శ్లోకం:☝️
*కాచం మణిం కాంచన మేకసూత్రే*
*గ్రథ్నాసి బాలే కిము చిత్రమేతత్*
*అశేషవి త్పాణిని రేకసూత్రే*
*శ్వానం యువానం మఘవానమాహ*
అన్వయం: _కాచం మణిం కాంచనం ఏకసూత్రే గ్రథ్నాసి |_
_(హే) బాలే! కిము చిత్రం ఏతత్ ?_
_తాం ఆహ | అశేషవిత్ పాణినిః , ఏకసూత్రే శ్వానం యువానం మఘవానం (స్థాపితవాన్ ఖలు) |_
భావం: ఒక బాలిక గాజుముక్కను, మణిని, బంగారాన్ని కలిపి ఒకే సూత్రం (దారం)లో గ్రుచ్చి ఆడుకుంటున్నది.
దాన్ని చూచి ఒకాయన - ఓ బాలా! నీవు విలువైన మణిని, సాధారణమైన గాజుముక్కతో కలిపి ఒక చోట కడుతున్నావు ఏమి ఆశ్చర్యం ? - అని ప్రశ్నించాడు.
దానికి ఆ అమ్మాయి - అయ్యా! సర్వజ్ఞుడైన పాణిని కుక్కను, ఇంద్రుని, యువకుణ్ని ఒక్క సూత్రంలో బంధించలేదా? అంతటివాడు ఆ పని చేయగా లేనిది నేను ఒక దారంలో వీటిని చేర్చటం తప్పా? - అని చమత్కారంగా అడిగింది.
ప్రాచీన భారతదేశంలో చిన్నపిల్లలు, పనివాళ్ళు అని కాక అందరికీ ఎంతో కొంత శాస్త్ర జ్ఞానం ఉండేది అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!
పాణిని అష్టాధ్యాయిలో
*శ్వయువమఘోనామతద్దితే* - అనే సూత్రం అయా శబ్దాలకే చెప్పారు. కానీ ఆ బాలిక సూత్రంలో ఉన్న అర్థాలను చమత్కారంగా ఉపయోగించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి