*ఆచార్య సద్బోధన*
పేరు ప్రతిష్టలపై ఆశ ఆధ్యాత్మికతను నశింపజేస్తుంది. ప్రతీ పనిని పటాటోపం లేకుండా అణకువతో చేయాలి.
బాధలు, పీడలు మనలో నమ్రతను కలిగించితే అవి ఆశీర్వాదాలే కదా. సాధు మహాత్ములు తమకు అపకారం కలిగించాలని భావించే వారిని అందుకనే ఉపకారులుగా తలుస్తూ ఆశీర్వదిస్తారు.
కష్టాలు మనలను భగవదభిముఖం గావిస్తాయి. జీవితమంటేనే ఆరాటం, పోరాటం. ఈ పోరాటంలో భాగంగా మనల్ని మనం మెరుగు పరుచుకునేందుకు భగవంతుడు మన ఎడల కరుణతో కష్టాలను కలిగిస్తాడు.
నిజమైన పరిపక్వత కలిగినప్పుడు మృదుస్వభావిగా, సరళశీలునిగా, సహనశాలిగా మనిషి రూపొందుతాడు.
*శుభంభూయాత్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి