19, డిసెంబర్ 2025, శుక్రవారం

రోగాన్ని గుర్తించి వైద్యులు

 *వ్రతాచరణ వలన ప్రయోజనం*



తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ


యతేత మృత్యో రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. వ్రతాలు పూజలు, జపాలు, తీర్థయాత్రలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. ఏఏ వ్రతాలు చేసుకోవాలి, ఏఏ సమయాలలో ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను గరుడపురాణంలో విశేషంగా ప్రస్తుతించారు. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


వ్రతాలు చేసుకుంటూ ఉంటే మెల్లి మెల్లిగా పాపక్షయం అవుతుంది.

కామెంట్‌లు లేవు: