భగవంతుని ఆరాధన ప్రకృతి ఆరాధన. జీవ లక్షణం ప్రకృతియే. ప్రకృతిని తెలియుట జీవ లక్షణము తెలియుటయే. పంచభూతాత్మక శరీరము ప్రకృతి. దానికి మూల కారణము భూమి. యిది ప్రకృతియని తెలిసి తిరిగి దానిలో లీన మగుట మాయ. తెలిసి తటస్థంగా వుండుట ఙ్ఞానం. ఎదిరించే శక్తి లేదు. దానినుండి కొంత వరకే రక్షణ. అగ్ని వలన రక్షణ లేదు. ఏరూపంలోనైననూ అది మనల్ని ప్రభావితం చేయవచ్చు. అది మనతలోకూడ వున్నది కనుక. వాయువును ఎదిరించలేము. దాని వేగం కొలతకు తెలియదు. శబ్దం కొలత తెలియదు. అమితమైన శబ్దం ఙ్ఞానమునకు మాత్రమే తెలియును. అదియే అన్నింటికి మించిన భగవతత్వం.ఏదైతే తెలియదో అది భగవతత్వం. చెవులకు తెలియదు. అవి అన్నియు పరిమితితో వుపయెూగం జీవ లక్షణము. పరిమితి దాటిన వినాశనం. ఇన్నింటికి మనిషియే సూత్ర ధారుడు. దీనిని నమకం చమకం చైవ పురుష సూక్తం చ యత్ విదుః. అకాయెూ నిర్గుణో హ్యేషా తన్మేమనః శివసంకల్పమస్తు. కాలము గుణము లేని హవిస్సు కాంతి రూపంలో ప్రకృతి రూపంలో గుణము కాయముగా, శరీరముగా మారుటను తెలియుటయే విద్ అనే వేద శబ్దం.ఏతత్ విదు వేదం. విద్ శబ్దం కూడా ఇ వ్యాప్తి కావున వి అయినది. ఆంగ్లంలో వి అనే సంస్కృతంలో వి రెండును వకే అర్ధంమని దీని శబ్ధం చిహ్నం అధోకోణమని దాని లక్షణము ప్రకృతి తత్వమని తెలియవలెను. ప్రకృతి రూప జీవ తత్వమని అభిషేక మంత్రము ద్వారా తెలియుటయే శివతత్వమైన జీవలక్షణము.యిది సృష్టి రహస్యమును చెప్పి ఆసృష్టిలోనే లీన మగుట. యా సృష్టిః సృష్టిః ఆద్యాః అని కాళిదాసు వివరణ. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి