శ్లోకం:☝️
*యదావర్ణయత్ కర్ణమూలేన్త కాలే*
*శివో రామ రామేతి రామేతి కాశ్యాం*
*తదేకం పరం తారక బ్రహ్మరూపం*
*భజేహం భజేహం భజేహం భజేహం*
- శ్రీరామ భుజంగప్రయాత స్తోత్రం
భావం: ఏ తారకమంత్రాన్ని సాక్షాత్ పరమశివుడు కాశీలో మరణించిన పుణ్య జీవులకు కుడి చెవిలో ముమ్మారు ఉపదేశిస్తాడో, తద్వారా ముక్తులగుదురో, ఆ తారక పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీరామునికి నమస్కారము! 🙏🙏🙏
శ్లోకం:☝️
*మధేయ మనార్యా లబ్దాపి*
*ఖలు దుఃఖేన పరిపాల్యతే*
*దృఢ గుణ పాశసంధాన*
*నిష్పంది కృతాఽవినశ్యతి*
*ఉద్దామదర్ప భట సహస్రోల్లాసిలతా*
*పంజరవిద్ధృతాపి అపక్రామతి*
*మదజల దుర్దినాంకార గజఘటిత*
*ఘనఘటాటోప పరిపాలితాపి ప్రపలాయతే*
భావం: లక్ష్మీదేవి మహాచంచలమైనది. అంత త్వరగా ఎవరికీ ప్రసన్నం కాదు. ఒకవేళ ప్రసన్నమైనా ఎంతోకాలం స్థిరంగా ఉండదు. మోకులతో కట్టి ఉంచినా, కత్తులబోనులో బంధించినా, మదపుటేనుగులను కాపలాగా పెట్టినా సరే - పారిపోతుంది. దుష్టులు, అనార్యులు, మూర్ఖులకు సైతం ఒక్కోసారి సంప్రాప్తిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి