*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
ఒక పాము ఒక వడ్రంగి దుకాణంలోకి దూరి, అక్కడ వున్న ఱంపం పై నుండి పాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది.
వెంటనే పాము కోపముతో ఱంపమును గట్టిగా కరిచింది.
ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది.
పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, ఱంపం తనపైన దాడి చేస్తుందనుకొని, వెంటనే ఱంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా ఉపయోగించి, ఱంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది.
మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికీ అసలు జరిగిన దానికీ సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగి పోతుంది.
జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా ఉండాలి. కొన్ని సార్లు అసలు రియాక్ట్ కాకపోవడమే ఆరోగ్యానికి మంచిది.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి