24, నవంబర్ 2024, ఆదివారం

మహాకవి భారవి

 |మహాకవి భారవి |

సంస్కృత సాహిత్యమున ప్రౌఢ కావ్య నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన మహాకవులలో భారవి ఒకడు. అతని రచన ' కిరాతార్జునీయము ' మాత్రమే దొరుకుతుంది. ప్రసిద్ధి పొందిన అతని శ్లోకము 

" సహసా విదధీత న క్రియా 

మవివేక:పరమాపదాం

పదo 

వృణుతే హి విమృశ్యకారి

ణం 

గుణాలుబ్దా: స్వయమేవ సంపదః 

-- 

భారవి పేదవాడు. భార్య యొక్క అధిక్షేపాలకు సహించలేక అతడు ఒకనాడు ధనార్జన చేయు తలంపుతో బయలుదేరినాడు. 

ఒక సరస్సు తీరమున విశ్రమించాడు. పండితుడైన భారవికి యొక శ్లోకము స్ఫురించెను. ఆ శ్లోకమును ఒక తామరాకు పై లిఖించాడు. ఆ ప్రాంతపు రాజు వేటకై తిరుగుతు భారవి ఉన్న ప్రదేశమునకు వచ్చియున్నాడు. శ్లోకము రాజుగారు చూచి ఆ శ్లోకమును పఠించి రచనకు ముగ్దుడయ్యాడు. భారవిని మిగుల ప్రశంసించాడు. భారవితో మీకు సమయము దొరికినపుడు తన రాజసౌధానికి రమ్మన్నాడు. రాజుగారు ఆశ్లోకాన్న్ని సువర్ణాక్షరాలతో వ్రాయించి తన శయనమందిరమునoదు 

ఉంచుకొనెను. ఒకనాడు భారవి రాజసందర్శనమునకు వెళ్లెను. కాని అతని దరిద్రవేశము చూచి ద్వారపాలకులు అనుమతించలేదు ఇట్లు కొంతకాలము గడిచెను. 

       మరల ఒకనాడు రాజు వేటకు పోయి నిర్ణీతసమయానికంటే ఆకస్మికముగా తిరికి వచ్చెను. 

తన శయ్య పై రాణి యెవనినో ఆలింగనము చేసుకొని నిద్రించుట చూచెను. క్రుద్ధుడై ఆ ఇరువురిని సంహరింప కత్తి నెత్తినాడు. దైవికముగా అతని దృష్టి గోడపై ఉన్న సువర్ణలిఖిత శ్లోకము మీద ప్రసరించెను. వెంటనే మనసు కుదుట పడింది. వారిని రాజు మేల్కొల్పాడు. విచారించగా ఆపురుషుడు యువరాజని తేలినది. అతడు బాల్యముననే అపహరణకు గురియైనాడు. 

తిరిగి నాటి సాయంకాలముననే రాజప్రాసాదమునకుఁ వచ్చినాడు. పుత్రుని విడవలేక మాతృవాత్సల్యము తో శయ్య పై పరుండ బెట్టినది. 

     తనను మహావిపత్తునుండి రక్షించిన ఆ శ్లోకము రచించిన భారవిని వెతికి రాజ సౌధమునకు పిలిపించి భూరిగా సత్కరించెను.

కామెంట్‌లు లేవు: