🌹🌷🪔🪔🛕🪔🪔🌷🌹
*శుక్రవారం 19 డిసెంబర్ 2025*
*శ్రీమతే రామానుజాయ నమ:*
_*తిరుప్పావై – 4వ పాశురము*_
_*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*_
_*4వ పాశురము:-*_
_*ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్*_
_*ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడార్ త్తేరి*_
_*ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు*_
_*పాళియందోళుడై ప్పర్పనాబన్ కైయిల్*_
_*ఆళిపోళ్ మిన్ని వలమ్బురి పోల్ నిన్రదిర్న్దు*_
_*తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్*_
_*వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్*_
_*మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్*_
_*తాత్పర్యము:-*_
గంభీరస్వభావుడా! వర్షనిర్వాహకుడా! ఓ పర్జన్యదేవా! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపజేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి, ఆ సముద్రజలమునంతను, నీవు పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి, సర్వజగత్కారణభూతుడగు శ్రీ నారాయణుని దివ్యవిగ్రహము వలె శ్యామలమూర్తివై, ఆ పద్మనాభుని విశాలసుందరబాహుయుగళిలో దక్షిణబాహువునందలి చక్రము వలెమెరిసి, ఎడమచేతిలోని శంఖము వలె ఉరిమి, శార్ఙ్గమను ధనస్సునుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు, మేము సంతోషముతో మార్గశీర్షస్నానము చేయునట్లు వర్షించుము.
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి