నిగమ శర్మ అక్క !!
(శ్రీ పాండురంగ మాహాత్మ్యం.. తెనాలి రామకృష్ణ కవి.)
👉విశ్లేషణ :- చొప్పకట్ల సత్యనారాయణ .
💥💥💥💥
తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు అక్షర, రూపాన్ని
సంతరించుకున్నాయి.
అలాటి పాత్రలలో "నిగమ శర్మ అక్క" పాత్ర చిరస్మరణీయం!
తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానంప్రశంసనీయం.
ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది
పాండురంగ మాహాత్మ్యం..
నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ.
పరమ నిష్ఠారిష్ఠుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ
ణోత్తముని కొమరునిగానిగమశర్మ యుదయిచెయించినాడు.
వేదాది సర్వ విద్యలను నేర్చినాడు.ఉపవీతుడైన యనంతరము
వివాహితుడయినాడు.
విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడినది.
దానివలనసర్వభ్రష్ఠుడైనాడు. జూదమాడుట,వ్యభిచరించుట,
పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యైనాడు.
ఈవ్యసనములకు వలసిన ధనమునకై స్వగృహముననే చౌర్యమారంభించినాడు .
మాన్యములను తెగనమ్మసాగినాడు."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా
సంచరించుచుండినాడు.. తల్లి యిదియంతయు నెరింగియు పుత్ర
వ్సామోహమున భర్త కెరిగింపకుండెను. వారి భ్రష్టాచారములు
మితిమీరిన దశలో పాపమాగృహస్థునకు
పుత్రునినిర్వాకము,యితరులవన తెలసినది.
ఆబ్రాహ్మణగృహస్తునకు అంతకుమున్నె యొక కుమార్తెగలదు.
ఆమెయే నిగమశర్మయక్క! ఆమెకంతకుముందే పెండ్లియయినది.
పిల్లలుకూడా. అదిగో ఆమెమాటపై నిగమ శర్మకు అమితగౌరవమట!
.
అందువలన అతనిని సరిదిద్దుటకు ఆమెను బిలిపించినారు.
పుట్టినింటి మమకారము పెనవైచుకొన్న ఆయతివ యరుదెంచి,
తమ్ముని రాకకై యెదురు చూడసాగినది. రేయంతయు జూదమాడి,
తెల్లవారువేళకు దొడ్డిగుమ్మము నుండి నిగమశర్మ
గృహప్రవేశమొనరించినాడు. యెందుకు వచ్చెను? చద్దియన్నమును
భుజించిపోవుటకు. వానియదృష్టముపండినది. రావడమేతడవు అక్క
కన్నులలో బడినాడు. ఆమెప్రేమగా నతనిని చేరబిలిచి
కడుపునిండుగా కుడువబెట్టి,పసిబాలుడగు తనయెడ బిడ్డను
యెత్తుకొన నిచ్చి, పసికూనను యొడిలోనిడుకొని చనుగుడుపుచు
, తమ్మునకిట్లు ధర్మోపదేశముచేయ నుపక్రమించినది.
ఇక్కడ కవి యామెనోటివెంట బలికించిన మూడుపద్యములూ
ఆణిముత్యములే! వినుడు-
శా: ప్రారంభించిన వేదపాఠములకున్ ప్రత్యూహ మౌనంచునో,
యేరా!తమ్ముడ! నన్ను జూడఁజనుదేవెన్నాళ్ళనో నుండి?, చ
క్షూరాజీవ యుగంబు వాచె నిన్ కన్గోకున్కి, నీబావయున్
నీరాకల్ మది గోరు "చంద్రు పొడపున్ నీరాకరంబున్బలెన్".
...
యేరా! తమ్ముడూ!యేమిటి? వేదపాఠములకు
అంతరాయమౌతుందనాయేమి,,,యింతకాలమైనా మాయింటికే
రావడంలేదు?
( నీపనికిమాలినపనులేవోనాకుతెలియదనుకున్నావా?
అనివ్యంగ్యం)కన్నులురెండూ నీకోసంయెదురు చూసి
వాచిపోయాయిరా! నేనేకాదు మీబావగారుకూడా 'చంద్రునికోసం
యెదురుచూచే సరోవరంలా,యెదురు చూస్తున్నారనుకో!
యిక్కడ కవి మనయింట మామూలుగా యెలామాట్లాడుకుంటామో
అలాగే రచించటం గొప్పవిషయం! యెంతైనా కవిగదా చివర ఒక
మెరపు మెరిపించాడు.
"నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్
నీరాకరంబున్వలెన్"_- అంటూ 'నీరాక-నీరాక; ఛేకానుప్రాసము.ఛేకుడు-విదగ్ధుడు అంటే నేర్పరి అనియర్ధం.
తెలివైనవారుఒపుడుగాకార్యసుఘటితమైనమాటలు మాటలాడగలరు. నిగమశర్మయక్క చక్కనిమాటనేర్పుగలయిల్లాలు.
ఆమెమాటలకుపక్రమించింది.ఇలా,
(యింక రెండవ పద్యం చూద్దాం!) ఇందులోఅతడుచేసిన, చేస్తున్న పనులకు
నిగమశ్మకు మందలింపు,ఈవిధంగా,
శా: వీరావేశముఁదాల్చి సర్వ ధనమున్ వెచ్చింతు గాకేమి,! ము
క్కారుంబండు నఖండ సేతువృతముల్ కాశ్మీరఖండంపు కే
దారంబుల్ఁ దెగనమ్మగాఁజనునె? నిర్దారుండవే? వెన్క నె
వ్వారున్ లేరె సహోదరాదులు? కులధ్వంసంబు నీకర్హమే?
ఈపద్యంలో తమ్మునిపైకోపం,అయ్యోవీడు పాడౌతున్నాడే అనేబాధ,
సంస్కరించకపోతే యెలాగ అనేతపన, యిలాపుట్టింటి ఆడబిడ్డకు
కలిగే ఆవేశ కావేశాలు అన్నీ కవిరంగరించి ముద్దగాచేశాడు.
యీఆడబడుచేగాదు,పుట్టింటి బాగుగోరే యే ఆడబడుచైనా
అలాగే ఆలోచిస్తుందనుకుంటాను.
యేరా! వీరావేశంతో ఒళ్ళెరుగక, డబ్బంతా విచ్చలవిడిగా
ఖర్చుచేస్తునావట? ముక్కారు పంటలు పండే మాన్యాలను
తెగనమ్ముతున్నావట? నీ వెనక పెళ్ళాంఉందిరా! ఆమెకేదిదారి?
నీవెనుక నున్న మాగతేమిటి?తమ్ములున్నారుకదా వారిమాటేమిటి?
యీవిధంగా కుల ధ్వంసం చేయటం నీకుతగునా? అని నిగ్గదీసింది.
చివరకు మా కొంపలో యిలాపుట్టావేమిరా! అంటోంది.
శా: శ్రీ లాలిత్యము, నిత్య శుధ్ధియు, గుణోత్సకంబునున్ గల్గి, యు
ద్వేల స్ఫూర్తి దలిర్చు, తండ్రి యను నబ్ధిన్ చంద్రుడైఁ దోచినన్
బోలుంగాక ,భవాదృశుండితరుఁడై కన్పట్టినన్ జెల్లునే?
" సాల గ్రామ ఖనిన్ జనించునె గదా జాత్యల్ప పాషాణముల్";
మాయింట చెడఁబుట్టావుగదరా!
యెంత పవిత్రమైన వంశమిది.నీవలన పాడైపోయినదిగదా!
నీతండ్రి సర్వసంపదలకు నెలవైనవాడు,మహానిష్ఠాగరిష్ఠుడు,
సద్గుణ శీలుడు. అట్టివానికడుపున
నికృష్టుడవైననీవుజన్మించుట,"పరమ పవిత్రమైన
"సాలగ్రామగని"లో పనికిరాని "రాయి"వలె ఐనదిగదరా!
యనుచున్నది. ఈపద్యమున కవి నిగమశర్మ
తండ్రికి సముద్రునితో పోలికను జెప్పినాడు.
సముద్రుడు లక్ష్మిని కుమార్తెగా లాలించినవాడు,
(శ్రీలాలిత్యము)జలములకు నిత్యశుధ్ధిగలదుగదా(అదేనిత్యశుధ్ధత)
రత్నాకరుడు సముద్రుడు అదిగుణోత్సకత.;
(నిగమ శర్మతండ్రి- డబ్బున్నవాడగుట,నిష్ఠాగరిష్ఠుడగుట,
సద్గుణవంతుడగుట;ఇట్లు సాగరమునకు నిగమశర్మతండ్రికి పోలికలు.)
వీరిద్దరిలో ఉద్వేల స్ఫూర్తియుగలదు,
సముద్రంపరంగా యెత్తైన కెరటాలు, ని:తండ్రిపరంగా మంచిపేరు
ప్రతిష్ఠలుకలిగి ఉండుట.
ఈవిధంగా తండ్రి సముద్రుడైతే, మరి కొడుకేంగావాలి? ఆసముద్రున
కుదయించిన చంద్రుడు కావాలిగదా! వీడు
అలాకాలేదు.పనికిమాలినవాడయ్యాడు. అదే ఆమెబాధ!
చూశారా మానవ మనస్తత్వాలను మధనంచేసితీసిన కావ్య సుధారసం!
ఇదిగో ఇదండీ "పాండురంగ విభుని పద గుభనం!
సెలవు .
స్వస్తి!
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి