2, జనవరి 2022, ఆదివారం

ద్వాదశి వ్రతం

 అంబరీష చక్రవర్తి ఒక సంవత్సరము ద్వాదశి వ్రతం మొదలుపెడతాడు. కార్తీక శుద్ద ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు మహావిష్ణు పూజ ముగించి అనేకమందికి అన్నదానము చేసి తాను భోజనానికి ఉపక్రమిస్తాడు. ఇంతలో దూర్వాస మహామునియు తన శిష్యులతో వస్తాడు. అంబరీషుడు దూర్వాసునకు అర్గ్య పాదులు ఇచ్చి భోజనానికి ఆహ్వానిస్తాడు . దూర్వాస మహామునియు స్నానం చేసి వస్తానని నదికి వెళ్లి ఎంతసేపటికి రాడు . ఇంకా ద్వాదసి కాలం ఒక ఘడియ మాత్రమే ఉంది. ఈ లోపున భుజింకపోతే వ్రతం కాస్తా వృధా అయిపొతుంది . బ్రాహ్మణోత్తముల సలహాతో తులసి తీర్ధమ్ పానముగా స్వీకరించి దుర్వాసముని రాకకై ఎదురుచూస్తుంటాడు. దూర్వాస మహాముని రానే వచ్చాడు, సంగతి గ్రహించాడు. తనని ఎదురుచూడకుండా ముందుగా పానము చేసినందుకు ఆగ్రహించి , కృత్స అనే స్త్రీని అప్ప్పటికప్పుడు సృష్టించి అంబరీషుని హతం చేయమని ఆజ్ఞఇస్తాడు. కానీ అంబరీషుని భక్తివల్ల మహావిష్ణువు ఆయుధం విష్ణుచక్రము అతనిని సదా కాపాడుతుంటుంది. వెంటనే విష్ణు చక్రము కృత్యని వధించి, దుర్వాసుని వెంటపడుతుంది. దుర్వాసుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రక్షించమనంటాడు. బ్రహ్మదేవుడు తాము అంతా మహవిష్ణువు అధీనములో ఉంటామని చెప్పి తాను ఏమీ చేయలేనని అంటాడు. మహేశ్వరుడు కూడా ఆ విధముగానే సమాధానము ఇస్తాడు. ఇంకా చేసేదేమిలేక మహావిష్ణువుని ఆశ్రయిస్తాడు.మహావిష్ణువు కూడా తాను భక్తులకు ఆశ్రయుడనని తానేమిచేయలేనని, మళ్ళి అంబరీషునినే వేడుకోమని సలహా ఇచ్చి పంపించి వేస్తాడు.. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ముఖ్యమైన విషయము చెప్తాడు. " సద్భ్రాహ్మణులకను విద్య, తపస్సు సదా కాపాడుతూ ముక్తిని కలిగిస్తాయి. అదే విద్య, తపస్సు దుర్జనులైన బ్రాహ్మణులకు కీడు చేయకుండా ఉండలేవు సుమా. సాధువులలో ఉండే తేజము వారిని సదా కాపాడుతుంటుంది. వారిని హింసించే వ్యక్తులను ఆ తేజమే భయబ్రాంతులకు గురిచేస్తుంది.". తదుపరి దుర్వాసుడు తప్పు తెలుసుకొని అంబరీషుని వేడుకొని , అంబరీషుని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు.

కామెంట్‌లు లేవు: