21, ఏప్రిల్ 2021, బుధవారం

*శ్రీరామ పట్టాభిషేక మ‌హోత్స‌వం

 *శ్రీ‌రామాయ‌ణ దివ్య‌క‌థా పారాయ‌ణం*


          *9 వ రోజు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీరామ పట్టాభిషేక మ‌హోత్స‌వం*


సీతా ల‌క్ష్మ ణ స‌మేతంగా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అయోధ్య‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు సంబ‌రాల‌లో మునిగితేలుతున్నారు.

శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్నణులు, కన్యలు, యోధులు వారిని అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు.  వేద‌వేత్త‌లు మంత్ర‌ప‌ఠ‌నంసాగిస్తున్నారు.ర‌త్న‌కిరీటాన్ని వ‌శిష్ఠుల‌వారు రాముడి శిర‌స్సుపై అలంక‌రింప చేశారు .

 ప్ర‌జ‌లు  జ‌య‌జ‌య‌ధ్వానాలు చేశారు.

. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రాముని వ‌ద్ద‌ సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.


యువరాజుగా ఉండమ‌ని లక్ష్మణుడిని కోరాడు. ల‌క్ష్మ‌ణుడు  అందుకు సమ్మతించలేదు. భరతునకు యువరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.

ప్రజలు  ధర్మపరాయణులై ఉండేవారు.


 ఎవ‌రి నోట విన్నా  రామ‌, రామ , రామ అన్న మాట త‌ప్ప మ‌రో మాట లేదు.


                            **

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

                             **

ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.


        **

*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే*

*సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే*

       ***

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

 శ్రీరామ రామ 

రఘునందన రామ రామ!

 శ్రీరామ రామ 

భరతాగ్రజ రామ రామ! 

శ్రీరామ రామ 

రణకర్కశ రామ రామ!

 శ్రీరామ రామ శరణం

 భవ రామ రామ!

 శ్రీరామ చంద్ర చరణౌ

 మనసా స్మరామి!

 శ్రీరామ చంద్ర చరణౌ

 వచసా గృహ్ణామి! 

శ్రీరామ చంద్ర చరణౌ

 శిరసా నమామి! 

శ్రీరామ చంద్ర చరణౌ 

శరణం ప్రపద్యే!.

                         **

                         *ఫలశ్రుతి*


వాల్మీకి రచించిన  శ్రీ‌రామాయ‌ణాన్ని చదివినవారు,

 విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్యసంపదలను పొందుతారు.

వారికి కీర్తి, విజయం, చిరాయువు లభిస్తాయి.

 కష్టాలను అధిగమిస్తారు.  . సత్సంతానాన్ని పొందుతారు.

దీర్ఘాయుష్మంతులౌతారు. స‌క‌ల శుభాలూ పొందుతారు.


ఈ రామాయణం శ్రద్ధగా చదివేవారియందు, వినేవారియందు

 శ్రీరాముడు దయాపరుడై ఉంటాడు.


*రామాయణ పారాయణ* *జరుగుతున్న ప్రతిచోటా*

 *హ‌నుమ  ప్ర‌త్య‌క్ష‌మై  ఆనంద పార‌వ‌శ్యంతో రామకథను వింటుంటాడు.*

*సదా రామభక్తులను కంటికి రెప్పలాకాపాడే బాధ్యత తీసుకుంటాడు.*

                       **

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !

తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ !!

                        **


*హనుమంతుని ద్వాదశనామాలు*


హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః

రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః

ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః

లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

 స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః,

 తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్

                             **

 యదక్షరపదభ్రష్టం మాత్రాహీనన్తుయద్భవేత్ ।

తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే ॥

          *జై సీతారామ్‌*

             *సర్వే జనా*  

        *సుఖినోభవంతు*

      *సన్మంగళాని భవంతు*


  🛕🛕🛕🛕🛕🛕🛕🛕

కామెంట్‌లు లేవు: