16, జూన్ 2023, శుక్రవారం

శ్రీబాలాత్రిపురసుందరీసహితమల్లేశ్వరస్వామి

 *శ్రీబాలాత్రిపురసుందరీసహితమల్లేశ్వరస్వామివారిని ప్రార్థించుచూ నేను వ్రాసిన స్తోత్రము.*

(1)శ్రీమన్నరేంద్రపురవాస!మహేశ!శంభో!,

     గోదావరీతటవిరాజితపార్వతీశ!।

    గౌరీపతే!త్రిపురసుందరశాన్తచిత్త!,

    మల్లేశదేవ!మమ దేహి కరావలంబమ్।।

భావం=శ్రీమన్నరేంద్రపురవాసుడా!ఓమహేశా!ఓశంభో!గోదావరీతీలమునందు విరాజిల్లుచున్న ఓపార్వతీశుడా!ఓగౌరీపతీ!బాలాత్రిపురసుందరీశాంతచిత్తుడా!ఓమల్లేశ్వరస్వామీ!నాకు చేయూతనిమ్ము.

(2)శ్రీకాపిలేయమునిపూజితసుందరేశ!,

     కాసారతీరపరమేశ్వర!దివ్యరూప!।

     హేముక్తినాథ!సురపూజిత!లోకబంధో!,

    మల్లేశదేవ!మమ దేహి కరావలంబమ్।।

భావం=శ్రీకపిలమహర్షిచేత పూజింపబడినటువంటి సుందరేశుడా!,కాసారతీరమందున్న ఓ పరమేశ్వరా!,ఓదివ్యరూపుడా!,ఓముక్తినాథుడా !,దేవతలచేతపూజింపబడేవాడా!,ఓలోకబంధూ!,ఓమల్లేశ్వరస్వామీ నాకు చేయూతనిమ్ము.

(3)శ్రీగౌతమీతటవిశోభితవిశ్వరూప!,

     శ్రీసుందరీహృదయవల్లభ!సౌమ్యమూర్తే!।

దేవాధిదేవ!జగదీశ్వర!చిత్స్వరూప!,

మల్లేశదేవ! మమ దేహి కరావలంబమ్ ।।

భావం=శుభకరమైనగౌతమీతీరమునందు విశేషముగా శోభించు ఓవిశ్వరూపుడా!,శ్రీబాలాత్రిపురసుందరీహృదయసౌమ్యవల్లభమూర్తీ!, ఓదేవాధిదేవుడా!, జగదీశ్వరుడా!, జ్ఞానరూపుడా!, ఓమల్లేశ్వరస్వామీ!నాకు చేయూతనిమ్ము.

(4)కైలాసవాస!జితమన్మథఘోరరూప!,

    శైలాత్మజాహృదయతోషణసంవిహారిన్!।

వాగర్థరూపనిజవైభవసంవితాన!,

మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్।।

భావం=ఓకైలాసవాసా!సంసారకారణభూతుడైన మన్మథుని భస్మముచేసిన ఘోరరూపముగలవాడా!,బాలాత్రిపురసుందరీదేవియొక్కహృదయమునందు సంతోషముతో విహరించేవాడా!,వాగర్థరూపమైన(బ్రహ్మవిద్యారూపమైన) తనయొక్కవైభవమును విస్తరింపజేసేవాడా!,ఓమల్లేశ్వరస్వామీ నాకు చేయూతనిమ్ము.

(5)శ్రీకంఠరూప!భవనాశక!నీలకంఠ!,

     దుర్గాపతే!గిరిజయార్చిత! దీనబంధో!।

     సంసారమగ్ననరఘోషనివృత్తరూప!

    మల్లేశదేవ!మమ దేహి కరావలంబమ్।।

భావం=(తాను విషాన్నిస్వీకరించి బయటికి వదలకుండా. మింగకుండా కంఠమునందే దాచి చతుర్దశభువనములకు శుభమును కలిగించుటద్వారా శ్రీకంఠుడు) ఓశ్రీకంఠరూపుడా!,భవనాశకుడా!,ఓనీలకంఠుడా!,ఓదుర్గాపతీ!,గిరిజాదేవపూజలందుకుంటున్న ఓ దీనబంధూ!,సంసారమునందు కూరుకుపోయిన నరులఘోషను నివారించేవాడా!,ఓమల్లేశ్వరస్వామీ!,నాకు చేయూతనిమ్ము.

(6)భూతేశ!భూతగణసేవిత భూతనాథ!,

     కాత్యాయనీశ!వృషకేతన!శంభులింగ!।

    హేభీమలింగ!కరుణాకర!దివ్యకీర్తే!,

   మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్ ।।

భావం=ఓభూతేశుడా!భూతగణములచే సేవించబడే ఓభూతనాథుడా!,ఓకాత్యాయనీ వల్లభుడా!,ఓవృషభధ్వజుడా!,ఓశుభకరమైనలింగమూర్తీ!,ఓభయంకరలింగమూర్తీ !,ఓకరుణాకరుడా!,ఓదివ్యకీర్తిమయుడా ఓమల్లేశ్వరస్వామీ నాకుచేయూతనిమ్ము।       (7)హేచంద్రచూడ!,భుజగాంకిత!శూలపాణే!,

హేమన్మథాంతక!,విరాజితభస్మదేహ!।

హే కంచినాథ!నటరాజ!చిదంబరేశ!,

మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్ ।।

భావం=చంద్రుడు ఆభరణముగా కలిగినవాడా!,ఓభుజగభూషణుడా!,చేతియందు శూలముకలిగినవాడా!,మన్మథునిభస్మముగావించినవాడా!,భస్మముతో ప్రకాశించు శరీరముకలిగినవాడా!,ఓకాంచీపురాధీశుడా!,ఓనటరాజా!,ఓచిదంబరేశుడా!,ఓమల్లేశ్వరస్వామీ నాకు చేయూతనిమ్ము.

(8)బాలేందురంజితశిర:! ప్రథితాsభ్రకేశ!, దాక్షాయణీసతతశోభితసవ్యభాగ!।శ్రీమన్నరేంద్రపురశోభితమల్లినాథ! ,

మల్లేశదేవ మమ దేహి కరావలంబమ్ ।।

భావం=బాలచంద్రునితో ప్రకాశించేటటువంటి శిరస్సుకలిగినవాడా!వ్యోమకేశునిగాప్రసిద్ధినిపొందినవాడా! ,దాక్షాయనీదేవితో ప్రకాశించేటటువంటి వామభాగముకలిగినవాడా!,నరేంద్రపురమునందు శోభించు ఓమల్లినాథుడా!,ఓమల్లేశ్వరస్వామీ !,నాకు చేయూతనిమ్ము ।।

                  *ఫలశ్రుతి *.                

మల్లేశ్వరాష్టకం పుణ్యం,

య: స్మరేద్ధృది సర్వదా।

శివలోకం చ సంప్రాప్య,

శివైక్యం లభతే ధృవమ్।।

భావం=ఈమల్లేశ్వరాష్టకమును హృదయమునందు ఎల్లప్పుడు ఎవడు స్మరించెదడో అతడు శివలోకమును జేరి శివునియందు ఐక్యమవుతాడు. ఇది నిశ్చయము.

కామెంట్‌లు లేవు: