*దశమహా విద్యలు*
విద్య అంటే సరైన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిణి అయిన శక్తి ధరించిన పది రూపాలే దశ మహా విద్యలు. తంత్ర శాస్త్రం లో శక్తి ఉపాసనను విద్య అంటారు. తోడల తంత్రం లో దశమహా విద్యల సాధన ఉంటుంది.
అజ్ఞానం పాపానికి కారణమౌతుంది. పాపం దుఃఖానికి కారణం. జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది. పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు పది అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు. జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు? మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?
మహా విద్య పది అవతారాలు – ఒక్కో అవతారం యొక్క అంతరార్థం
మహావిద్య పది అవతారాలలో ఒక్కో అవతారం ఒక్కో విధమైన శక్తికి ప్రతీక.
కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
భగళా సిద్ధ విద్యాచ మాతంగీ కమలాత్మికా
యథా దశమహా విద్యాః సిద్ధి విద్యా ప్రకీర్తితా ||
కాళి – బ్రహ్మానికి అసలు రూపం. కాల స్వరూపం కాళిక. కాళిక వాక్కుకు శక్తినిస్తుంది.
తార – తార అభయప్రదాత. ఆమె ఆపదలనుండీ కాపాడుతుంది. మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
త్రిపుర సుందరి/ షోడశి– ఈమెను తాంత్రిక పార్వతి అంటారు. అమ్మ త్రిభువన సౌందర్య రాశి.
భువనేశ్వరి – సకల భువనాలకు భువనేశ్వరీ దేవి అధిదేవత. సకల సృష్టి అమ్మ రూపం లో ఇమిడి ఉంటుంది.
భైరవి– దుష్టులను శిక్షించి, సజ్జనులను రక్షించడం భైరవి లక్షణం. దుష్టులు అంటే మనలోని దుష్టమైన ఆలోచనలను నశింపజేసి సద్బుద్ధిని కలిగిస్తుంది. చెడుతో పోరాడే శక్తినిస్తుంది.
ఛిన్న మస్త– ఛిన్న అంటే తెగిన అని అర్థం. మస్త అంటే మస్తకం. ఈమె తన తలను తానే ఖండించుకుని మొండెం నుండీ చిందుతున్న రక్తాన్ని ఖండించబడ్డ శిరసుతో తాగుతూ కనిపిస్తుంది. శరీరం తో ముడిపడ్డ మోహాన్ని, అహాన్ని ఖండించి ఆత్మ జ్ఞానాన్ని అందించడమే ఛిన్నమస్త రూపం లోని ఆంతర్యం.
ధూమవతి – ఈమె వైధవ్యం లో ఉన్న వృద్ధ స్త్రీ రూపం లో ఉంటుంది. ఈమెను మృత్యుదేవత అని కూడా అంటారు.
భగళా ముఖి – భగళాముఖి శత్రువులను నిర్వీర్యం చేసే శక్తినిస్తుంది.
మాతంగి– అమ్మ శ్యామల రూపంతో మరకత మణివలే ప్రకాశిస్తుంది. అందుకే శ్యామలా దేవి అంటారు. నీల సరస్వతి అని అమ్మకు పేరు. ఈమె సకల విద్యా దాత్రి. వనవాసినియై ఉంటుంది.
కమలాత్మిక– ఈమె లక్ష్మీ దేవికి తాంత్రిక రూపం.
3. దశమహావిద్యలను సామాన్యులు ఆరాధించవచ్చా?
దశ మహావిద్యలను నిరభ్యంతరంగా ఎవరైనా ఆరాధించవచ్చు. అమ్మను కొలవడానికి అందరం అర్హులమే. ఆరాధించ దలచినవారు ముందుగా ఎవరైనా ఉపాసకులను , గురువులను దర్శించి విధి విధానాలను తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి. దశమహావిద్యా స్తోత్రాన్ని పఠించడం వల్ల విద్యా, సంపదలు ఆ ఇంట వెల్లివిరుస్తాయి.
-: దశ మహావిద్యా స్తోత్రం :-
దశమహావిద్యాస్తోత్రమ్ ॥
ఓం నమస్తే చండికే చండి చండ ముండవినాశిని ।
నమస్తే కాలికే కాలమహాభయవినాశిని ॥ 1॥
శివే రక్ష జగద్ధాత్రి ప్రసీద హరవల్లభే ।
ప్రణమామి జగద్ధాత్రీం జగత్పాలనకారిణీమ్ ॥ 2॥
జగత్ శోభకరీం విద్యాం జగత్సృష్టివిధాయినీమ్ ।
కరాలాం వికటాం ఘోరాం ముండమాలావిభూషితామ్ ॥ 3॥
హరార్చితాం హరారాధ్యాం నమామి హరవల్లభామ్ ।
గౌరీం గురుప్రియాం గౌరవర్ణాలఙ్కారభూషితామ్ ॥ 4॥
హరిప్రియాం మహామాయాం నమామి బ్రహ్మపూజితామ్ ।
సిద్ధాం సిద్ధేశ్వరీం సిద్ధవిద్యాధరఙ్గణైర్యుతామ్ ॥5॥
మన్త్రసిద్ధిప్రదాం యోనిసిద్ధిదాం లిఙ్గశోభితామ్ ।
ప్రణమామి మహామాయాం దుర్గాం దుర్గతినాశినీమ్ ॥ 6॥
ఉగ్రాముగ్రమయీముగ్రతారాముగ్రగణైర్యుతామ్ ।
నీలాం నీలఘనశ్యామాం నమామి నీలసున్దరీమ్ ॥ 7॥
శ్యామాఙ్గీం శ్యామఘటితాం శ్యామవర్ణవిభూషితామ్ ।
ప్రణమామి జగద్ధాత్రీం గౌరీం సర్వార్థసాధినీమ్ ॥ 8॥
విశ్వేశ్వరీం మహాఘోరాం వికటాం ఘోరనాదినీమ్ ।
ఆద్యామాద్యగురోరాద్యామాద్యనాథప్రపూజితామ్ ॥ 9॥
శ్రీం దుర్గాం ధనదామన్నపూర్ణాం పద్మాం సురేశ్వరీమ్ ।
ప్రణమామి జగద్ధాత్రీం చంద్రశేఖరవల్లభామ్ ॥ 10॥
త్రిపురాం సున్దరీం బాలామబలాగణభూషితామ్ ।
శివదూతీం శివారాధ్యాం శివధ్యేయాం సనాతనీమ్ ॥11॥
సున్దరీం తారిణీం సర్వశివాగణవిభూషితామ్ ।
నారాయణీం విష్ణుపూజ్యాం బ్రహ్మవిష్ణుహరప్రియామ్ ॥12॥
సర్వసిద్ధిప్రదాం నిత్యామనిత్యాం గుణవర్జితామ్ ।
సగుణాం నిర్గుణాం ధ్యేయామర్చితాం సర్వసిద్ధిదామ్ ॥ 13॥
విద్యాం సిద్ధిప్రదాం విద్యాం మహావిద్యాం మహేశ్వరీమ్ ।
మహేశభక్తాం మాహేశీం మహాకాలప్రపూజితామ్ ॥ 14॥
ప్రణమామి జగద్ధాత్రీం శుమ్భాసురవిమర్దినీమ్ ।
రక్తప్రియాం రక్తవర్ణాం రక్తబీజవిమర్దినీమ్ ॥ 15॥
భైరవీం భువనాం దేవీం లోలజివ్హాం సురేశ్వరీమ్ ।
చతుర్భుజాం దశభుజామష్టాదశభుజాం శుభామ్ ॥ 16॥
త్రిపురేశీం విశ్వనాథప్రియాం విశ్వేశ్వరీం శివామ్ ।
అట్టహాసామట్టహాసప్రియాం ధూమ్రవినాశినీమ్ ॥ 17॥
కమలాం ఛిన్నభాలాఞ్చ మాతఙ్గీం సురసున్దరీమ్ ।
షోడశీం విజయాం భీమాం ధూమాఞ్చ వగలాముఖీమ్ ॥ 18॥
సర్వసిద్ధిప్రదాం సర్వవిద్యామన్త్రవిశోధినీమ్ ।
ప్రణమామి జగత్తారాం సారాఞ్చ మన్త్రసిద్ధయే ॥ 19॥
ఇత్యేవఞ్చ వరారోహే స్తోత్రం సి
ద్ధికరం పరమ్ ।
పఠిత్వా మోక్షమాప్నోతి సత్యం వై గిరినన్దిని ॥ 20॥
ఇతి దశమహావిద్యాస్తోత్రం సమ్పూర్ణమ్ ।
ఓం శ్రీ మాత్రే నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి