31, అక్టోబర్ 2022, సోమవారం

 జ్ఞ్యానం-ఆజ్ఞనం

 

 జ్ఞ్యానం-ఆజ్ఞనం 

మనిషి శిశువుగా వున్నప్పుడు అతని మెదడులో ఎలాంటి జ్ఞ్యానం ఉండదుఒక్క మాటలో చెప్పాలంటే ఫార్మేట్ చేసిన హార్డీ డిస్క్ కంప్యూటర్లో ఉన్నట్లుతాను పెరుగుతున్నకొద్దీ తన చుట్టూ వున్న పరిసరాలతో మనుషులతో అనుసందానం కలిగి జ్ఞ్యానాన్ని పొందుతుంటాడు . అజ్ఞ్యానం అంటే తెలియనితనం, జ్ఞ్యానం అంటే తెలుసుకోవటంతెలియంది ఏమిటి, తెలుసుకోవటం ఏమిటి అంటే మన చుట్టూ అనేక విషయాలు వస్తువులు వున్నాయి దేని గురించి నీకు తెలియదో దానికి సంబందించిన జ్ఞ్యానం నీకు లేనట్లు దాని గూర్చి తెలుసుకుంటే దానికి సంబందించిన జ్ఞ్యాననఁ ఉన్నట్లు. రకమైన జ్ఞనాన్ని విషయజ్ఞనంగా మనం అనుకోవచ్చు. విషయజ్ఞ్యానం కూడా కొన్ని స్థాయిలలో ఉండవచ్చు కూడా. ఉదాహరణకు ఒక కారుగూర్చిన జ్ఞ్యానాన్ని గూర్చి ముచ్చటించుకుందాం. ఒక బాలునికి ఒక కారు ఎలా ఉంటుందో చెప్పగలడు అంటే అతనికి కారుకు సంబందించి పరిచయ జ్ఞ్యానం  ఉందనుకుందాం. అదే ఒక కారు డ్రైవరుకు కారును నడిపే జ్ఞ్యానం వుంది అది బాలుని జ్ఞ్యానం కన్నా కొంచం ఎక్కువ జ్ఞ్యానం కానీ అది కారుకు సమందించి పూర్తి జ్ఞ్యానం కాదుఎందుకంటె డ్రైవరుకన్నా కారును బాగు చేసే రిపేరరుకు ఇంకా ఎక్కువ జ్ఞ్యానం ఉంటుందికానీ అదికూడా పరిపూర్ణమైనది కాదు ఎందుకంటె కారు తయారు చేసే వానికి, కారును డిజైన్ చేసే వానికి ఇంకా ఇంకా జ్ఞ్యానం ఉంటుంది రకంగా చుస్తే మనం బౌతికంగా చూసే ఒక వస్తువు గురుంచిన జ్ఞ్యానంలోనే మనకు ఇన్ని స్థాయిలు కనపడుతున్నాయి. ఒక వస్తువుకు సంబందించిన జ్ఞనాన్ని వస్తుజ్ఞ్యానంగా మనం  తెలుసుకుంటున్నాం. ఇక విషయం జ్ఞ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాంఒక విషయాన్నిగూర్చిన జ్ఞ్యానం అంటే ఒక శాస్త్రానికి సంబందించిన జ్ఞ్యానం ఉదాహరణకు ఒక, సాహిత్యం, లేక సంగీతం లేక మారె ఇతర శాస్త్రం అయినా కావచ్చు సాహిత్యాన్ని తీసుకుంటే అందులో కూడా మనం అనేక స్థాయిలను పేర్కొన వచ్చు. బహుముఖ గ్రంథ పఠనం చేసి ఒకరు అనేక సాహిత్య విషయాలను తెలుసుకొనవచ్చు అదే విధంగా వ్యాకరణం, ఛందస్సు పరిపూర్ణంగా తెలుసుకొని ఒకరు కవి కావచ్చు, ఏది ఏమైనప్పటికి ఎవరి జ్ఞ్యానం వారిదిఒకరి కంటే ఒకరు ఒకవిషయంలో గొప్పకావచ్చు ఇంకొక విషయంలో వెనుకపడి ఉండవచ్చు. కానీ మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే భూమి మీద సర్వజ్ఞుడు ఎవరు  లేరు. ఒకవేళ ఎవరైనా నేను పరిపుణుడను అని భ్రమిస్తే కేవలం అది అతని మూర్ఖత్వంగానే మనం భావించాలి

ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అంతా కూడా మనం పరోక్ష జ్ఞ్యానంగా  తెలుసుకోవాలి. ఎందుకంటె మనిషి పైవిధమైనవి ఏవి తెలుసుకున్నా కూడా అది తనకన్నా భిన్నంగా వున్నది మాత్రమే. ఇక్కడ మూడు విషయాలు మనకు  బోధపడుతున్నాయి. అవి 1) జ్ఞాత, 2) జ్ఞానము, 3)జ్ఞేయము. వీటిని త్రిపుటి అంటారు. అనగా తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకొనుట, అనేది త్రిపుటి. ఇక్కడ ఒక్కొక్కటి ఒకదానికన్నా వేరుగా, భిన్నంగా విడి విడిగా వున్నాయి. ఇట్లా తెలుసుకునే జ్ఞ్యానాన్ని పరోక్ష జ్ఞ్యానం అని మన మహర్షులు పేర్కొన్నారు. పరోక్షం అనగా తెలుసుకునేవాడు తనకన్నా బిన్నంగా ఉన్నట్టి విషయాలకు సంబందించిన జ్ఞ్యానాన్ని పొందుతున్నది. మనకు, వేదాలద్వారా,ఇతిహాసాలద్వారా, పురాణాల ద్వారా లభించే జ్ఞ్యానం తరహాకు  చెందినది. మనకు వేదాలను కర్మకాండగా పేర్కొన్నారు అంటే కర్మలు చేయాలి అవి చేస్తే ఫలితాలు లభిస్తాయి అనేవి సూచించబడినవి.

అపరోక్ష జ్ఞ్యానం జ్ఞ్యనన్నే ఆత్మజ్ఞ్యానం లేక బ్రహ్మ జ్ఞ్యానం అని మన మహర్షులు వక్కాణించారు. దీనికే వేదాంతం అనికూడా పేరు ఎందుకంటె తరహా జ్ఞ్యానం మనకు వేదాలకు చివరన (అంతంలో) వున్న ఉపనిషత్తులలో ఉన్నందున పేరు వచ్చింది. అపరోక్ష జ్ఞ్యానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. మరి పరోక్ష జ్ఞ్యానానికి అపరోక్ష జ్ఞ్యానానికి తేడా ఏమిటి అంటే ఒక్కటే తేడా ఇక్కడ పైన పేర్కొన్న త్రిపుటి లేదు కేవలం జ్ఞ్యాత ఒక్కడే  వున్నాడు. అది యెట్లా సాధ్యం అనే ప్రశ్న ప్రతి వక్కరి మదిలో కలుగుతుంది

ముందుగా జ్ఞ్యత అంటే ఏమిటో తెలుసుకుంటే ప్రశ్నకు సమాధానం తేలికగా తెలుస్తుంది. జ్ఞ్యత అంటే తెలుసుకునే వాడు అని కదా మనం  చెప్పుకున్నాం. నేను ఒక విషయాన్ని తెలుసుకుంటున్నావు అంటే నేను జ్ఞ్యాతనుఇప్పుడు తెలుసుకోవలసింది ఏమిటంటే నేను అంటే ఎవరు? దానికి సమాధానం నా శరీరమా అంటే కాదు ఎందుకంటె శరీరానికి అవయవాలు, ఇంద్రియాలు వున్నాయి కానీ ఇంద్రియాలు శరీరపు నియంత్రణలో లేవు మరి అవి ఎవరికోసం పనిచేస్తున్నాయి. కేనోపనిషత్తులోని మంత్రాన్ని గమనించండి

యచ్చక్షుషా పశ్యతి
యేన చక్షూంషి పశ్యతి
తదేవ బ్రహ్మ త్వం విద్ధి
నేదందిద ముపాసతే  

అనగా దేనిని నేత్రములు దర్శించలేవో, దేని ప్రభావము వలన నేత్రములు చూడగలుగుచున్నవో అదియే బ్రహ్మము అని తెలుసుకొనుము. అంతియేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు (అంటే బాహ్యంగా వున్నది కాదు) . విధంగా ఆత్మకు సంబందించిన అనేక విషయాలను ఉపనిషత్తు వక్కాణించిందిఅంటే కన్నులు చూస్తున్నాయి అని శరీరంలో ఏది చూస్తున్నదో అదే బ్రహ్మ అని  పేర్కొనినది. అంటే శరీరంలో వుండివుండి శరీరంకన్నా బిన్నంగా ఉండి శరీరాన్ని నియంత్రించేదే బ్రహ్మ దానినే ఆత్మా అని మన మహర్షులు పేర్కొన్నారు. శరీరంలో నిఘాడీకృతంగా ఉండి ఇంద్రియాలద్వారా బాహ్యంగా వున్న విషయాలను తెలుసుకోవటంను త్రిపుటి అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ జ్ఞ్యత అంటే  ఎవరోకాదు,ఆత్మా అని మాత్రమే తెలుసుకోవాలి.

బ్రహ్మ జ్ఞ్యానం లేక ఆత్మా జ్ఞ్యానం అని పేర్కొనే జ్ఞ్యానం మరేదో కాదు నేను నా ఆత్మను గురించి తెలుసుకోవటం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను, నాగురుంచి నేనుగా తెలుసుకోవటం. అనగా ఇక్కడ త్రిపుటిగా మూడు వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా అంటే నేనుగా (అనగా ఆత్మగా లేక బ్రహ్మగా) మాత్రమే  గోచరిస్తున్నవి. అందుకే ఇది పరోక్ష జ్ఞ్యానం కాదు కాబట్టి మన మహర్షులు ఆత్మా జ్ఞనాన్ని అపరోక్ష జ్ఞ్యానం అని పేర్కొన్నారు. దీనిని అర్ధం చేసుకోవటమే సామాన్యులకు ఎంతో కష్టంగా గోచరిస్తుంది మరి ఆత్మా జ్ఞ్యానాన్ని పొందటం ఎంతకష్టమే ఆలోచించండిబ్రహ్మ జ్ఞ్యానం పొందాలనే ఆకాంక్ష కోటికి ఒక్కడికి మాత్రమే కలుగుతుందిఅట్లా వున్న వానిలో కోటికి ఒక్కడికే మోక్షం లభిస్తుందని శ్రీ కృష్ణ భగవానులవారు గీతలో పేర్కొన్నారు

పరోక్ష జ్ఞ్యానం పొందటానికి సాధకుని గురువు, శాస్త్రం కావాలి. కానీ అపరోక్ష జ్ఞ్యానం పొందటానికి గురువు కేవలం కొంతవరకు మాత్రమే తోట్పాడగలరుసాధకుడే తన అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, శ్రర్ధతో, నిరంతర కృషితో, తపస్సుతో మాత్రమే సాధకుడు బ్రహ్మ జ్ఞనాన్ని పొందగలడుబ్రహ్మ జ్ఞనాన్ని పొందగోరే సాధకుని జీవనం మంగలి కత్తి మీద నడవటం వాలే కష్టంగా ఉంటుందని మనకు ఉపనిషత్తులు తెలియచేశాయి

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇంత కష్టంగా ఉన్నట్టి జ్ఞ్యానానికి ఎందుకు ప్రాకులాడాలి అని ప్రతిమనిషి  అనికోవచ్చు. నిజానికి ప్రతి మనిషి కోరుకునేది ఒక్కటే అదేమిటంటే తాను పొందిన దానికన్నా ఇంకా ఉత్తమమైనది ఏదో అది కావాలని. అందుకే మనుషులు తమ, తమ విషయ పరిజ్ఞ్యానాన్ని వృద్ధి చేసుకుంటూ పోతారు తాము పొందిన జ్ఞ్యానంముతో సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలని  ప్రయత్నిస్తారు. కానీ తాము పొందే ఆనందం కేవలం కొంత సమయం వరకు మాత్రమే పరిమితం అని తెలుసుకున్న తరువాత అనంతము, నిత్యమూ శాశ్వితము అయిన ఆనందం దొరికితే బాగుండును అని అనుకుంటారుకేవలం బ్రహ్మ జ్ఞ్యాని మాత్రమే శాశ్విత ఆనందాన్ని పొందగలరు. బ్రహ్మ జ్ఞాని సదా అనిర్వచనమైన శాశ్వితమైన ఆనందంలో నిత్యం వుంటారు. అది కేవలం అనుభవంతో కలిగే అనుభూతి. ఎవరికి వారు పొందే అనుభూతి దానిని వర్ణించటానికి మాటలు చాలవు, బాష సరిపోదు. ఎందుకంటె అటువంటి అనుభవం వేరే ఇంకొక  దానితో పోల్చటానికి సరితూగదుమిత్రమా బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జన వైపు  అడుగులిడు. ఇప్పుడే సాధకునిగా మారు

సాధకునికి జయాపజయాలు, కష్టసుఖాలు, మానవమానాలు, అన్ని ఒకేవిధంగా గోచరిస్తాయి. శ్రీ కృష్ణ భగవానులవారు అటువంటి వారిని స్థితప్రజ్ఞయుడు అని పేర్కొన్నారుస్థితప్రజ్ఞయుడు మాత్రమే మోక్షాన్ని పొందగలరుమనకు శ్రీ జనకమహారాజు వారు స్థితప్రజ్ఞ్యలుగా పేర్కొన్నారు. ఇప్పటి సమాజంలో నిత్యం మనుషులు అనేక విధాలైన మానసిక, శారీరిక, సామాజిక, కుటుంబ సమస్యలతో  కొట్టుమిట్టాడుతున్నారు. సమాజంకోసం తన జీవన సరళిని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మోక్ష సాధన సాధ్యమేనా అనేది సందేహం కానీ కృషితో నాస్తి దుర్భిక్షం సాధకుడు తనకు లభించిన వనరులతో, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొని నిరంతర సాధన చేస్తే మోక్షం పొందవచ్చు

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

 


కామెంట్‌లు లేవు: