*1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.*
*2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*
*3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*
*4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*
*5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు.*
*6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.*
*7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.*
*👉 వృక్షాలు దైవ స్వరూపాలే.*
*👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.*
*👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.*
*👉 గాలి కూడా దైవ స్వరూపమే.*
*👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.*
*👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.*
*👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.*
*8. నువ్వూ దైవ స్వరూపమే.*
*నేనూ దైవ స్వరూపమే.*
*చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)*
*దైవ స్వరూపాలే.*
*9. చతుర్వేదాలు, నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం,* *హిందూధర్మం.*
*మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.*
*కర్మల గురించి తెలియాలంటే ......*
*👉 వేదాలు చదవాలి.*
*సమస్త జ్ఞానం పొందాలంటే ......*
*👉 ఉపనిషత్తులు చదవాలి.*
*పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......*
*👉 రామాయణం చదవాలి.*
*రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......*
*👉 మహాభారతం చదవాలి.*
*భగవంతుని తత్త్వం తెలియాలంటే ......*
*👉 భాగవతం చదవాలి.*
*చక్కటి పరిపాలన అందించాలంటే ......*
*👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.*
*అన్యోన్య దాంపత్యానికి ......*
*👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.*
*చక్కటి ఆరోగ్యానికి ......*
*👉 ఆయుర్వేదం చదవాలి.*
*మేథస్సుకు ......*
*👉 వేద గణితం చదవాలి.*
*శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......*
*👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.*
*భవన నిర్మాణాలకు ......*
*👉 వాస్తుశాస్త్రం చదవాలి.*
*గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......*
*👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.*
*11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.*
*12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)*
*13. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.*
*14. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.*
*15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.*
*16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం.*🙏🙏🙏 సే క ర ణ: వేదుల జనార్ధన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి