18, అక్టోబర్ 2022, మంగళవారం

క్షౌరకర్మను గురించి

 

క్షౌరకర్మను గురించి శాస్త్రము ఒక క్రమపద్ధతిని నిర్దిష్టపరచినది.

మనలో చాలామంది ఆదివారం సెలవు అని ఆదివారం నాడు  క్షౌరకర్మ (Hair Cutting) కు వెళుతుంటారు.  నిజానికి ఆదివారం పనికిరాదని చాలామందికి తెలియదు.  ఏ ఏ వారాలు ఏ ఎ తిధులు క్షౌరకర్మను ఆచరించాలని మన శాస్త్రాలు తెలుపుతున్నాయో తెలుసుకుందాం. 

ఈ క్రింది తిధుల యందు క్షుర కర్మ నిషేధం. అవి.

ఏకాదశీ, చతుర్దశీ, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి (భద్రా) ఇత్యాదులయందు, మరియు వ్రతదినములయందు, శ్రాద్ధదినముల యందు, 

ఇక వారములు మంగళ,, శనివారములయందు క్షౌరకర్మ పనికిరాదు. ఆదివారము క్షౌరము చేయించుకొనుటవలన ఒకమాసము ఆయువును, శనివారము క్షురకర్మ చేయించుకొనుటచేత ఏడుమాసములు ఆయువును, భౌమవాసరము (మంగళవారము) వలన ఎనిమిది మాసముల ఆయువును, ఆయా దినములకు చెందిన అభిమాన దేవతలు క్షీణింపచేయుదురు. ఇదేవిధముగా బుధవారము క్షౌరము చేయించుకొనుటచే ఐదు మాసముల ఆయుర్దాయమును, సోమవారము వలన ఏడుమాసముల ఆయువును, గురువారమువలన పదిమాసముల ఆయుష్యమును, శుక్రవారమువలన పదునొకండు నెలల ఆయువును, ఆయా దినములయొక్క అభిమానదేవతలు వృద్ధి చేయుదురు. గృహస్థులు మరియు ఒకే ఒక పుత్రుడు గలవారలు సోమవారమునాడు చేయించుకొనగూడదు. అట్లే విద్యను, లక్ష్మిని కోరుకొనెడువారలు క్షురకర్మ చేయించుకొనుట పనికిరాదు. అని ఈవిధముగా గూర్చి గర్గాదిమహర్షులు వచించియున్నారు. 

ఇక బ్రాహ్మణుల క్షౌర విధిని పరిశీలిద్దాం.

  ప్రతి బ్రాహ్మణుడు శిరో ముండన (గుండు)  శిఖదారణ    చేయించుకోవలెను     .

   కేవలం పితృ కర్మలను ఆచరించేటప్పుడే శిఖ ధరించటం ఆనవాయతీగా అనుకుంటున్నాము.  . పౌరోహితం చేసే బ్రాహ్మణోత్తములు విషయం ప్రతి బ్రాహ్మణుడికి తెలపాల్సిన అవసరం వున్నది. . ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు చేకూరుతాయి అన్నది మన మహర్షులు శోధించి సాధించి మనకు ఒక చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారుకేవలం మనం వారిని అనుసరించివాటిని ఆచరించి తరించటమే మన కర్తవ్యము

ఈ విషయములను గీత ప్రెస్ వారి ప్రచురణ "నిత్యకర్మ - పూజా ప్రకాశిక " అను గ్రంధము నుండి సేకరించపడినవి . బ్రాహ్మణులు ఆచరించవలసిన అనేక విషయములను అందు ప్రస్తావించబడెను.  ఆ గ్రంధము ధర వెరసి రూ . 150/- వలసిన వారు గీతాప్రెస్ పుస్తక బండారం నుండి ఖరీదు చేయవచ్చు. సికిందరాబాదు రెయిల్వేస్టేషన్ ప్లాట్ఫారం నెం 1 నందు స్టాలు కలదు. 

 




కామెంట్‌లు లేవు: