25, మే 2021, మంగళవారం

, కృష్ణపట్నం శ్రీ ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధంలో వాడు మూలికల పైన విశ్లేషణ

 నెల్లూరు , కృష్ణపట్నం  శ్రీ ఆనందయ్య గారు ఇచ్చు కరోనా ఔషధంలో వాడు మూలికల పైన నా సంపూర్ణ విశ్లేషణ  -  2 . 


 

 * నల్ల జీలకర్ర  - 


     ఇది కఫము , జ్వరము , శిరోరోగము హరించును . దీనిని ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూచుచుండిన పడిసము , శిరోభారం , తలనొప్పి తగ్గును. 


 *  తోక మిరియాలు  - 


       వీటికి చలువ మిరియాలు అని మరొక పేరు కలదు . కొద్దిగా కారం మరియు చిరుచేదుగా ఉండును. కఫము , నోటి యందలి దోషాలను పోగొట్టును . 


 * పట్టా  - 


      దీని విషయంలో చాలా మంది బిర్యాని ఆకుగా పొరబడుతున్నారు . నిజానికి పట్టా అంటే దాల్చిన చెక్క . వాడుక బాషలో లవంగ పట్టా అని కూడా పిలుస్తారు . ఇది కఫాన్ని , వాతాన్ని హరించును .దగ్గు పోగొట్టును . గొంతునందలి  కఫాన్ని పోగొట్టును . 


 *  మారేడు ఇగుర్లు  - 


      ఇది కఫమును పోగొట్టును , వాతము , ఆమము పోగొట్టును . 


 * నేరేడు ఇగుర్లు  - 


       ఇది ఆయాసం , కఫం , దగ్గును పోగొట్టును . క్రిమిదోషమును హరించును . శోషను హరించును . 


 * పల్లేరు  - 


       ఇది కఫాన్ని హరించును . గుండెజబ్బు పోగొట్టును . 


 *  ముళ్ల వంకాయ  - 


       ఇది కారముగా ఉండును. దురదను పోగొట్టును . ఇది అతిగా వాడరాదు. రక్తము నందు వేడి పెంచును .  


 *  జాజికాయ  - 


        ఇది శరీరమున  మొదట వేడిచేసి చల్లబరుచును. క్రిమిరోగాన్ని హరించును . శరీరం ఉబ్బు పోగొట్టును . కఫాన్ని హరించును . అధిక మోతాదులో ఇవ్వకూడదు. విపరీతముగా వేడిని కలుగచేయును . 


 *  నేల ఉసిరి  - 


       ఇది దగ్గును , కఫము , దురద , గాయమును హరించును . ఆయాసాన్ని హరించును . ఎక్కిల్లు నివారణ అగును. 


 * గుంటగలగర - 


        ఇది కారముగా , వేడిగా , కఫాన్ని , వాతాన్ని హరించునదిగా ఉండును. క్రిమిరోగాన్ని హరించును . ఆయసం నివారణ అగును. దగ్గును హరించును . శిరోసంభంధ దోషాలను పోగొట్టును . 



         శ్రీ ఆనందయ్య గారు తయారు చేసిన కరోనా ఔషధములో ఉపయోగించు మూలికలు అన్నియు శ్వాస సంబంధ దోషాలను పోగొట్టి శరీరంలో ప్రాణశక్తిని పెంపొందించేవే . 




                    కాళహస్తి వేంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                             9885030034

కామెంట్‌లు లేవు: