బాహుబలి - సాధారణ హీరో - రాజబాబు
శరీరం లోకి ప్రవేశించిన కరోనా ను ను ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఎదుర్కొంటుంది . మొదటి మూడు రోజులు జరిగే యుద్ధం లో ఇమ్మ్యూనిటి శక్తిని బట్టి మూడు రకాలుగా జరిగే అవకాశం వుంది .
1 బాహుబలి : మన ఇమ్మ్యూనిటి బాహుబలిలా బలంగా ఉంటే వైరస్ ను మూడు రోజుల్లో ఉతికి ఆరేస్తుంది. దీనితో వైరస్ దాదాపుగా చచ్చిపోతుంది . ఇలాంటి పరిస్థితుల్లో దానికి శరీరం లోని ఇతర భాగాలకు వెళ్లే అవకాశం ఉండదు . మూడు రోజుల్లో ఇది దాదాపుగా చచ్చినట్టే . కానీ అప్పుడు టెస్ట్ చేయించుకొంటే పాజిటివ్ వస్తుంది . దీనికి ప్రధాన కారణం వైరస్ మృత దేహం, ముక్కు లో వున్నా టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది . మొదటి మూడు రోజుల్లో చచ్చిన వైరస్ , శరీరం పై దాడి చేసే శక్తి లేక చతికిలబడుతుంది . బాహుబలి ఇమ్మ్యూనిటి కలిగిన వారికి కనీసం దగ్గు జలుబు లాంటి లక్షణాలు రావు . ఇలాంటి వారిని అసిమ్పటోమాటిక్ అంటారు . ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం తక్కువ . వీరి కి తుమ్ములు రావు . దగ్గు ఉండదు . పైగా వైరస్ సగం చచ్చింది . ఇక వీరి నుంచి ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది ? అసలు వీరి నుంచి ఇతరులకు వ్యాపించదా అంటే లేదని చెప్పలేము . వీరి లాలాజలం ద్వారా అంటే స్పూనులు ప్లేట్ లు గ్లాసులు మొదలైనవి షేర్ చేసుకోవడం వల్ల ఇతరులకు వ్యాపించవచ్చు . ఒక వేళ వీరినుంచి ఇతరులకు వ్యాపించినా తక్కువ మొత్తం లో నే వైరస్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల అలాగే ఆ వైరస్ అప్పటికే సగం చచ్చి ఉండడం వల్ల అవతలి వ్యక్తి సీరియస్ గా ఖాయిలా పడే అవకాశం తక్కువ . ఇలాంటి అసిమ్పటోమాటిక్ వ్యక్తుల్లో వాసన రుచి పోవడం తక్కువగా జరుగుతుంది . పది మందిలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇలా జరుగుతుంది .
2 . వ్యక్తి ఇమ్మ్యూనిటి వ్యవస్థ మరీ బలంగా కాకుండా అలాగని బలహీనంగా కాకుండా మధ్య స్థాయిలో అంటే బెంగాలీ క్లాసిక్ సినిమాల్లో హీరో లాగ ఉంటే? : మూడు రోజుల యుద్ధం లో ఫలితం తేలదు. యుద్ధం కొనసాగుతుంది . మూడో రోజు తరువాత వైరస్ ముక్కు నుంచి శరీరం లో ప్రవేశిస్తుంది. వైరస్ తన సంఖ్య ను పెంచుకోవడం ప్రారంబిస్తుంది . ఇలాంటి వారికి జలుబు దగ్గు జ్వరం వొళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి . జ్వరం , తల నొప్పి దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే అప్పటికి వైరస్ శరీరంలోకి ప్రవేశించి మూడు రోజులు లేదా నాలుగు రోజులు అయినట్టు లెక్క . గుర్తుంచుకోండి . జలుబు తల నొప్పి జ్వరం లాంటివి ఇతరత్రా కారణాల వల్ల కూడా రావొచ్చు . కానీ కుటుంబంలో ఒకే సారి లేదా ఒకటి రెండో రోజుల్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఇవే లక్షణాలు వస్తే అప్పుడు అది కరోనా అయ్యే అవకాశం ఎక్కువ . లక్షణాలు కనిపించాక కొంత మంది వెళ్లి టెస్ట్ చేయించుకొంటారు . దాని ఫలితం ఒకటో రెండో రోజుల్లో వస్తుంది . తాము పాజిటివ్ గా తేలిన రోజునుంచి కొంత మంది ఒకటో రోజు రెండో రోజు అని లెక్కించడం మొదలు పెడుతారు . ఇది సరైన పద్దతి కాదు . ఒక వేళ ఒక వ్యక్తి టెస్ట్ result ఒక నెల రోజులు ఆలస్యం అయితే అప్పుడు కూడా ఇలా లెక్కిస్తారా? కాదు కదా ? లక్షణాలు కన్పించిన రోజు నుంచి ఒకటో రోజు .. రెండో రోజు అని లెక్కించాలి . అంటే వైరస్ శరీరం లో ప్రవేశించాక ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగు .. రెండో రోజు అంటే రెండు ప్లస్ మూడు అంటే ఐదో రోజు అవుతుంది . అర్థం అయ్యింది కదా ?
శరీరం లోకి వెళ్లిన వైరస్ అక్కడ glycene ను తినేస్తుంది . glycene దాని ఆహారం . మన శరీరానికి కూడా అది కావాలి . మన శరీరం లో glycene తగ్గడం వల్ల రుచి/ వాసన పొయ్యే అవకాశం వుంది .. నేను చూసిన వారిలో మైల్డ్ లక్షణాలు ఉన్న వారిలో అధిక శాతం మందికి ఇలా రుచి వాసన పొయ్యింది . ఇప్పుడు సెకండ్ లో వేవ్ లో కరోనా లక్షణాలు మారినా ఇలా రుచి వాసన పోవడం మాత్రం ఎక్కువ మందిలో కనిపిస్తోంది . మైల్డ్ లక్షణాలు ఉన్న ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఇలా రుచి / వాసన పోవడం చూసాను . కొంత మందికి రెంటిలో ఒకటే పోతుంది . కొంత మందికి రెండూ పోతుంది . రుచి కన్నా వాసన పొయ్యే వారి సంఖ్య అధికం . లక్షణాలు కనిపించిన ఆరవ లేదా ఏడవ ఒక్కో సారి ఎనిమిదవ రోజు ఇలా రుచి వాసన పోవడం జరుగుతోంది . అంటే అప్పటికి వైరస్ వారి శరీరం లో ప్రవేశించి 6 ప్లస్ మూడు అంటే తొమ్మిది రోజులు లేదా పది, పదకొండు రోజులు అయ్యి ఉంటుంది . అప్పటికి వారికి మిగతా రోగ లక్షణాలు ముఖ్యంగా తల నొప్పి జ్వరం లాంటివి పోయి ఉంటాయి . ఒక విధంగా చెప్పాలంటే రుచి / వాసం పోవడం కరోనా నుంచి వ్యక్తి దాదాపుగా కోలుకున్నారు అని చెప్పడానికి సూచిక . అంటే యుద్ధం దాదాపుగా ముగిసింది . జరిగిన భీకర యుద్ధం లో కాస్త ఆలస్యం అయినా బెంగాలీ హీరో విజయం సాధించాడు . వైరస్ దాదాపుగా చచ్చింది అన్న మాట . { దగ్గు మాత్రం మరి కొన్ని రోజులు కొనసాగుతుంది }
నువ్వుల లడ్డు తినడం ద్వారా మన శరీరానికి తగినంత gylcene అందించవచ్చు . ఇలా చేస్తే పోయిన రుచి వాసన త్వరగా వస్తుంది . పోయిన నాలుగు నుంచి ఆరు రోజుల్లో ఇది తిరిగి వచ్చేస్తుంది . నేను చూసిన వేల మందిలో ఒక్క వ్యక్తికి మాత్రం తిరిగి రావడానికి దాదాపు నెల పట్టింది . ఆలా ఆలస్యం కావడం వల్ల అతనికి కొత్తగా ఆరోగ్య సమస్యలు రాలేదు .
త్రీ రాజబాబు : దాడి చేసింది బలమైన గుండా లు సైన్యం . ఇవతలేమో రాజబాబు . ఇక యుద్ధం ఏమి జరుగుతుంది ? రాజబాబు మూడు రోజుల్లో చేతులు ఎత్తేస్తాడు వ్యక్తి శరీరం లోని ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలహీనంగా ఉంటే మూడు రోజుల యుద్ధం లో వైరస్ విజయం సాధించి ముక్కు నుంచి శరీరం లోకి వెళుతుంది . అప్పుడు జ్వరం దగ్గు లాంటి లక్షణాలు వస్తాయి . వైరస్ క్రమేపీ తన సంఖ్య ను పెంచుకొంటూ పోతుంది . వ్యక్తి బలహీన ఇమ్మ్యూనిటి వ్యవస్థ దీన్ని ఆపలేదు . దీనితో వైరస్ కు అడ్డు అదుపు లేకుండా వ్యక్తి రక్త నాళాల్లో లోని glycene తినేస్తుంది . నేను గమనించిన దాని ప్రకారం డి విటమిన్ లోపము ఉన్న వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ . అప్పుడు రక్త నాళాలు పోరస్ గా మారుతాయి . అంటే వాటి నుంచి రక్తం బయటకు వచ్చే అవకాశం వుంది . ఇలా జరగకుండా చూడడానికి ఆ వ్యక్తి శరీరం రక్తాన్ని చిక్క బరచడం మొదలు పెడుతుంది . చిక్క బడిన రక్తం ఆక్సిజన్ తీసుకొని సామర్త్యాన్ని నెమ్మదిగా కోల్పోతుంది . అందుకే ఇలాంటి వ్యక్తుల్లో ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గి పోతుంది . ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల గుండె పోటు లాంటివి రావొచ్చు . బి 12 లోపం ఉన్న వ్యక్తుల్లో వైరస్ విజృంభించిన దశలో సైటోకిన్ స్ట్రామ్ రావొచ్చు . అంటే ఇమ్మ్యూనిటి వ్యవస్థే పొరపాటున ఆ వ్యక్తి అంగాల పై దాడి చెయ్యడం . భయపడడం వల్ల ఇది మరింత తీవ్రంగా జరిగే అవకాశం వుంది . రక్తం లో గడ్డలు కట్టడం లేదా సీటొకిని స్ట్రామ్ .. ఈ రెండిటిని పట్టించే ఇంటిలోని డాక్టర్ పల్స్ ఆక్సీమీటర్. రాజబాబు ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఉన్న వారికీ ఆంటీ వైరల్ డ్రగ్స్ అవసరం అవుతాయి .
మీ ఇమ్మ్యూనిటి వ్యవస్థ మరీ రాజబాబు లాగా కాకుండా చూసుకోండి . వాక్సిన్ తీసుకోవడం అంటే దాన్ని బలపరచడమే . అంతే కాకుండా డి విటమిన్ కోసం ఎండ , శాఖాహారులు బి 12 విటమిన్ , సి విటమిన్ కోసం నిమ్మ నారింజ , భయానికి దూరంగా ఉండడం , పాజిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండడం , వ్యాయామం అంటే కనీసం ఇరవై నిముషాలు నడవడం , బాగా నిద్ర పోవడం లాంటివి చేస్తే డెబ్భై ఏళ్ళ వ్యక్తి అయినా రాజబాబు లాంటి తన ఇమ్మ్యూనిటి వ్యవస్థను అహుబలిగా కాకున్నా బెంగాలీ హీరో గా మార్చుకోవచ్చు . తొంబై ఏళ్ళ బాహుబలులు వున్నారు . ఇప్పటికైనా మించింది లేదు . భయపెట్టే చెత్త వార్తలు పక్కన పెట్టి మీ ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేసుకోవడం పై ద్రుష్టి పెట్టండి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి