నిత్య సంతోషపరుడు
ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని సదా కోరుకుంటాడు కానీ ఎంతమంది సంతోసహాయంగా ఉన్నారు అని విచారిస్తే ప్రతి వారు తాను సంతోషంగా లేను అనే అంటారు. ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పరు. దీనికి కారణం ఏమిటో విచారిద్దాం. ఒక విద్యార్థి దగ్గరకు వెళ్లి అడిగితే తాను పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానో లేదో అనే దిగులు వుంది అందుకే నేను సంతోషంగా లేను అంటారు. ఒక గృహస్తు వద్దకు వెళ్లి అడిగితే తన సంపాదన తన అవసరాలకు సరిపోవటం లేదు అందుకే నేను సంతోషంగా లేను అని అంటాడు . ఇలా ప్రతివానికి ఏదో ఒక దిగులు, వెలితి జీవితంలో చోటు చేసుకుంటుంది. లేని వారికి లేదని దిగులు. ఉన్నవానికి ఉన్న దాన్ని కాపాడుకోవడం ఎలా అనే దిగులు. ఇలా చెప్పుకుంటూ పోతే దిగులు, విచారం, అసంతృప్తి లేని మనిషి లేనే లేడనేది సత్యం. ఎన్ని బాధలు ఉన్నా తాను సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అంతేకాక తాను సంతోషంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు కూడా. ఒక ప్రయత్నం తరువాత ఒక ప్రయత్నం సాగిస్తూనే వుండాడు. కానీ జీవితం విచిత్రమైనది ఒకటి సాధిస్తే మనస్సు దాని తర్వాత ఇంకొకటి కోరుతుంది. అదే అవసరాలు, కోరికలు. ఈ ఆధునిక యుగంలో ఎన్ని వున్నా కూడా మనిషి ఇంకా ఇంకా ఇంకొకటి కావాలని కోరుకుంటున్నారు. గతంలో నీకు లేనిది ఇప్పుడు వచ్చింది కదా మరి దానితో నీవు సుఖంగా ఉండొచ్చు కదా అంటే లేదు నీకు వెంటనే ఇంకొకటి కావాలని కోరిక కలుగుతుంది. నీకు ఫాను కావలి గాలి ఆడడం లేదు అన్నావనుకో ఫ్యాను పొందితే చల్లని గాలి కావలి ఏరుకులర్ కావలి అంటావు. అది వచ్చిన తర్వాత ఎయిర్ కండిషనర్ కావాలి అంటావు. అంటే మనిషి ఒకటి పొందిన తరువాత దానితో తృప్తిగా లేకుండా అంతకన్నా మెరుగైనది ఇంకొకటి కావాలనే వాంచ కలుగుతున్నది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఏదీ కూడా నిన్ను సంతోష పెట్టటం లేదు ఇంకొకటి ఉంటే సంతోషంగా వుంటాను అనుకుంటావు కానీ అది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వటంలేదు. మరి నీవు ఎప్పుడు సంతోషంగా వున్నావు అంటే భవిష్యత్తులో ఉండొచ్చేమో అని అంటావు. "తృప్తస్య భవిష్యామి" నిజానికి బౌతికంగా వున్నది ఏదైనా కొంతకాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది. అది ఒక నిమిషమో, రోజో లేక కొన్ని రోజులో ఇంకా అయితే కొన్ని సంవత్సరాల్లో. కానీ యదార్ధం ఏమిటంటే ఏది కూడా నీకు జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు.
ఈ సృష్టిలో ఒక నియమం వున్నది అదేమిటంటే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు అభివృద్ధి వైపు కావచ్చు లేక వినాశనం వైపు కావచ్చు. ముందుగా అభివృద్ధి వైపు అయితే అవ్వ వచ్చు కానీ కాలాంతరంలో వినాశనం వైపుకు మళ్లుతుంది. అదే విధంగా మనిషి జీవితంలో కూడా ఒక వయస్సులో సంతోషాన్ని ఇచ్చేది కాలాంతరంలో వయస్సు పెరిగినప్పుడు అదే వస్తువు సంతోషాన్ని ఇవ్వలేదు. అదే అంటే అదే కాదు అలాంటిదే ఇంకొక క్రొత్తవస్తువు కూడా. ఉదాహరణకు నీవు చిన్నగా వున్నప్పుడు మూడు చక్రాల చిన్న సైకిలు నీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నీవు కొంత పెరిగి రెండు చక్రాల సైకిలు తొక్కటం అలవాటు అయినప్పుడు నీకు మూడు చక్రాల సైకిలు అస్సలు నచ్చదు. మరి రెండు సంవత్సరాల క్రింతం వరకు అది నీకు ఇష్టమైన వస్తువు కదా మరి ఇప్పుడు ఎందుకు కాదు అంటే. ఇప్పుడు నీవు దానికన్నా సౌకర్యంగా వున్న వస్తువు నిన్ను ఆకర్షించింది. అంతే కాదు నీవు ఇంకా కొంత పెరిగిన తరువాత మోటారు సైకిలు ఫై నీ మనస్సు ఆకర్షితం అవుతుంది. అది లభిస్తే సైకిలు నీకు నచ్చదు. అంటే ఎప్పుడు నీవు ఉన్నదానికన్నా మెరుదైనదే ఆనందాన్ని ఇస్తున్నది. దీనిని బట్టికూడా మనకు బాధపడేది ఏమిటంటే మన కోరికలు మారుతున్నాయి. అంటే ఉన్నదానికన్నా మెరుగైనది మనస్సు సదా కోరుకుంటున్నది.
మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.
ఈ ప్రపంచాన్ని చుస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ ప్రతిదీ మారుతున్నది. మారేది ఏది నీకు శాశ్విత సుఖాన్ని ఇవ్వటంలేదు. ఇంకొక సత్యం కూడా నీకు అవగతం అవుతుంది నీకు సుఖాన్ని ఇచ్చింది కాలాంతరంలో దుఃఖదాయకంగా మారుతున్నది.
మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.
సృష్టిలో సదా మారకుండా ఉండేది ఏదైనా ఉంటే అది నీకు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వవచ్చు. మరి సృష్టి నియమమే మార్పు కదా మరటువంటప్పుడు మారకుండా ఉండేది ఏది.
ఆ శోధన ఫలితమే మనకు మన మహర్షులు ప్రబోధించిన ఉపనిషత్ జ్ఞ్యనం. అఖండ జ్ఞ్యాన సంపన్నులైన మహర్షులు వారి వారి అనుభవాలతో తెలుసుకున్న సత్యాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మనకు ఇచ్చిన జ్ఞ్యానమే బ్రహ్మ జ్ఞ్యానం ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం. సాధకుడు నిత్య సాధనతో తెలుసుకోవలసిన సత్యమే బ్రహ్మ జ్ఞ్యానం. కాబట్టి ప్రతి సాధకుడు తనకు తానుగా తెలుసుకోవలసింది బ్రహ్మ జ్ఞ్యానం మాత్రమే. కాబట్టి సాధక ఇప్పుడే మేల్కొని నిత్యసాధన పరుడవు కమ్ము సదా సంతోషపరుడవు కమ్ము.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతిశాంతిహి
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి