందుకే "హరి" ని ఆశ్రయించి హారి నామ స్మరణతో ఈ పాతాకాలను హరాయించుకోవటమే.
ఇంకా ఇక్కడ శతక కారుడు తనచాతుర్యము కూడా బాగా చూపించాడు. కరిగినది అనకుండా లేదా తత్ సమానపదము కూడా ఉపయోగించక హారియించు అన్నదానికి కారణము, కరిగినది అంటే, ఈ గుణరూపము మార్పు చెందినదే కాని ఇంకా అక్కడే వున్నది అని, కాని హరియించు అంటే పూర్తిగా నివృత్తి. ఇలా అయితేనే మీకు మోక్ష పదమని శతకకారుని భావన.
ఇందుకు ఉదాహరణగా హరి అన్న పదాలు పద్యము మొత్తములో ఆరు సార్లు పునరావృతమై కలవు. మీరు ఒక్కసారి పద్యము మరల గమనించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి