2, జనవరి 2022, ఆదివారం

అమావాస్య పూజ

 🌸🌸🌸🌸🌸🌸🌸

🌷అమావాస్య పూజ🌷


పౌర్ణమి కి వెన్నెల పారాయణ చేస్తున్నారు బాగుంది, మరి అమావాస్య రోజు ఎలా చేయాలి అని అడిగారు కదా... ఏమీ చేయాలో ఎలా చేస్తే మంచిసో చూద్దాం...


అమావాస్య రోజు ముజ్యంగా లక్ష్మీ దేవిని, భైరవుడిని, కాళీ మాతను, దుర్గా దేవిని, విశేషంగా పూజించే రోజు అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్ది గారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపము చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి.. అది ఏ ఉపాసనా దేవత అయినా అవే నైవేద్యంగా పెట్టి ఆ  ప్రసాదాన్ని ఒక రెండు వడలు అయినా కుక్కకు పెట్టాలి మీరు తీసుకోవాలి..


1.అమావాస్య రోజు లక్ష్మీ దేవిని పూజించాలి అనుకునే వారు.. మీకు నేను ఇచ్చిన కమలాత్మిక హైమావతి సంపుటికరణ చేసి ఇచ్చిన అష్టోత్తరం తో అర్చన చేసి కమలాత్మిక స్త్రోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి.. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కానీ వారికి ఎవరికైనా కాస్త ప్రసాదాన్ని పంచి తర్వాత ఆ అర్చన కుంకుమ ఇంటిల్లి పాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది , రావాల్సిన ధనం కి ఆటంకాలు పోతుంది, వృత్తిలో, వ్యాపారం లో అధిక లాభాలు వస్తుంది.. కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజ్ఞాలు తొలగుతుంది.. భార్య స్త్రోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్య అవసరాలకు లోటు ఉండదు..ఈ శ్లోకాలు అన్ని గ్రూవ్ లో ఉన్నాయి గమనించండి..


2.  అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు, ఆస్తి గోడవలు, శత్రు బాధలు, అనుమానాలు, ఇంటి  మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరధిష్ఠి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడు ఆరాధన ద్వారా తొలగి పోతుంది... భైరవుడు ఎన్నో జప మంత్రాలు శ్లోకాలు గ్రూవ్ లో పెట్టాను అవి చేయవచ్చు.. ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి బైరావుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి , తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి తరచుగా కిందపడటం దెబ్బలు దిష్టి దోషాలు పోతుంది.. బైరావుడిని తీపి పదార్ధంలో లడ్డు అంటే ఇష్టం అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు ఆహారంగా వేయండి శత్రు బాధలు మిమల్ని భయపెడుతున్న బాధలు తొలగి పోతుంది..


3. కాళీ మాతకు విశేషం మైన రోజు ఆ తల్లికి అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్త్రోత్రం చేసి హారతి ఇవ్వాలి.. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు  ఆ అరటిపండు తాంబులం ఇవ్వాలి ఆమె స్వయంగా స్వీకరిస్తుంది .


4. దుర్గా మాత నా తల్లి విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం విశేషం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అంత శక్తి రూపం దుర్గ రూపం నా ఆరాధ్య దైవం , ఆ రోజు పసుపు నీళ్లతో  అభిషేకం చేయాలి వేప మండలు అలంకారం చేయాలి అంబలి (అన్నంలో రాగిపిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం) నైవేద్యం పెట్టి  దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్త్రోత్రం ఇలా ఎన్ని స్తోత్రాలతో అయినా పూజ కుంకుమ అర్చన చేసి హారతి ఇచ్చి ఆ నైవేద్యం పంచుకుని తాగాలి.. అన్ని రకాల విజ్ఞాలు ,ఆపదలు తొలగిస్తుంది కుటుంబానికి రక్షణ కవచం లా కాపాడుతుంది.. ముఖ్యంగా మిరియాలు పొడి కలిపిన గారెలు చేసి నైవేద్యం పెట్టాలి అది పూజ తర్వాత కుక్కకు పెట్టి తర్వాత తీసుకుంటే మీకు ఉన్న జాతక దోష ప్రభావం తగ్గుతుంది.


అన్ని బాగానే ఉంది అన్ని చేయాలి అనిపిస్తుంది కదా అన్ని చేసిన గంట సమయం కన్నా పట్టదు అన్ని స్త్రోత్రలు ఇదే గ్రూప్ లో ఉన్నాయి లేదా మీదగ్గరే బుక్స్ ఉంటుంది చూసి చేయండి.. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు ధూపం అందరూ ఇంట్లో వేసుకోవచ్చు పూజ చేయకపోయినా... ఇవన్నీ సాయంత్రం చేసే పూజలు ఉపవాసం అవసరం లేదు..

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌿🌿


👉అద్దె ఇంటిలో ఉండే వారు అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కడితే చాలు అది కుళ్ళిన తర్వాత మార్చాలి, అదే సొంత ఇల్లు అయితే గుమ్మానికి కట్టిన గుమ్మడికాయతోనే దిష్టితీసి పగలగొట్టి కొత్త గుమ్మడి కాయ గుమ్మానికి కట్టాలి. ఇలా తరచుగా చేస్తే ఇంటికి యజమానికి క్షేమం..


వ్యాపారస్థలంలో అయితే సొంతం అయినా అద్దె అయినా ప్రతి అమావాస్య కి గుమ్మడికాయ కొట్టాలసిందే, వ్యాపార స్థలంలో మంగళవారం నాడు గుమ్మం ముందు నిమ్మకాయ రెండుగా కోసి కుంకుమ అద్ది ప్రవేశద్వారం వద్ద గడపకు అటూఇటూ ఉంచి మరుసటి రోజు తీసి పడేయాలి.


👉గుమ్మడికాయ లో అధికశాతం మెగ్నీషియం ఉంటుంది కనుక తరచుగా తింటే ఎముకలు గట్టి పడతాయి


ఇంటి యజమాని నిదిరించే గదిలో నైరుతి ములలో రాళ్లఉప్పు ఒక కప్ బౌల్ లో ఉంచాలి అలా మూడు రోజులు ఉంచాక దాన్ని తీసి దూరంగా ఎక్కడైనా మురికి గుంటలో కానీ పారె నీటిలో కానీ పడేసి రావాలి.. తరచుగా వచ్చే తగాదాలు తగ్గుతుంది. దిష్టి పోతుంది..ధనం నిలుస్తుంది. 


👉 కొందరు ఆడవాళ్లకు తల చిక్కు తీసిన వెంట్రుకలు ఇంట్లో దాచే అలవాటు ఉంటుంది అది అన్ని రకాల దరిద్రాలకు ఆహ్వానం చెప్తుంది.. ఇది వరకు కాలంలో ఇంటిబయట సపారులో గూటిలో వెంట్రుకలు దాచి సవరం కట్టుకుని వారు కానీ ధాన్యం ధనం నిలువ ఉండే గృహంలోపల పెట్టేవారు కాదు.

🌷శ్రీ మాత్రే నమః🌷

కామెంట్‌లు లేవు: