అణుమాణః చతుష్టయం.అని వేదం అరుణ ప్రశ్న వివరించుచున్నది. శక్తి నాలుగు రకములుగా మార్పు చెంది యున్నది. అది సూర్యశక్తియని. బాల్య యౌవన కౌమార వార్థక్యపు లక్షణ రూపమని. వీటిలో యౌవన దశ ముఖ్యమైనది జీవ సృష్టికి మూలం. మిగిలిన అవస్థలలో దీని వృధ్ది లక్షణము ఫలవంతము లేనిది. అందుకే దైవ శక్తి నిత్య యౌవనమని సృష్టి నిరంతరం సలక్షణమైనదిగా యుండుటయే ప్రధానము. ఫలవంతము కూడా. ప్రకృతి కూడా ఫలవంతము రెండవదశలోనే దానిలక్షణము. కాని అది తెలియవలెనన్న రసస్ఫూర్తి కలిగికలిగుటయను యౌవనమని రెండవదశ. దాని లక్షణము తెలియవలెనన్న ఫలముకూడా రెండవ దశలోనే. పండిన తరువాత కొంత శక్తి తగ్గును. అణువు వ్యాప్తమైనగానిఅనగా రెండవదశ లక్షణము తెలియును. నాలుగు దశల్లో వున్ననూ రెండవ దశలోనే దాని విషయం అవగాహన. మెుదటి దశ అనగా ఏకం యని వకటిగా వున్న తత్వం ఏమీ తెలియదు. అంతా వకటే యంటే దాని ఫలం ఎలా తెలియాలి. తెలియకపోతే లక్షణం అనుభవంలోకి రాదు. అదియే రెండవ ద్వీ అనే దశ . అగ్ని హోమంలో,అలాగేమానవ నిజ జీవితంలో కూడా వకే సూత్రము.యిది మానవునికే తెలియును. అటుపై మూడు, నాలుగు దశలు దాని లక్షణము మారిపోవుచున్నది. నిష్ఫలం అగు చున్నది. ఫలం లేనిది.ఏకమేవాద్వితీయం బ్రహ్మ. రెండుగా మారిన ఆపై అది ఎన్నైనా కావచ్చు. అనంతమగుటకు వ్యాప్తిని ఆ అనగా వ్యాప్తిని అణువు వ్యాప్తిని తెలుపు చున్నది. రెండవ దశ. ప్రారంభమైన రెండవ లక్షణము దెలియును. అక్కడితో స్వరూపం తెలియును. ప్రారంభము లేనిది వ్యాప్తి తెలియదు. యిది అన్నింటికి వకే సూత్రం. తెలిసి ప్రారంభం చేయవలెను. యిదియే భగవతత్వం. అది తెలియుటయే ఙ్ఞానం. ఙ్ఞానం వలననే ఆచరణ. అనగా రెండవ తత్వం. అణుం ఆణః చత్వారిః ఉష్ఠ యం. యత్ పూర్ణం ఉష్ఠ చతుర్దశి యని.యేదైతే పూర్ణమైన శక్తి చైతన్యమైనదో దాని దశలు నాలుగు యని అక్కడ నుండి అనంతమని జీవ పరిణామ లక్షణము. పూర్ణము మెదటి దశ అణవుయని దాని విభజనరూపంలోఅనగా చైతన్యమైనదే రెండవది. దానిని సూత్ర పరంగా విభజన చేయుటయే ఙ్ఞానం. మూడవదశ నాల్గవ దశలక్షణములు తెలుస్తూనే వున్నవి ప్రాకృతికంగా ప్రత్యక్షంగా. కాని అవి స్థిరంగా వుండవు. దాని శక్తి లక్షణము మారిపోవుచున్నది.అనగా విలువ లేనిదై యున్నది. మార్పు కల ప్రతీదీ భ్రాంతి. శక్తి రూప పదార్ధము కూడా భ్రాంతియే. పదార్ధమనగా దేహమునకు శక్తియున్నది అది మార్పు చెందినది. లేనియెడల పదార్ధ లక్షణము తెలియదు.ఓం నమః ప్రణవంతో కూడినది. ప్రణవం పదార్ధ లక్షణము నమః. నమః పూర్వ లక్షణము ప్రణవం ఓంకారమని శివ సంకల్పం తెలుపు చున్నది. ఓం అనే శక్తి మెుదటిదైతే రెండవది నమః యని. అటుపిమ్మట శివ తత్వం. శరీర తత్వం శివ. మ పదార్ధ రూపం శరీరం. శరీరమే న ఎన్ యని యత్ అణః న అనే శక్తికి రూపం. అనంతమైన విజ్ఞానము తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి