*🙏జై శ్రీమన్నారాయణ 🙏*
24.11.2024,ఆదివారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
కార్తీక మాసం - బహుళ పక్షం
తిథి:నవమి రా11.37 వరకు
వారం:భానువాసరే (ఆదివారం)
నక్షత్రం:పుబ్బ రా12.20 వరకు
యోగం:వైధృతి మ3.17 వరకు
కరణం:తైతుల ఉ10.53 వరకు
తదుపరి గరజి రా11.37 వరకు
వర్జ్యం:ఉ7.01 - 8.45
దుర్ముహూర్తము:మ3.51 - 4.35
అమృతకాలం:సా5.25 - 7.09
రాహుకాలం:సా4 30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:6.13
సూర్యాస్తమయం:5.20
ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించిన దార్శనికుడు..
డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి ..!
స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడిగా చెరగని ముద్ర వేశారు. అంతకుమించి వైద్యుడిగా, తెలుగు భాషాభిమానిగా, స్వాతంత్య్ర సమరశీలిగా మన్ననలు అందుకున్నారు. మహాత్ముడికి ఆప్తుడిగా, ప్రజా సేవకుడిగా, ముక్కుసూటి మనిషిగా పేరొందారు. ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు... ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించి దార్శనికుడిగా నిలిచారు. వైద్యవృత్తిని ప్రజా శ్రేయస్సుకోసం ఉపయోగించడమే కాదు, ఆర్థిక వ్యవహారాలను ఆమూలాగ్రం అధ్యయనం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో 1880 నవంబర్ 24న పట్టాభి సీతారామయ్య జన్మించారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు లాంటి గురువుల శిక్షణలో పట్టాభి రాటుదేలారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్రోద్యమ కాంక్ష కలిగిన పట్టాభికి మద్రాస్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలు, ఆనందమోహన్ బోస్ ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి. 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు వంటివారితో కలసి అవిశ్రాంతంగా పోరాడారు.
నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీలేని నాయకుడు. జన్మభూమి, అమ్మభాష అంటే ఎనలేని మమకారం. అభిప్రాయ భేదాలొస్తే పార్టీలో ఎంతటి వారితోనైనా ఢీ అంటే ఢీ అనగల ధీశాలి. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలు అందించిన గొప్పనేతగా ఖ్యాతి గడించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య....1959 డిసెంబర్ 17న తుదిశ్వాస విడిచారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి