సముద్ర జలం
ఆనంద స్వరూపం అనే ప్రకరణలో భగవంతుడు ఆనంద స్వరూపుడు అని అర్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు మనిషి ఎలా ఆనంద స్వరూపుడో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు సముద్రం అంటే జల నిధి. ఏ కాలంలో అయినా సముద్రం సదా నీటితోనే ఉంటుంది. సముద్రం ఎండిపోవడం అనేదే ఉండదు.
సముద్రంలోనుంచి ఒక గ్లాసులో (ఘటంలో) నీటిని తీసుకున్నామని అనుకోండి ఇప్పుడు ఆ నీటిని సముద్రం అని ఆనం కేవలం గ్లాసెడు (ఘటికా జలం ) నీళ్లు అనే అంటాం. వాటిని మీరు సముద్రం నుంచి దూరంగా తీసుకొని వెళ్లినా ఆ నీటికి సముద్రపు నీటి తత్వమే ఉంటుంది కానీ వేరే విధంగా వుండవు. ఎంతవరకు ఆ నీరు గ్లాసులో వుంటాయో అంతవరకూ ఆ గ్లాసుని నీటి గ్లాసు అని అంటాము. ఏదైనా చిల్లి కలిగినదంటే గ్లాసులోని నీరు కారి అలానే గాలికో లేక ఏదైనా తాకటం వలన కూడా గ్లాసు క్రిందపడితే నీరు పూర్తిగా కారిపోతాయి.
ఇప్పుడు గ్లాసుని (ఘటాన్ని) మానవ శరీరంగా అనుకుందాము. అలానే గ్లాసులోని సముద్రపు నీటిని దైవ శక్తిగా అనుకుందాం.యంతవరకు గ్లాసు సముద్రపు నీటిని కలిగి ఉందొ అంతవరకు దానిని నీటీగ్లాసు అని అన్నావు. ఆ నీరు కారిన మరుక్షణం కాళీ గ్లాసు అయ్యింది. ఈ గ్లాసు (ఘటాన్న) మన్నుతో తయారు చేశారు అంటే ఇది పంచ భౌతిక మైనది. కానీ అందులో బిన్నంగా సముద్ర జలం వచ్చి ఆశ్రయం తీసుకుంది. ఈ గ్లాసు నిర్మాణానికి సముద్ర జలానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం జలం గ్లాసుపై ఆధారపడి వున్నాయి. అదే గ్లాసు బదులుగా బిందె, చెంబు, గరిట, గంగాళం ఇలా ఏ పాత్ర ఐయినా సముద్ర జలానికి ఆశ్రయం ఇవ్వవచ్చు. పాత్రలు వేరైనా జలం మాత్రం ఒక్కటే. పాత్ర పేరుతొ కలిపి జలాన్ని పిలుస్తాము. ఉదా : గ్లాసెడు నీళ్లు, చెంబెడు నీళ్లు, బక్కెట్ నీళ్లు ఇలా ఎప్పుడైతే ఆయా పాత్రలలో నీరు కాళీ అవుతుందో అన్నిపాత్రలు కాళీ పాత్రలే.
ఇక్కడ మనం పేర్కొన్న పాత్రలను మనం చూస్తున్న భౌతిక శరీరాలు అంటే మనిషి శరీరం, కుక్క శరీరం, ఏనుగు శరీరం, బల్లి శరీరం ఇలా అన్న మాట. వీటన్నిటిలో సముద్ర జలం లాగ ఉండేది మాత్రం ఆ పరబ్రహ్మ మాత్రమే అంటే దైవశక్తి మాత్రమే. ఆ శక్తి తొలగినప్పుడు అన్నీ కాళీ పాత్రలే అంటే పార్థివ శరీరాలే.
సముద్రపు జలం వున్నప్పుడు ఎలా ఐయితే పాత్రలకు గుర్తింపు వస్తుందో అలానే జంతు శరీరాలకు దైవశక్తి ఉన్నంతవరకే గుర్తింపు ఉంటుంది.
అన్ని పాత్రలల్లో ఉండేది జలం మాత్రమే అదే విధంగా అన్ని శరీరాలు కూడా దైవ శక్తి సమన్వితమే . ఈ సత్యాన్ని మరచి మనం పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చే పాత్ర వహిస్తున్నాము.
భగవంతుని స్వరూపం ఆనందం కాబట్టి ఆ భగవంతుని అంశ కలిగిన మానవులు అందరు ఆనంద స్వరూపులే కానీ మరొకటి కాదు..
తాత్కాలిక బ్రాంతి: మనిషి తన వద్ద వున్న డబ్బులతో ఆనందాన్ని కొనుక్కోవటానికి సదా ప్రయత్నిస్తాడు. దాని పరియసానమే ఐహిక మైన సుఖాలు, సంతోషాలు. అవే శాశ్వితం అని వాటి వెంట పరుగులిడుతున్నాడు.
భగవంతుని ద్వారా లభించే ఆనందమే శాశ్వితం నిత్యం అయినది. దానిని పొందటానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. కేవలం సాధన చేస్తేనే అది లభిస్తుంది.
సాధన ఎలా చేయాలి: సాధన చేయటానికి సద్గురువు ఆశ్రయం పొందాలి. సద్గురువుకి ఎలాంటి డబ్బులు చెల్లించ గూడదు. కేవలం సేవ చేయటం వలనే గురువు ప్రసన్నుఁడు అవుతాడు. అయన చేసే ఉపదేశంతో సాధన చేయాలి తరువాత నిత్యం, సత్యం అయిన సామాది స్థితిని పొంది యోగి సదా ఆనందపరవశుడు అవుతాడు. అప్పుడు గురువుతో పనిలేదు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి