18, డిసెంబర్ 2025, గురువారం

గొర్లు కాసెటాయినె

 For a change let's see a story written in Telangana slang published in *Namaste Telangana*


ఒక ఊర్లె ఒక గొర్లు కాసెటాయినె ఉంటుండె. ఆయినెకు అస్సలు శెవులు ఇనవడయి. జరంత పెద్ద ఆసామి, మాలెస్క జీవాలున్నయి. మేతకు రోజూ అడివిలకు తోల్కపోయి వత్తుండె. రోజటి తీర్గనే అడివిలకు వోంగనే.. ఏదో జరూరు పని యాదికచ్చింది. జీవాలన్నిట్ని తోల్కపోవుడు ఎందుకని అటీటు సూత్తాంటె.. ఒకాయినె శింతశెట్టు మీన శిగురు దెంపుతాండు. ఈనెకు గూడ శెవుడె. ఆయినెను జూడంగనె పానం లేశచ్చింది. “ఓ అన్న! జరంత సేపు గీ జీవాలను సూడు. ఊళ్లెకు వోయత్త! నీ కట్టముంచుకోను. అచ్చినంక నా కుంటి గొర్రెనిత్త” అంట జెప్పిండు. కిందికెల్లి ఆయినేదో పాటవాడుతుండు అనుకొని శింత మీదున్నోడు.. ‘ఆ.. ఆ..’ అంట తల్కాయ ఊపిండు. మనోడు జెల్ది ఊళ్లెకు వోయి పనిజేసుకొని ఎగిర్తంగనే అచ్చిండు. అచ్చి సూడంగనె.. శింత మీద ఉన్నోడు ఆన్నే ఉన్నడు. ఈనె లెక్కవెట్టుకొని సూత్తె జీవాలన్ని బరాబరున్నయి.

అంతట్లకె శెట్టుమీద ఉన్నాయినె కిందికి రాంగనె.. మస్తు ఖుషీగ కుంటిగొర్రెను తీస్కపోయి శేతుల వెట్టి, శణార్తులు జెప్పిండు గొర్లు కాసెటాయినె. ఆయినెకు గూడ ఇనవడదాయె! “నీ యవ్వ.. నేను శెట్టు మీదనే ఉన్న. నీ గొర్రె కాలు నేనెందుకు ఇరగ్గొట్టిన?” అనుకుంట గొర్రెను ఆనికే ఇచ్చి రుసురుస ఉరికిండు. “తొండి వెట్టకు! నీకు నేను కుంటి గొర్రెనే ఇత్తాన్న. మంచిది నేనెందుకిత్త?”.. అంట ఆడు ఎన్క ఉరికిండు. ఇద్దరి కిస్స మాపటిదాక నడుత్తనే ఉంది. ఆఖరికి యాష్టకచ్చి.. “నీకు గొర్రె లేదు.. బర్రె లేదు. ఎవలకు జెప్పుకొంటవో చెప్పుకో పో!’’ అనుకుంట జీవాలను మలుపుకొని ఇంటికి వోయిండు గొర్ల ఆసామి.


ఇంటికి పోయినా.. ఆయినె పానమంత ఎట్లనో గావట్టింది. ‘గొర్రెనిత్తా అని ఇయ్యకపోతి! మంచిది గాదు’ అని, ఊరి పెద్ద కాడికోయి అయిన ముచ్చటంత జెప్పిండు. ఎట్లనన్న ఆయినెను లెంకులాడి కుంటిగొర్రెను అప్పజెప్పుమని బతిమ్లాడిండు. అంతట్లకే శింతాకు దెంపినాయినె, “శింతాకు.. శింతాకు” అని అమ్ముకుంట ఆల్ల గల్లిలకే అచ్చిండు. ఇద్దరు ఒకల్లనొకల్లు సూసుకున్నరు. ఎంటనే కుంటిగొర్రెను దీస్కపోయి మన ఆసామి మల్ల ఆయినె శేతుల వెట్టిండు. మల్ల ఇదేం తల్కాయనొప్పని ఇయ్యర మయ్యర వొర్రుకుంట లొల్లివెట్టి గాయిగాయి జేశిండు శింతాకు అమ్మెటాయినె. అయినా మన ఆసామి మాత్రం ససేమిరా అంట.. గొర్రెపిల్లను వాపసు తీసుకోలె. ఊరిపెద్ద గూడ.. “నువ్వు దీని కాలిరగొట్టలే! నీకిది ఇనాం” అంట శింత శిగురాయినెకు మస్తు జెప్పిండు. అయినా ఆయిన తాను వట్టుకున్న కుందేలుకు మూడుకాల్లన్నట్టే ఉన్నడు.

ఇట్ల ఈల్లు ఇనేటట్టు లేరనుకున్నడో ఏమో.. కుంటిగొర్రెను వట్టుకొని ఒకటే లంకె వెట్టిండు శిగురు అమ్మెటాయినె. ఏం జేత్తడో సూద్దామని ఆడున్నోల్లందరూ ఆయినెనుకనే ఉరికిండ్రు. ఆయినె ఉరికి.. ఉరికి.. గొర్రె నిచ్చిన ఆసామి దొడ్లకు వోయి, కుంటిగొర్రెను మందల కలిపి ఎన్కకు సూడకుంట లంకె వెట్టిండు. మన ఆసామికి ఏమర్థంగాక పరేషానయ్యిండు. ఇద్దరి శెవుటి ముచ్చట తెలిశిన ఊరోళ్లు కడుపుబ్బ నవ్విండ్లు.

పెన్షనర్ల కష్టాలు

 . పెన్షనర్ల కష్టాలు 

          *********************

          (ఆట వెలదులు)

1) పెన్షనరుకు ఉన్న పెనుబాధలన్నియు 

ముసలితనమునందు ముంచుకొచ్చు 

ఎవరినడుగ లేరు యేడికీ పోలేరు 

అండ ఉంటెగాని అడుగు పడదు !

2)

నడవలేని కాళ్ళు నిలువనీయని వొళ్ళు 

ప్రకృతి పిలుపులన్ని పడక యందు 

ధైర్యమిచ్చువారు దరిలేక తండ్లాట 

కాయమరుగు వరకు కంటనీరు !

3)

పెన్షనరుకు హక్కు పెన్షను పొందుట 

బిక్షగాదు సేవ భుక్తి యగును 

నాయకులకు యేల నాలుగు పెన్షన్లు?

దోచుకొనుటకేన దొరల నీతి !

4)

నాయకుని చికిత్స నయముగాదిచ్చట 

అన్యదేశమెళ్ళి హాయి గడుపు 

ఎంత ఖర్చునైన ఏలోటు రాకుండ 

ఉన్నదంత తిందురుచిత సొమ్ము !

5)

పెన్షనరుకు జబ్బు పెనుబాధను తెచ్చు 

ఉచిత వైద్యమునకు ఊత మియరు 

పేరుకే ఉచితము పెనుభారమగు చుండు 

ముందు డబ్బు లిస్తె మందులిచ్చు !

6)

అంత ఉచితమంటు "ఆరోగ్యశ్రీ" వల్ల 

"ఉచిత భీమ" లేమి ధీమ నిచ్చు?

హెల్తుకార్డులేమి హెల్పుచేయుట లేదు 

ఆచరించు చోట అమలుగాదు !


                  ........... కోట పెంటయ్య 

     విశ్రాంత భాషోపాధ్యాయులు. కారేపల్లి. ఖమ్మం జిల్లా.9014977041

కాశీలో 9 రోజులు

  🔅 కాశీలో 9 రోజులు ఎందుకు ఉండాలి ?*

👆నవ దిన కాశీ యాత్ర అంటే ఏమిటి ?


💠 మనిషి తల్లి గర్భం లో తొమ్మిది నెలలుంటాడు .

జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే .

అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి ,

అ తర్వాతా స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు . .

అయితే కలికాలం లో ఇంత శ్రద్ధ తో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు  కోరారు .

దానికి అయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం 

ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు .


🔅మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి ?


💠 విశ్వేశ్వర నామ స్మరణ ,దానాలు చేయటం ,

ధర్మ ప్రసంగాలు వినటం , ,ఏక భుక్తం ,ప్రాతఃకాల స్నానం ,ఉదయం రాత్రి విశ్వేశ్వర దర్శనం ,

కోపం లేకుండా ఉండటం ,అబద్ధ మాడకున్డటం ,

అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా 

అమలు చేయాలి.


💠 మొదటి రోజు కార్యక్రమం : 


మొదటిగా మనసులో 33 కోట్ల దేవతలు,

తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న 

శ్రీ కాశీ విశ్వేశ్వరా !శరణు !అనుజ్ఞ !

అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి . దీనినే చక్ర తీర్ధం అంటారు .

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు.

శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే . అందుకే ‘’నారాయణీ సహా చరయ నమశ్శివాయ ‘’అన్నారు .

విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణి కర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు .


యాత్రీకులు మణి కర్ణిక లో స్నానం చేయాలి .

బ్రాహ్మణులకు దానాలు చేయాలి .

కేశ ఖండనం చేసుకొని ,మళ్ళీ స్నానం చేయాలి .

మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి.

రుద్రాక్ష మాల ధరించి ఈకింది శ్లోకం చదువు కోవాలి


’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం –

మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః

అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి

చరా చరేషు సర్వేషు-యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే –

మణి కర్నీజతే మలే..

ఆ గంగా కేశవస్చైవ –

ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –

ఆ మద్ధ్యా ద్దేవ సరితః స్వర్ద్వారా  న్మణికర్ణికా 

నమస్తే నమస్తే నమః‘’అని నమస్కరించి 

అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి ఇరవవై ఒక్క గరికలను ,

ఇరవై ఒక్క కుడుములను సమర్పించి ,

ఇరవై ఒక్క సార్లు గుంజీలు తీసి 

ఇరవై ఒక్క  రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.


తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి 

ఆ తర్వాతా విశాలాక్షి ,జ్ఞాన వాపి ,

సాక్షి గణపతులను చూడాలి .

ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి 

రాత్రికి విశ్వనాదుడిని దర్శించాలి 

ఫలాలు పాలు ఆహారం గా గ్రహించాలి


‘’హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర

మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –

మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర ‘’

అంటూ పద కొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి .


💠 రెండవ రోజు కార్య క్రమం : 

రెండో రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర ,అన్నపూర్ణా దర్శనం చేయాలి .

మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా 

ఘట్టం లో స్నానం చేయాలి .తీర్ధ శ్రాద్ధం  చేయాలి . వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి .

గురు ఉపదేశం తో‘’శ్రీ కాశీ విశ్వేశ్వరాయనమః ‘’

అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి .

మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి.

రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .


💠 మూడో రోజు కార్యక్రమం :

తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప 

స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి .తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి . దీనికి ‘’రుద్ర సరోవర తీర్ధం ‘’అనే పేరు కూడా ఉంది .

ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి .

వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి 

ఆదికేశవ స్వామిని దర్శించాలి .

పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి ‘

తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి .

మణి కర్నేశుని ,సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి .

అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి .

రాత్రికి పాలు ,పండ్లు మాత్రమె స్వీకరించాలి .


💠 నాల్గవ రోజు: 

ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన  కాల భైరవుని ,పూజించాలి.

కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి ‘

’ఓం కాశ్యైనమః ‘’అని 36సార్లు అనుకోవాలి 

తర్వాతా బిందు మాధవుని దర్శించాలి .

గుహను ,భవానీ దేవిని దర్శించాలి 

ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి 

మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి 

భోజనం చేయాలి .

రాత్రి నామ స్మరణ పాలు ,పండ్లు ఆహారం .

అంటే ఈరోజు పది దర్శనాలన్న మాట


💠 అయిదవ రోజు: 

ప్రాతః కాలమే  గంగా స్నానం చేసి , కేదారేశ్వరుని దర్శించి ,అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి . తర్వాత తిలా భాన్దేశ్వర ,

చింతా మణి గణపతిని సందర్శనం చేయాలి .

దుర్గా దేవిని చూసి ,ఒడి బియ్యం 

దక్షిణా సమర్పించి ,గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి .

ఈమెనే కౌడీబాయి అంటారు .

అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి ,

భోజనం చేసి రాత్రి పాలు ,పండ్లు తీసుకోవాలి


💠 ఆరవ రోజు

సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది ,వైధవ్యం ఎన్ని జన్మ లకైనా రాకూడదని 

దీవెనలు పొంది మూసివాయన చేటలదానాన్ని చేసి ,బేసి సంఖ్యలో జనానికి  వాయనదానాన్ని చేయాలి .

వ్యాస కాశీ చేరి వ్యాసుని రామ లింగేశ్వరుని 

శ్రీ శుకులను దర్శించి ,కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి .

తర్వాత భోజనం చేయాలి .

రాత్రి సంకీర్తనతో కాల క్షేపం చేసి 

పాలు పండ్లను స్వీకరించాలి


💠 ఏడవ రోజు: 

గంగాస్నానం ,నిత్య పూజా చేసి వెయ్యి గరిక లను ఏరి సిద్ధం చేసుకోవాలి .

దొరక్క పోతే నూట ఎనిమిదితో సరి పెట్టుకోవాలి . 21 ఉండ్రాళ్ళను, 108 యెర్ర పూలతో పూజించాలి .

ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తామ్బూలాలివ్వాలి .  


డుండి వినాయకుడిని అర్చించి ,

అన్నపూర్నాలయం లో కుంకుమ పూజ చేయించాలి .

అమ్మవారికి చీరా జాకెట్టు ,ఒడి బియ్యం ,గాజులు సమర్పించాలి .

ఇలాగే విశాలాక్షి కీ చేయాలి .

విశ్వేశునికి అభిషేకం చేయాలి .

సహస్ర పుష్పార్చ

సహస్ర బిల్వార్చన ,

హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి

హర సాంబ హర సాంబ అంటూ పదకొండుసార్లు జపం చేయాలి .


💠 ఎనిమిదో రాజు: 

గంగాస్నానం నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు ,పాయసం నివేదించాలి .

ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి .

ఆ రోజంతా కాల భైరవ స్మరణతో 

నిష్టగా గడపాలి

అయిదుగురు యతులకు ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.

దక్షిణా తాంబూలం సమర్పించాలి.

భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ 

నిద్ర పోవాలి


💠 తొమ్మిదో రోజు: 

గంగా స్నానం విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్నాదేవిని దర్శించి పూజించి ,108ప్రదక్షిణలు  చేయాలి .

జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలివ్వాలి ఆశీస్సులు పొందాలి .

రాత్రి  అన్నపూర్నాష్టం చేసి నిద్ర పోవాలి 


💠 పదవ రోజు కార్య క్రమం : 

నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు 

గంగా స్నానం చేసి గంగను పూజించి 

సహస్రనామ పూజ చేసి ,అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను గురు దంపతులను పూజించాలి .

అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి.

ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*


*592 వ రోజు*


*ఉత్తమ ధర్మము*


ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో ధర్మములన్నీ చెప్పారు కదా ! వాటిలో ఆచరించతగిన ఉత్తమధర్మము ఏది ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్ని ధర్మములు ఉత్తమమైనవే పనికిరాని ధర్మము ఏదీ లేదు. వాటిలో వారివారికి నచ్చిన ధర్మాలు వారు ఆచరిస్తారు. తమకు నచ్చిన ధర్మాలను ఆచరించే జనులను అనేకులు మన జీవితంలో తారసపడతారు. ఒక సారి నారదుడు లోక సంచారము చేస్తూ దేవేంద్రుడి వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు నారదమునిని తగురీతిని సత్కరించి ఉచితాసనమున కూర్చుండ పెట్టి " నారద మునీంద్రా ! నీవు అన్ని లోకములను సంచరిస్తుంటావు కదా ! నీకు ఎక్కడైనా అత్యంత ఆశ్చర్యకరమైనది కనిపించిందా ! " అని అడిగాడు. నారదుడు " గంగానదికి దక్షిణ తీరంలో మహాపద్మము అనే నగరములో భృగుడు అనే భ్రాహ్మణుడు నివసిసిస్తున్నాడు. అతడు ధర్మపరుడు, సత్యవాది, అహంసా వాది, ఇంద్రియనిగ్రహము కలవాడు, తనకు ఉన్న దానితో తృప్తిచెందే వాడు. కోపము అసలే లేని వాడు, తాను న్యాయంగా సంపాదించిన ధనముతో దేవ కార్యములు, పితృ కార్యములు, అతిథి సత్కారములు చేసే వాడు. అతడికి తగినట్లు వినయ సంపన్నులైన కుమారులు కలిగారు. అయినా అతడు సదా ఏ కార్యము చేస్తే మేలు కలుగుతుంది, ధర్మకార్యాలు ఏవి ఆలోచిస్తూ ఉండే వాడు. ఒకరోజు వారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.


*ఆత్మదర్శనం*


భృగుడు అతడికి అతిథి సకారాలు చేసి " అనఘా ! నేను ప్రతిరోజు ఆత్మ దర్శనం చేయడానికి ప్రత్నిస్తాను కాని నా మనసును ప్రాపంచిక విషయముల నుండి మరల్చలేక పోతున్నాను. కనుక నాకు ఆత్మదర్శనం సాధ్యం కావడం లేదు. నాకు మార్గము ఉపదేశించండి " అని అడిగాడు. భ్రాహ్మణుడు " భృగూ ! నేను కూడా ! నీ మాదిరి ఆత్మదర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసి ప్రాపంచక విషయాలలో పడి పొంద లేక పోయాను. నాకూ సరి అయిన దారి కనపడ లేదు. నాకు సరి అయిన మార్గము గోచరించ లేదు. కొందరు బ్రహ్మచర్యము వలన, కొందరు గృహస్థాశ్రమంలో ఉండి, మరి కొందరు తపమాచరించి, కొందరు యజ్ఞయాగములు చేసి, మరి కొందరు నిష్కామ కర్మలు చేసి మరి కొందరు ఆత్మదర్శనం పొందారు. కొంత మంది తల్లి తండ్రులను సేవించి, మరి కొందరు భక్తితో భవంతుడిని కొలిచి, కొందరు మంచి నడవడి ప్రవర్తనతో, కొందరు ఇంద్రియ నిగ్రహముతో ప్రఆశాంత జీవితము గడుపుతూ, కొంరౌ సత్యము, అహింస పాటించి ఆత్మ దర్శనం పొందుతారు. ఆత్మ దర్శనానికి అనేక కార్యములు ఉన్నా అది అంత సులువైనది మాత్రం కాదు. నైశారణ్యములో ఉన్న గోమతినదీ తీరాన మహాపద్మతటాకము తీరాన ఒక మహాసర్పము నివసిస్తుంది. ఆ మహాపద్మతటాక తీరంలో పూర్వము మాంధాత తపమాచరించాడని ప్రతీతి. అక్కడ ఉన్న నాగరాజు పేరు పద్ముడు. అతడు మహా ధర్మాత్ముడు, దయకల వాడు. అతడికి అతిథులంటే ప్రేమ ఎక్కువ. నీవు పద్ముడిని దర్శించి అతడి వద్ద ఉపదేశం పొంద వచ్చు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ ఆగూర్ తంతోండ్రీశ్వర ఆలయం

  🕉 మన గుడి : నెం 1327


⚜  తమిళనాడు : మయిలాడుతురై


⚜  శ్రీ ఆగూర్ తంతోండ్రీశ్వర ఆలయం



💠 తంతోండ్రీశ్వర దేవాలయం భారతదేశంలోని తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో అక్కూర్ వద్ద ఉన్న హిందూ దేవాలయం.  

అధిష్టానం శివుడు.  

ఆయనను తంథోండ్రియప్పర్ అని పిలుస్తారు.  

అతని భార్యను వల్నెడుంకన్ని అని పిలుస్తారు.  


💠 తంతోండ్రీశ్వరుడు స్వయంబుమూర్తి.  

ఇది 63 ప్రసిద్ధ శైవ నాయన్మార్లలో ఒకరైన సిరపులి నాయనార్ జన్మస్థలం.   

ఇక్కడే మోక్షాన్ని కూడా పొందాడు.


💠 శివుడు అగస్త్య మహర్షికి వివాహ దర్శనం కల్పించిన పవిత్ర స్థలాలలో ఇది కూడా ఒకటి.   

ఇది 275 పాదల్ పెట్రా స్థలాలలో ఒకటి - తమిళ శైవ నాయనార్లు తిరుజ్ఞానసంబంధర్ మరియు తిరునావుక్కరసర్ రాసిన ప్రారంభ మధ్యయుగ తేవరం పద్యాలలో కీర్తించబడిన శివ స్థలాలు.


🔆 ఆకూర్ అనే స్థల పేరు వెనుక కథ:


💠 ఈ ప్రదేశం యొక్క చారిత్రక నామం శంఖరాణ్యం. 

కోచెంకన్ చోళన్ రాజు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు, ఒక దైవిక స్వరం ద్వారా 48 రోజుల పాటు 1000 మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టమని అతనికి సూచించబడింది. ప్రతి రోజు సంఖ్య 1 తగ్గుతుందని అతను కనుగొన్నాడు. 

చివరి రోజున ఆ సంఖ్య 1000 కి చేరుకునేలా చూసుకోవాలని అతను భగవంతుడిని ప్రార్థించాడు. 

అతని ప్రార్థనలకు సమాధానం లభించింది మరియు అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని 1000వ వ్యక్తిని కనుగొన్నాడు. 


💠 రాజు ఆ అపరిచితుడి దగ్గరికి వెళ్లి అతని గురించి, అతను ఏ ప్రదేశానికి చెందినవాడు అని విచారించినప్పుడు, ఆ అపరిచితుడు " ఎవరి స్థలం?" (తమిళంలో యరుక్కు ఊర్? ) అని జవాబిచ్చి సమీపంలోని ఒక చీమల పుట్టలోకి అదృశ్యమయ్యాడు. అప్పుడు రాజు ఆ అపరిచితుడు మరేమీ కాదని, మారువేషంలో ఉన్న భగవంతుడని గ్రహించాడు. 

అందుకే అక్కూర్ అనే పేరు యరుక్కు ఊర్ నుండి వచ్చింది. 


💠 చీమల పుట్టను పడగొట్టడానికి ఉపయోగించే గునపం  వల్ల గాయంతో చీమల పుట్టలో స్వయంబులింగం కనిపించింది. ఇది ఇప్పటికీ లింగంపై కనిపిస్తుంది.

ఆ ప్రదేశాన్ని తవ్వినప్పుడు ఒక లింగం కనిపించింది మరియు అది ప్రధాన దేవతగా ప్రతిష్టించబడింది. 


💠 లింగం స్వయంగా కనిపించినందున, ఇక్కడి మూలవర్ భగవానుడిని తాన్ తొండ్రి ఈశ్వరార్ లేదా తనను తాను వ్యక్తపరిచిన వ్యక్తి అని పిలుస్తారు. 


💠 ఈ ఆలయం శివుడు అగస్త్య మహర్షికి తన వివాహ దర్శనం ఇచ్చిన ప్రదేశాలలో ఒకటి అని కూడా నమ్ముతారు. 

ఈ కారణంగా, పార్వతి దేవి మందిరం శివుని మందిరానికి కుడి వైపున ఉంది (వారి వివాహ భంగిమను పోలి ఉంటుంది).



🔆 సిరప్పులి నాయనార్


💠 సిరప్పులి నాయనార్ గురించి ప్రస్తావించకుండా అక్కూర్ గురించి ఏదైనా రాసినా అది అసంపూర్ణంగా ఉంటుంది. 

ఆయనను సాధారణంగా 63 మంది నాయన్మార్లలో 35వ వ్యక్తిగా లెక్కిస్తారు. 

ఆయన ఈ ప్రాంతానికి చెందినవారు మరియు ధనిక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. 

ఆయన అన్ని ఆచారాలను పాటించేవారు, యజ్ఞాలు చేసేవారు, పేదలకు ఆహారం పెట్టేవారు మరియు భగవంతుని ఐదు అక్షరాల నామాన్ని (పంచాక్షర) క్రమం తప్పకుండా జపించేవారు. 

ఈ ఆలయంలో ఆయనకు ఒక మందిరం ఉంది మరియు ఆయన గురు పూజను తమిళ మాసం కార్తీక (నవంబర్-డిసెంబర్) సమయంలో నిర్వహిస్తారు. 


💠 ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి 3 అంతస్తుల రాజగోపురంతో ఉంటుంది. 

బలిపీఠం, ద్వజస్తంభం మరియు ఋషభం ముందు ఉన్నాయి. 


💠 ఆలయంలోని దేవతలు:

శివుడు మరియు పార్వతి దేవి ఆలయాలు కాకుండా, వినాయకర్, మురుగ, సరస్వతి, నటరాజ, సిరప్పులి నాయనార్, సుందరర్ భార్యలు సంగిలి నాచియార్ మరియు పరవై నాచియార్‌లతో కూడిన నల్వార్, అరుణగిరినాథర్ కొచ్చెంగణ్ చోజన్, చండీక్ నవగ్రహం, చండీక్ నవగ్రహం వంటి విగ్రహాలు ఉన్నాయి. 


💠 ఈ ఆలయంలో అప్పు లింగం, వాయు లింగం మరియు తెయ్యు లింగం అనే మూడు లింగాల సమితి విడిగా ఉంది. 

ఈ ఆలయం సరస్వతి దేవి విగ్రహం ఉన్న అరుదైన శివాలయాలలో ఒకటి. 



💠 మార్గళిలోని తిరువధిరై (డిసెంబర్-జనవరి) ఆలయంలో ముఖ్యమైన పండుగ. 

నెలవారీ శివరాత్రి, ప్రదోషం. కార్తీక దీపం, పూర్ణిమలు ఆలయంలో పండుగ రోజులు.


💠 భక్తులు ఎదుర్కొనే చెడు మరియు ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి ఇది పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది.

భక్తులు వివాహ ప్రతిపాదనలను విజయవంతంగా ముగించడానికి పార్వతి హోమం చేస్తారు. 

సంతానం కోరుకునేవారు సంతాన గోపాలకృష్ణ హోమం చేస్తారు. 


💠 తిరు ఆక్కుర్ లేదా కేవలం అక్కూర్ అనేది మైలదుత్తురై నుండి దాదాపు 15 కి.మీ. మరియు సెంపోనార్ కోయిల్ నుండి దాదాపు 5 కి.మీ. దూరంలో ఉంది. బంగాళాఖాతం సముద్ర తీరం దాదాపు 10 కి.మీ. దూరంలో ఉంది. 

ఈ ప్రదేశం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. 


రచన

©️ Santosh Kumar

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం* 𝕝𝕝  


*న గర్హయంతి హ్యర్థేషు యవిష్ఠాంఘ్యభివాదనమ్* | 

*ఛందోభ్యోఽన్యత్ర న బ్రహ్మన్ వయో జ్యైష్ఠ్యస్య కారణమ్* ||


తా𝕝𝕝 *బ్రహ్మాన్ - మహర్షీ! యోగ్యమగు ప్రయోజనము ఉన్నప్పుడు, చిన్నవాని పాదములకు నమస్కరించుటను పెద్దలు తప్పు పట్టరు. వేదజ్ఞానమును బట్టి పెద్దరికమును నిర్ణయించవలెను గాని, కేవలము వయస్సును బట్టి నిర్ణయించుట సరిగాదు.*


✍️💐🌹🌸🙏

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:అర్జున ఉవాచ


యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ 

అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ (22)


నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ 

అఫలప్రేప్సునా కర్మ యత్తత్‌సాత్త్వికముచ్యతే (23)


తత్వాన్ని తెలుసుకోకుండా, తగిన కారణం లేకుండా సమస్తమూ అదే అనే సంకుచితదృష్టితో ఏదో ఒకే పనిమీద ఆసక్తి కలిగివుండేవాడిజ్ఞానం తామసజ్ఞానం. ఆసక్తి, అభిమానం, అనురాగం, ద్వేషం, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మను సాత్వికకర్మ అంటారు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

పలుకు - ఉలుకు

  🌿 ప ర మా త్ము ని 🌿

           పలుకు - ఉలుకు

      

          *అలలు అలసిపోవు*

                 నిరంతరం

          *ఎ గ సి ప డు తు న్నా*

            

                   అలానే....

     

      *దేశాన్ని ధర్మాన్ని ప్రజలని*

      *ప్రేమించే వారు ప్రేమిస్తూనే*

           *ఉంటారు సేవలలో*

              *అలసి పోరు*


           *దేశ ధర్మాలకు*

           *ద్రోహం చేసేవారు*

           *చేస్తూనే ఉంటారు*

                   వీరు 

     *అలసిపోరు వారి పనిలో*     

             


     🔱 *కాలభైరవాయనమః*🔱

                      🚩  

.

ప్రయాణం చాలా చిన్నది*

  *ప్రయాణం చాలా చిన్నది*


ఒక మహిళ బస్సు ఎక్కి, 


ఒక పురుషుడి పక్కన కూర్చున్నప్పుడు, ఆమే బ్యాగ్ అతనిని ఢీకొట్టింది... 

కానీ 


ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.


ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు, ఆ స్త్రీ అడిగింది,


 "నేను నిన్ను నా బ్యాగ్‌తో కొట్టాను, మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?"


ఆ పురుషుడు నవ్వి ఇలా జవాబిచ్చాడు:


"ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది... 

నేను తదుపరి స్టాప్‌లో దిగుతున్నాను...!"


ఈ సమాధానం ఆ స్త్రీని తీవ్రంగా కదిలించింది. 

ఆమె ఆ పురుషుడికి క్షమాపణలు చెప్పి, తనలో తాను ఇలా అనుకుంది,


 *"ప్రయాణం చాలా చిన్నది"*


—ఈ మాటలు బంగారంతో రాయబడాలి.


ఈ ప్రపంచంలో మనకున్న సమయం చాలా చిన్నదనీ, 

అనవసరమైన వాదనలు, 

అసూయ, 

క్షమించలేకపోవడం, 

ఆగ్రహం 

మరియు 

ప్రతికూల భావోద్వేగాలు 

నిజంగా 

సమయం మరియు శక్తిని 

వృధా చేయడమేనని 

మనం అర్థం చేసుకోవాలి.


👉 ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా? 

👆ప్రశాంతంగా ఉండండి...


*ప్రయాణం చాలా చిన్నది...!*


👉 ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా,

 బెదిరించారా 

లేదా 

అవమానించారా?

వదిలేయండి. 

ధ్యానం చేయండి .


విశ్రాంతి తీసుకోండి.

 - ఒత్తిడికి గురికావద్దు...

*ప్రయాణం చాలా చిన్నది...!*


👉 ఎవరైనా 

కారణం లేకుండా 

మిమ్మల్ని అవమానించారా?


ప్రశాంతంగా ఉండండి... 

విస్మరించండి...

*ప్రయాణం చాలా చిన్నది...!*


👉 ఎవరైనా 

అసహ్యకరమైన వ్యాఖ్య చేశారా?


క్షమించండి, 

విస్మరించండి,

మీ ప్రార్థనలలో వారిని ఉంచండి🙏

 మరియు 

నిస్వార్థంగా ప్రేమించండి...

*ప్రయాణం చాలా చిన్నది...!*


మనం 

*వారిని పట్టుకున్నప్పుడే సమస్యలు సమస్యలుగా మారుతాయి.* గుర్తుంచుకోండి, 

మనం


 *"కలిసి చేసేప్రయాణం చాలా చిన్నది."*


ఈ ప్రయాణం 

ఎంత పొడవు ఉందో ఎవరికీ తెలియదు...


రేపు ఎవరికి తెలుసు? 

ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.


కాబట్టి 

మన స్నేహితులు, 

బంధువులు 

మరియు 

కుటుంబ సభ్యులను గౌరవిద్దాం... మన్నిద్దాం...


మనం దయగా, 

ప్రేమగా 

మరియు 

క్షమించేవారిగా ఉందాం.


*కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి.*


ఎందుకంటే 


*మనం కలిసి చేసే ప్రయాణం నిజంగా చాలా చిన్నది...!*


మీ చిరునవ్వును అందరితో పంచుకోండి...


మీ జీవితాన్ని అందంగా మరియు ఆనందంగా మార్చుకోండి...


ఎందుకంటే మనది ఎంత పెద్ద సమూహం అయినా, 

మన ప్రయాణం చాలా చిన్నది...!


ఎవరు ఎక్కడి నుండి దిగుతారో ఎవరికీ తెలియదు.


కాబట్టి...

ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి,

 నవ్వుతూ ఉండండి... 

మరియు

జీవితాన్ని ఆస్వాదించండి.


ఆర్థిక సమస్యలు 

కుటుంబ సమస్యలు 

ఆరోగ్య సమస్యలు 

పర్సనల్ సమస్యలు 

మొదలైనవి అన్నీ 

బుర్రలో పెట్టుకొని 

బుర్ర పాడు చేసుకుని 

టెన్షన్ పెట్టుకొని 

అనుక్షణం భయంతో బ్రతకడం 

ఆపివేయండి. 

ప్రశాంతంగా 

మెడిటేషన్ చేసుకుంటూ, 

తోటి వారికి సహాయపడుతూ ఇతరులను మోసం చేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా.. 

మంచి ఆలోచనలతో ఉండండి. 

మంచే జరుగుతుంది. 

మీరు ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి. 


నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు 

మైండ్ ని డైవర్ట్ చేయండి. 

ఆధ్యాత్మికంగా ఎదగండి.

అవసరం ఉన్న వారికి సాయం చేయండి .

మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి. జోక్స్ చూడండి, 

మంచి సంగీతం వినండి.

మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదవండి.

 యూట్యూబ్లో 

మంచి స్ఫూర్తివంతమైన సందేశాలు ఉంటాయి 

స్ఫూర్తివంతమైన జీవిత కథలు ఉంటాయి . 

వాటిని వినండి 👍


ముఖ్యంగా 


మన ప్రయాణ గమ్యం దగ్గరలో ఉందని గమనించుకోండి..🙏🙏🙏


               

                              ఇట్లు

                                మీ

                         భవధీయుడు

                అవధానుల శ్రీనివాస్

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


నిత్య, నైమిత్తిక కర్మలను చేయడం వలన పుణ్యం, యశస్సు, ఆత్మబలం కలుగుతాయి, వాటిని విడిచిపెట్టడం వలన పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మను చేయడం వలన పాపం కలుగుతుంది, దాన్ని విడిచిపెట్టడం వలన సద్గతి, ఆత్మబలం, తపశ్శక్తి పెరుగుతాయి. 

చేసిన కర్మ మనకు ఇచ్చే ఫలితాన్ని అనుసరించి దాన్ని పాపకర్మ, లేదా పుణ్యకర్మ అంటాము. ఇతరులకు మేలు చేసేది; ఇతరులకు హానీ చేయకుండా తనకు మేలు చేసేవి అయిన కర్మలను సత్కర్మలుగా చెప్తారు. ఇతరులకు హానీ చేసే కర్మను పాపకర్మ అంటారు.

సులభంగా చెప్పాలంటే సుభాషితకారులు ఇలా అన్నారు.


అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం

పరోపకారం పుణ్యాయః పాపాయ పరపీడనం


అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు వాటి సారాన్ని ఈ విధంగా కీర్తించాడట. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం చేయడం పాపం అని. నిజానికి ఇతరులకే కాదు, తనకు హానీ చేసేది కూడా పాపమే.

ఎడ్ల బండి నడవడానికిబండి చక్రాలు ఎలాగో, అలాగే జీవ యాత్ర సాగాలంటే పాపపుణ్యాలు అలాంటివి. ఈ రోజు నీకున్న ఆరోగ్యం, ఆహారం, ఆహార్యం, సంతోషం, పదవి, హోదా మొదలైన అన్ని సుఖాలకు కారణం పుణ్యకర్మ లేదా పుణ్యఫలం. అలాగే నీవు అనుభవించే కష్టాలు, భయాలు, రోగాలు మొదలైన అన్ని రకాల దుఃఖాలకు కారణం పాపకర్మ లేదా పాప కర్మ యొక్క ఫలం. కర్మ సిద్ధాంతం ఇలా చెప్తుంది. నీవు చెడు చేస్తే, చెడును పొందుతావు; మంచి చేస్తే మంచి అనుభవిస్తావు; ఇతరులను అవమానిస్తే, అవమానించబడతావు; దూషిస్తే దూషించబడతావు; దోషాలు ఎంచితే, నీలోని దోషాలు ఎంచబడతాయి; ఆకలి తీరిస్తే, నీ ఆకలి తీర్చబడుతుంది; నీవు తిరస్కరిస్తే, తిరస్కరించబడతావు; ప్రేమిస్తే, ప్రేమించబడతావు; శంతిని పంచితే, శాంతిని పొందుతావు; అశాంతిని రగిలిస్తే, అశాంతితో కాలి బూడదవుతావు. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు (ఇతరులకు) ఏది ఇస్తావో, అదే నీకు తిరిగి లభిస్తుంది. 


ఈ జన్మలో నీవు అనుభవించే సుఖాలకు కారణం నువ్వు గతంలో చేసిన పుణ్యమైతే, దుఃఖాలకు కారణం నీ గత జన్మ పాపం. అంటే జీవుడు, తాను చేసే కర్మ ద్వారా, పాపపుణ్యాలను మూటకట్టుకుని జన్మల పరంపరంలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ క్రమంలో మరణం తర్వాత పోగు చేసుకున్న సంపదలు గానీ, బంధువులు గానీ తన వెంట రారు. అమెరికా నుంచి భారతదేశానికి వచ్చిన వారు అక్కడ కరెన్సీని ఇక్కడ నేరుగా ఉపయోగించలేరు. దాన్ని భారత కరెన్సీలోకి మార్పిడి చేసుకోవాలి. అప్పుడే వీలవుతుంది. అలానే పాపపుణ్యాలు. కూడబెట్టిన సంపదను దానం అనే ప్రక్రియ ద్వారా పుణ్యంగా మార్చుకోవచ్చు. అప్పుడది జీవయాత్రలో జీవుడి వెంట ఉండి, అతడికి అవసరమైనప్పుడు, తగిన వసతిని సమకూర్చుతుంది. కాబట్టి తాను పోగు చేసుకున్న సంపదను పుణ్యంగా మార్చుకుంటాడు వివేకవంతుడు. అలా కాక, అన్నీ కట్టుకుపోతామనే భ్రమలో ఉండి, తాను తినక, ఇతరులకు పెట్టక, ఇతరుల నోటి దగ్గరి ముద్దను సైతం లాక్కునే వాడు అవివేకి, బుద్ధిహీనుడు.

అందుకే భగవాన్ రమణులు ఇలా అంటారు. "ఇతరులకు ఇచ్చిందేదో, అది మాత్రమే తనకు దక్కుతుంది. మిగితావన్నీ వెళ్ళిపోతాయి. ఈ రహస్యం తెలిసిన ఇతరులకు ఇవ్వకుండా ఎలా ఉండగలరు?"


అందుకే సనాతన ధర్మం దానం గురించి గొప్పగా చెప్తుంది. ఒక్కో దానానికి ఒక్కో ఫలం ఉంటుంది. ఉదాహరణకు కొందరికి అన్నీ ఉంటాయి, కానీ ఆత్మసంతృప్తి ఉండదు. కొందరికి ఏమీ లేకున్నా, సంతృప్తిగా ఉంటారు. దీనికి మూలం ఎక్కడ ఉంది? శాస్త్రం ఇలా చెప్తుంది. మామిడి పండును దానం చేస్తే ఆత్మసంతృప్తి కలుగుతుంది. అది మామిడి పండు దానం వలన జీవుడు సంపాదించుకున్న పుణ్యఫలం. అది ఏ జన్మలో చేసినా, ఎప్పుడో ఒకప్పుడు, ఫలం లభిస్తుంది. అలా ప్రతి వస్తువు దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ మరింత విశేషం ఏమిటంటే ఇచ్చేవాడు అనగా దాత గొప్ప కాదు, దానం పుచ్చుకునేవాడు గొప్ప అంటుంది సనాతన హిందూ ధర్మం. అతడు దానం స్వీకరించి, పుణ్యఫలానికి నీకు పాత్రతను కలిగిస్తున్నాడు. కాబట్టి మన ధర్మంలో దానం తీసుకున్నవాడు దాతకు నమస్కరించడు, దాతయే దానం పుచ్చుకున్నవానికి నమస్కరిస్తాడు. తనకు అంతటి అమూల్యమైన భాగ్యాన్ని ఇచ్చినందుకు. అదేకాక దానం పుచ్చుకునేవాడిని శ్రీ మాహావిష్ణు స్వరూపంగా భావించమని శాస్త్రం చెబుతోంది. అతడికి పాదపూజ చేయమంటుంది.

ఇదే తైత్తరీయోపనిషత్తులో కనిపిస్తుంది.

శ్రద్ధయా దేయం | అశ్రద్ధయా2 దేయం | శ్రియా దేయం | హ్రియా దేయం | భి యా దేయం | సంవిదా దేయం ||


శ్రద్ధతో దానం ఇవ్వండి. ఉదాసీనతతో, అశ్రద్ధతో దానం ఇవ్వకండి. శక్తి మేరకు, సమృద్ధిగా దానం ఇవ్వండి. వినమ్రతతో, అణుకువ కలిగి దానం ఇవ్వండి. గౌరవపూర్వకంగా దానం ఇవ్వండి. సౌహార్దంతో దానం ఇవ్వండి.🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

నిత్య కర్మలు

  నిత్య కర్మలు

 ప్రతి రోజు తప్పనిసరిగా ఆచరించాల్సినవి. వీటిని చేయకపోతే దోషం కలుగుతుంది.

ఉదాహరణలు: సంధ్యావందనం, దేవతా పూజ, పంచమహా యజ్ఞాలు (అగ్నిహోత్రం, అతిథి పూజ,వగైరా, స్నానం, అధ్యయనం

ఫలితం: ప్రధానంగా చిత్త శుద్ధి, అంతఃకరణ శుద్ధి. 


నైమిత్తిక కర్మలు

 ఒక ప్రత్యేక కారణం (తిథి, పండుగ, గ్రహణం, వగైరా ఉన్నప్పుడు మాత్రమే చేసే కర్మలు.

ఉదాహరణలు: దీపావళి రోజున తలస్నానం చేయడం (గంగానదిలో స్నానం చేసినట్లే), అమావాస్య, గ్రహణ సమయాల్లో చేసే కర్మలు, శ్రాద్ధ కర్మలు.

ఫలితం: ఆయా సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన ఫలితాలను, పుణ్యాన్ని ఇస్తాయి (ఉదా: దీపావళి నాడు నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది). 

ముఖ్య వ్యత్యాసం: నిత్య కర్మలు రోజూ చేయాల్సినవి, నైమిత్తిక కర్మలు ప్రత్యేక సందర్భాల్లో చేసేవి. నిత్య కర్మల లక్ష్యం శుద్ధి అయితే, నైమిత్తిక కర్మల లక్ష్యం ఆ సందర్భానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు పొందడం. జరుగుతుంది. 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

కధ

 🌹ఈరోజు కధ 🌹


విదేశీయులు కూడా శ్రీ రమణుల దర్శనార్ధం వచ్చేవారు. ఓసారి అలా రమణాశ్రమమునకు వచ్చిన ఓ విదేశీ స్త్రీ క్రింద కూర్చోలేక కూర్చోలేక కూర్చుని భగవాన్ కూర్చునే సోఫా వైపుకు కాళ్ళు చాచింది. ఇది అక్కడే ఉన్న భగవాన్ శిష్యుడొకరికి సహింపరానిదిగా తోచి, అమ్మా! కాళ్ళు ముడుచుకొండని చెప్పడాన్ని చూసిన మహర్షి; "సరి సరి, ఆమె క్రింద కూర్చోటానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా?" అన్నారు నవ్వుతూ. అంతట ఆ శిష్యుడు భయపడుతూ 'లేదు లేదు, ఇక్కడి మర్యాద ఆమెకు తెలియదని చెప్పాను, అంతే' అని బదులివ్వగా; "ఓహో... అట్లాగా... మర్యాద కాదా? అయితే వాళ్ళవైపు కాళ్ళు చాపటం నాకున్నూ మర్యాద కాదు కదా మరి. ఆ మాట నాకున్నూ తాకి వస్తుంది కదా" అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు శ్రీ రమణులు. ఆ మరుసటి రోజు కూడా ఎంతో కాళ్ళు నొప్పులున్న రమణమహర్షి, కాళ్ళు చాచటం, అంతలోనే మర్యాద కాదు కాబోలు అని కాలు ముడుచుకోవడం చేయగా..., ఇది చూసి దుఃఖితుడైన తన శిష్యుణ్ణి చూసి నవ్వేస్తూ కాళ్ళు చాచి ఎప్పటిలా కూర్చుంటూ, "మీరంతా కూడా ఇలా కూర్చోండి ఓ రెండు కధలు చెప్తాను, వినండి" అంటూ అవ్వయార్ కధను, నామదేవ్ కధను చెప్పారట.


శ్రీ రమణులు చెప్పిన అవ్వయార్ కధ -


కైలాసంనుంచి వచ్చిన తెల్లఏనుగును ఎక్కి సుందరమూర్తి వెడుతుంటే చూసి చేరరాజు అశ్వం చెవులో పంచాక్షరి మంత్రమును చెప్పి, దానినెక్కి తానూ వెళ్ళాడట కైలాసానికి. వాళ్ళిద్దరూ వెళ్తున్నారని గణపతిపూజ చేస్తున్న అవ్వయారుకి తెలిసి తానూ పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వను చూసి 'అవ్వా! తొందరపడకు, పూజ సావకాశంగా కానియ్యి, నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసంకు చేరుస్తాలే' అని అన్నాడట. సరేనని భక్తితో పూజ పూర్తిచేయగానే "అవ్వా! కళ్ళు మూసుకో" అన్నాడు. అంతే, కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల ఎదుట కూర్చొని ఉంది. సుందరమూర్తీ, చేరరాజూల కంటే తన భక్తి వలన ముందుగానే వచ్చింది. అవ్వ పాపం పెద్దదాయే. పరమేశ్వరున కెదురుగా ఇట్లా నాలాగే కాళ్ళు చాచి కూర్చున్నది. ఇది చూసిన పార్వతీదేవికి పట్టరానిబాధ. పరమేశ్వరునికి ఎదురుగా కాళ్ళు చాచిందే, ఇది అపరాధం కదా అన్న దిగులుతో 'నేను చెప్పనా అవ్వతో' అని పరమేశ్వరునికి మనవి చేయగా, "అమ్మో, మాట్లాడకు, ఆమెనేమీ అనరాదు" అని అన్నాడట ఈశ్వరుడు. అయినా ఆ అమర్యాదను సహించలేక చెలికత్తెతో చెప్పగా, ఆ చెలికత్తె అవ్వను సమీపించి 'అవ్వా అవ్వా, కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అని అన్నాదట. 'అట్లాగా అమ్మా, ఈశ్వరుడు ఎటులేడో చెప్పు, ఇటు తిప్పానా?' అని కాళ్ళు ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు పరమేశ్వరుడు తిరగవలసి వచ్చింది. అప్పుడు పార్వతిని చూసి, "చూశావా? నేను చెబితే విన్నావు కాదు, ఆమె ఇప్పుడు నన్నెలా తిప్పుతుందో చూడు, అని ఈశ్వరుడు అనగా అంతట అవ్వని క్షమించమని అడిగింది పార్వతీదేవి. ఇట్లాగే ఉంటుంది కాలు చాపవద్దనటం.....!


మరో కధ 


పాండురంగ విఠలుడు తనయందే ఎక్కువ మక్కువగా ప్రీతిగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే, జ్ఞానదేవాదులొకసారి ఘోరా కుంభారునింటికి నామదేవుని విందుకు తీసుకువెళ్ళి, విందనంతరం ఇష్టాగోష్టిలో ఘోరాకుంభారుని తో 'ఏమోయ్! నీవు కుండలు బాగా చేస్తావ్ కదా, మరి ఈ మా కుండల్లో పక్వమైనవి ఏవో, కానివేవో నాణ్యం చూసి చెప్పవోయ్...' అని చమత్కరించగా -

వారి ఒక్కొక్కరి తలమీద రెండు మొట్టికాయలు వేస్తూ పరీక్షించడం మొదలుపెట్టారు ఘోరాకుంభారులవారు. అక్కడున్న వారంతా తలవంచి నమ్రతతో వూరుకోగా, నామదేవుడు మాత్రం 'ఏమిటేమిటీ, నన్నే కొట్టవస్తావా?' అని ఎదిరించగా; వెంటనే ఇది పక్వంలేని కుండ అని ఘోరాకుంభారులవారు అనగానే అందరూ పక్కున నవ్వారు. ఇక వెంటనే ఉక్రోషంతో, అవమానభారంతో నామదేవుడు లేచి, విఠల్ దగ్గరకు వచ్చి విలపించగా -

"అందరూ కొట్టినప్పుడు నమ్రతగా ఉన్నప్పుడు నీవెందుకు అలా ఉండలేకపోయా"వని విఠల్ ప్రశ్నించగా; మీకు ఎంతో చేరువైన నేనూ, వారూ ఒకటేనా? నన్నా కొట్టేది అని నామదేవుడు బదులివ్వగా -

"అదే అహంకారం. వాళ్ళంతా నా యదార్ధ స్వరూపం తెలుసుకొని స్వస్థచిత్తులై మౌనంగా వున్నారు. ఓ పనిచేయ్... ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉన్న సాధువును సేవించి యదార్ధం తెలుసుకో" మన్న స్వామి విఠల్ మాటలు విని అక్కడికి వెళ్ళిన నామదేవునికి లింగంపై కాళ్ళుపెట్టి పడుకున్న సాధువు కనబడగానే, 'అయ్యయ్యో... స్వామీ అపరాధం, అపరాధం; దేవుడినెత్తిన కాళ్లేమిటీ?' అని కపించిపోతూ అనగా, 'ఓహో... నామదేవా... విఠల్ పంపాడా?' అని ఆ సాధువు అడగడం చూసి, ఆశ్చర్యపడిన నామదేవుడు ఆవేదనతో 'అయ్యా! లింగం మీద కాళ్లేమిటీ?' అని మరల అడగగా; 'అట్లాగా నాయనా! నాకు తెలియదే, కాళ్ళు ఎత్తలేకుండా యున్నాను, కాస్తా అవతల పెట్టవయ్యా' అంటే; సరేనని, కాళ్ళు ఎత్తి ఎటు పెడితే అటు లింగం కన్పించడంతో తనమీద పెట్టుకుంటే తానూ లింగంలా గోచరించేసరికి విభ్రాంతితో నిలిచాడు. ' హు... తెలిసిందా ఇప్పుడు' అని సాధువు ప్రశ్నించగా 'తెలిసింది స్వామీ' అంటూ 

 ఆ మహానుభావునకు నమస్కరించి ఇంటికి వెళ్లి గదిలో కూర్చొని నిత్యం ధ్యానమగ్నుడై విఠోబా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్.


కొన్నాళ్ళకు విఠల్ పరుగెత్తుకొని వచ్చి, "నామా! నామా! నీవు రావటం లేదేమీ?" అని ఆర్తిగా అడగగా, 'ప్రభూ! నీవు లేని చోటేది? నిన్ను సదా ఇక్కడే, నాలోనే చూస్తున్నా'ని అనగా ఆనందంతో స్వామి విఠల్ అంతర్ధానమయ్యాడు.


..అని మహర్షి చెప్పి తన శిష్యునికి జ్ఞానోదయం చేశారట 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

మహనీయులమాట


🙏 *మహనీయులమాట* 🙏


*సత్ చింతనకు ప్రాధాన్యత నివ్వడం, చెడు తలంపులకు స్వస్తి చెప్పడం నీలో ఎప్పుడైతే ప్రారంభమయినదో, అప్పుడే నీ ఆత్మ ఉన్నత స్థితిని నీవు కనుకొన్నట్లు తెలిసి పోతుంది.*


   🌺 *నేటిమంచిమాట* 🌺       

 

*ఎదుటి వాడి ముఖం చూసి, సుఖమైన, దుఃఖమైనా ; దిగులైనా, విచారమైనా ; తిన్నాడా లేదా, అని ఎదుటి వ్యక్తిని చదవడమే గాక వాడికి తన చేయుత నిచ్చువాడే పరిపూర్ణ విద్యావంతుడు* 


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 17 - 12 - 2025,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,

హేమంత ఋతువు,

మార్గశిర మాసం,

బహుళ పక్షం,


తిథి : *త్రయోదశి* రా2.09 వరకు,

నక్షత్రం : *విశాఖ* సా5.42 వరకు,

యోగం : *సుకర్మ* మ3.29 వరకు,

కరణం : *గరజి* మ1.06 వరకు

                తదుపరి *వణిజ* రా2.09 వరకు,


వర్జ్యం : *రా10.08 - 11.54*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.17*

అమృతకాలం : *ఉ7.59 - 9.45*

రాహుకాలం : *మ12.00 - 1.30*

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *ధనుస్సు*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం : 6.25,

సూర్యాస్తమయం : 5.24,


            *_నేటి తిరుప్పావై_*


        _*2వ రోజు పాశురము:-*_

_*వైయత్తు వాళ్వీర్గాళ్! నాముమ్ నమ్బావైక్కు*_

_*చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్*_

_*పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి*_

_*నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి*_

_*మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్*_

_*శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్*_

_*ఐయముమ్*_ _*పిచ్చైయుమాన్దనైయుఙ్గైకాట్టి*_

_*ఉయ్యు మాణెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.*_


_*తాత్పర్యము:-*_

కృష్ణుడు అవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడ ఆనందమునే అనుభవించుచున్నవారలారా!

మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు – పాలసముద్రములో పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు ధ్వని కాకుండ మెల్లగా మంగళము పాడెదము. 

ఈ వ్రతసమయములో నేతిని గాని, పాలనుగాని మే మారగింపము, తెల్లవారుజాముననే లేచి స్నానము చేసెదము. 

కంటికి కాటుక పెట్టుకొనము, కొప్పులో పూవులు ముడువము, మా పెద్దలు ఆచరింపని పనులు ఆచరింపము. 

ఇతరులకు బాధ కలిగించు మాటలను, అసత్యవాక్యములను ఎచ్చోటనూ పలుకము.

 జ్ఞానాధికులకు అధిక ధనధాన్యాదులతో సత్కరించుచుందుము.

 బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షల నొసంగుచుందుము, మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసికొందుము. 

దీని నంతను విని, మీ రానందింప కోరుచున్నాము.


              *_🌺శుభమస్తు🌺_*


🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

శ్రీరంగం

  

                  *శ్రీరంగం*

                 ➖➖➖✍️

 ````

శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం.


శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి. ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).


1. ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉంది. 

శ్రీరంగం ఆలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.


2. ఈ గోపురాన్ని ‘రాజగోపురం’ అంటారు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు). ఇది ఆసియాలో అతిపెద్ద గోపురం.


కావేరీనది తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ ఆలయాలున్నాయి. అవి


#ఆది రంగడు : మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణం లోని రంగనాథస్వామి మందిరం.


#మధ్య రంగడు : శివ సముద్రంలోని రంగనాథస్వామి మందిరం.

.

#అంత్య రంగడు : శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరం.


నెల్లూరు పట్టణంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం కూడా ఒక ప్రసిద్ధ రంగనాథ మందిరం.


ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది. నాలాయిర దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలలో 247 పాశురాలు "తిరువారంగన్" గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్) గా భావించే ‘శ్రీశైలేశ దయాపాత్రం..’ అనే శ్లోకాన్ని రంగనాథస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు.


కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.```



*#ఉత్సవాలు:*```

శ్రీరంగనాథుడికి మకరం పునర్వసు; కుంభం శుద్ధ ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి చివరి దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగుతాయి. ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగుతాయి.


#విశేషం:


శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.


#సాహిత్యం:


శ్లో. కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే

 చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|

వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే

దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||


శ్లో. శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:

   శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర:|

   నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి

   పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|


శ్లో. కావేరి విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్|

   సవాసుదేవో రంగేశ: ప్రత్యక్షం పరమం పదమ్||


ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల విశ్వసిస్తారు. మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము.


వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపస్సు చేసాడు. బ్రహ్మ ప్రీతిచెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించాడు. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరలలేక పోయాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడు సంతుష్ఠుడై లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరేసమయానికి సంధ్యాసమయం అయింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణుని పూజనందుకుంటానని అనుగ్రహించాడు.


#ఆలయవిశేషాలు:


ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి నంబెరుమాళ్‌ అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవమేర్పడగా శ్రీరంగనాథుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు. 

ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని తిరువరంగ మాళిగైయార్‌ అని అంటారు.


#వివరణ:


పెరియాళ్వార్ తన "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో ఉన్నాయని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చింది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును అభివర్ణించాడు.


#శ్రీ పరాశర భట్ట స్తుతి:


శ్లో. అబ్జన్యస్త సదాజ్జ మంచితకటీ సంవాది కౌశేయకం

   కించిత్ తాండవ గంధి సంహసనకం నిర్వ్యాజ మందస్మితమ్|

   చూడాచుమ్బి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం

   శ్రీరంగే శరదశ్శతం తత ఇత:పశ్యేమ లక్ష్మీ సఖిమ్||


#బంగారు స్థంభాలు:


గర్భాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ళ సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశానికి "గాయత్రీమంటపము" అనిపేరు. గర్భాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్భాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.


#మొదటి ప్రాకారం:


మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విరజబావి, సేనమొదలియార్ సన్నిధి, పగల్‌పత్తు మండపం, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ గల చిలుకల మండపము నుండి విమానముపై గల పరవాసు దేవులను దర్శించాలి.


#రెండవ-ప్రాకారము:


ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం ఉంది. ఈ మండపములో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం (అభ్యర్థన) జరుగు మండపం. పరమపద వాశల్, తిరుమడప్పళ్లి, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇచట స్తంభముపై ఉన్న వినీత ఆంజనేయస్వామి వరములను ప్రసాదించగలిగిన శక్తివంతుడు.


#మూడవ ప్రాకారం:


ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి ఉంది. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే ఉన్నాయి. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచే మండపము ఉంది. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి ఉంది. ఉగ్రాణము పైన పట్టాభిరామన్ సన్నిధి, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి.


#నాల్గవ ప్రాకారము:


ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంది. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి ఉంది. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట నాదముని సన్నిధి ఉంది. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము ఉంది. ఈ ప్రాకారమలో శ్రీరంగ విలాసం ఉంది. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ) అవతరించిన విధము చిత్రించబడి ఉంది.


విజయ స్థంభం

విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే ఉన్నాయి. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే ఉంది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షుడు ప్రతిష్టితమై ఉన్నాడు. మీనమాసం, పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము ఉంది. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి. ఈ ప్రాకారములోనే ఉన్నాయి.


ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో ఉంది. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూప మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.


#శేషరాయన్-మండపము:


ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామ సన్నిధి ఉన్నాయి. దాని ప్రక్కన లోకాచార్యుని సన్నిధి, సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారథి సన్నిధి ఉన్నాయి.


#పరివారదేవతలు:


ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (రామానుజుల) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (పవిత్రశరీరం తానే అయిన ) ఇది ఒకప్పటి వసంత మండపము. ఇచట ఉడయ వరులు భక్తుల హృదయమున వేంచేసి ఉంటాడని మణవాళ మామునులు అభివర్ణించాడు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి సన్నిధులు ఉన్నాయి. వరదరాజస్వామి సన్నిధి ప్రక్కన ఉంది.


ప్రతి దినం ఉదయం 9 గంటల సమయంలో స్వామి సన్నిధిలో శాత్తుముఱై సేవ జరిగుతుంది.ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి, విఠల్ కృష్ణన్, తొండరడిప్పొడియాళ్వార్ ఉన్నాయి.


#ఐదవ ప్రాకారము:


ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చియార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు. ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి ఉన్నాయి.


Cont...

కధ

  🌹ఈరోజు కధ 🌹


పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది. పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకన్నాడు.


తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.


" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.


అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది. బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.


" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు.


సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు.


బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు.


బుచీకిని కొడుకు జమదగ్ని మహాముని. అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు.


ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరధుడనే గంధర్వున్ని చూసి లిప్తకాలం మోహపడింది.


అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడ వున్న కుమారుల్ని ఆదేశించాడు. వాళ్ళు ఆ పని చెయ్యలేమన్నారు. అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు. కోపంతో కణకణలాడుతున్న తండ్రిని సంగతేమిటని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లినీ, సోదరుల్నీ పరశువుతో నరికి చంపాడు. ఆ తరువాత, శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు.


వీరాధివీరుడు కార్తవీర్యార్జునుడు హైహయ వంశీయుడు, మాహిష్మతీ పురాధీశుడు. వెయ్యి చేతులున్నాయతనికి. అగ్ని దేవుడు వెళ్ళి అడిగితే గిరులూ, నగరాలూ, అరణ్యాలూ, గ్రామాలూ, కొండల కింది కుగ్రామాలూ ఆహారంగా ఇచ్చాడాయనకు. అవన్నీ దహిస్తూ, ఒకనాడు, వశిష్టుడు లేని సమయంలో, ఆయన ఆశ్రమం వున్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు . ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యుడు. ఇంతలో వశిష్టుడు వచ్చాడు. " ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు. నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక" అని శపించాడు.


ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాజపరివారానికి షడ్రసోపేతంగా విందు చేశాడు మహర్షి. రాజు ఆ గోవును తన కిమ్మన్నాడు. మహర్షి కాదనేసరికి బల ప్రయోగంతో కార్యవీర్యార్జునుడు ధేనువును మహీష్మతీ పురానికి తీసుకెళ్లాడు.

పరశురాముడికి సంగతి తెలిసింది. కోపోద్రిక్తుడై కార్యవీర్యార్జునుడి మీదకి దండెత్తి వెళ్ళి అతని వేయి చేతులూ ఖండించి శిరచ్చేదం చేశాడు.

అందుకు ఆగ్రహోదగ్రులైన కార్యవీర్యుడి కొడుకులు పదివేల మందీ పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి, జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు.

పరశురాముడు రాగానే జరిగినదంతా చెప్పి భోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి.

పరశురాముడు మాట్లాడలేదు.

గొడ్డలి చేత పట్టుకున్నాడు.

ఆమడ దూరానికో అడుగు వేస్తూ కదలివెళ్ళాడు.

మాహీష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలొ వున్న పిండాలతో సహా క్షత్రియులందర్నీ నాశనం చేశాడు.

తరువాత అశ్వమేధయాగం చేసి భూమినంతటినీ కశ్యపమహర్షికి దక్షిణగా ఇచ్చాడు. అప్పటినుండి భూమికి 'కశ్యపి' అనే పేరు వచ్చింది.

"భూమిని నాకిచ్చేశావు. ఇంక దీని మీద హక్కు లేదు నీకు. దక్షిణ సముద్రతీరానికి వెళ్ళు" అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్ధేశంతో ఆయన అలా ఆదేశించాడు.

సరేనన్నాడు పరశురాముడు.

అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది.

క్షత్రియులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. ఆరాజ్యకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది. అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కృంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు. ఊరువులతో ఎత్తబడినందుకే దానిని 'ఉర్వి' అన్నారు.

"మహాత్మా! పరశురాముని బారినుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే. వాళ్ళను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను" అంది భూదేవి.

కశ్యపుడు వాళ్ళందర్నీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు.

నేలతల్లి సంతోషించింది.🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

ధనవంతుడు

 

          *నిజమైన ధనవంతుడు*

                   ➖➖➖✍️     

```

ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు.


ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు.


ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు.


రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు.


ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు.


ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు.


ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.


రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవ భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు.


ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు.


ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది.


ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ‘సాందీపనీ’ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన ‘వశిష్ఠముని’ దగ్గరికీ వెళ్ళారు.


ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు.


ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు.


ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.


రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు.


ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.


ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు... “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”


ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు.


అంతకు మునుపు ఠాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు.


వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు.


లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు.


ఆయన కుటుంబమంతా ఠాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.


రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.


అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు పెద్ద ఫ్యాక్టరీలున్నాయి.”


“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.


“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”


“అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”


ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.


కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.


రవీంద్రుల వారు సంతోషంగా... “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”


“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

భూమిని ఆది శేషువు

 *భూమిని ఆది శేషువు మోస్తున్నాడా? దానికి సాంకేతిక నిర్వచనం ఏమిటి?*


*సౌందర్యలహరి లో ఆది శంకరులవారు అమ్మవారిని ఇలా అర్చిస్తారు* :

తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||

వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||


*తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.*


మన వేదాంగాల ప్రకారం విష్ణువే ఆది శేషుని రూపంలో చతుర్దశ భువనాలను మోస్తున్నాడని ప్రతీతి. ఏమిటి ఈ చతుర్దశ భువనాలు 

భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం (ఊర్ధ్వలోకాలు)

భూలోకం (మధ్యలోకం)

అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు (అధోలోకాలు)

ప్రత్యేకించి భాగవత పురాణంలో బ్రహ్మదేవుడు ఆదిశేషుని భూలోకాన్ని స్థిరీకరించమని ఆదేశించినట్లు చెబుతారు. అందువలన శేషువు పడగపై భూమి వుందని అది ఎల్లవేళలా మోస్తూ ఉంటుందని పురాణవచనం.

దీనిలో శాస్త్రీయత గురించి ఇప్పుడు కొంత చర్చించుకుందాము.


శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ (I), భాస్కర (I) ప్రసిద్ధులయ్యారు. సో, శ్లోకరచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. శ్రీ జీ ఎల్ యెన్ శాస్త్రిగారు కొంచెం శాస్త్రీయత జోడించి వివరించారు.

భూమికి నాలుగు రకాల చలనాలున్నాయి.

౧. తన చుట్టూ తాను తిరగడం (ఆత్మ ప్రదక్షిణ) – rotation

౨. సూర్యుని చుట్టూ తిరగడం – revolution


౩. ఉత్తర దక్షిణ ధ్రువాలు తారుమారు అవ్వడం 

మన భూమి సూర్యుని చుట్టూ ఒకే కోణం లో తిరగదు. ఒక బొంగరం తన కోణం మారుస్తూ తిరుగుతున్నట్టు తిరుగుతుంది. అది తిరిగేటప్పుడు ధ్రువ నక్షత్రాన్ని రిఫరెన్స్ గా ఒక వృత్తంగా తిరుగుతుంది. మనవారు మేరు పర్వతం చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి ఇది సహేతుకమైన వర్ణన. ఇక్కడ ఇచ్చిన బొమ్మ మీకు వివరంగా వివరిస్తుంది. 


౪. సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య ఒకే రకంగా వుండదు. ఆ కక్ష్య కోణం మారుతూ వుంటుంది. 

భాస్కరాచార్యుల వారు స్థిరీకరించిన సూర్యసిద్ధాంతం ప్రకారం దీనిని ఆయనాంసం అని అంటారు. మన భారతీయ సిద్ధాంతాన్ని 2BCలో జెర్మన్లు వారు నేర్చుకుని వారి ఆస్ట్రాలజీ సిద్ధాంతం ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ఆయనామ్సం మరిచారు. తరువాత భూమి కొన్ని 13డిగ్రీలు మారింది. అందుకే మన జాతక శాస్త్రం చాలా ఇతిమిద్ధంగా చెప్పగలదు. 


సూర్య సిద్ధాంతం ప్రకారం ఒక సరి అయిన ఆయనాంసం revolution కి 432000000(ఒక కల్ప యుగానికి సంవత్సరాలు) / 169669 = 25461 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రతి 25వేల సంవత్సరాల తర్వాత ఉత్తరాయనం దక్షిణాయనం అంశాలు మారిపోతాయి. నేటి లెక్కల ప్రకారం 25772 సంవత్సరాలు పడతాయని టెలిస్కోపుల ద్వారా కనుకొన్నారు. 

అంటే ఈ లెక్క కట్టాలంటే మనవారిదగ్గర ఎంత గొప్ప టెక్నాలజీ వుండిఉండేదో ఆలోచించండి.

ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర వున్న గొప్ప అంతరిక్ష పరిశోధన శాల చూసి పాశ్చాత్యులు విస్తుపోయారు. వాటి గురించి మరొక టపాలో చెప్పుకుందాము.


లీలావతి గణితం లో భాస్కరాచార్యుల వారు గ్రహాలు నిలబడాలంటే దానికి వాటి అయస్కాంత శక్తే కారణమని సిద్ధాంతం చెప్పారు. ఒకొక్క గ్రహం మరొక గ్రహంతో సంబంధిత శక్తి ద్వారా వాటి నిర్దేశిత కక్ష్యలో తిరుగుతున్నాయి. అలాగే కిందకు పడుపోకుండా ఒక నిర్దుస్త కక్ష్యాల్లో తిరగడానికి శక్తే కారణం. ఆది శంకరుల వారు ఆ శక్తికి మహా మాయ అని పిలిచారు. 


ఐంస్టీన్ ఆయన స్పేస్ టైం మాత్రిక గురించి చెప్పినప్పుడు దాన్ని ఈ శక్తికి అనుసంధానిస్తే ఆ మాత్రిక ఒక పాము పడగలా కనబడుతుంది. కింద ఇచ్చిన బొమ్మను ఒకసారి పరికించగలరు.

శంకరుల వారు చెప్పిన ఆ శక్తే , పునానాల్లో చెప్పే ఆది శేషువు, ఐన్స్టీన్ చెప్పిన స్పేస్ టైం మాట్రిక్స్ ఒకదానికి ఒకటి సంబదితంగా కనపిస్తుంది.

అలాగే సహస్ర పడగల మీద అనంతుడు ఈ బ్రహ్మాండాన్ని భరిస్తున్నాడని సిద్ధాంతం. 

సహస్రం అంటే అనంతం. వెయ్యి మాత్రమె కాదు. అనంతమైన ఇటువంటి స్పేస్ టైం మత్రిక్ష్ ఎలెమెంట్స్ ద్వారా ఈ గ్రహాలూ నక్షత్రాలు నిలబడి వున్నాయి.


మనం ఇప్పుడు చూస్తున్న ఈ 9 గ్రహాల యూనివర్స్ మరెన్నో వున్నాయి. ఈ యూనివర్స్ అండాకారం (ఓవల్) గా వున్నది అనడానికి మరొక నిరూపణ మనం ఇప్పుడు చూస్తున్న గ్రహాల కక్ష్యలన్నీ ఏవి వృత్తాకారం లో లేవు, అన్నే elliptical orbits. అలాగే ఇటువంటి సోలార్ సిస్టమ్స్ మరెన్నో వున్నాయి. 


ఇప్పుడు మనం తెలుస్కున్నది సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమె. ఇటువంటి నక్షత్రాలు ఎన్నో మరెన్నో వున్నాయని. ఇటువంటి పాల పుంతలు మరెన్నో వున్నాయని. 

మొన్నటికి మొన్న కెప్లెర్52 గ్రహం భూమిని పోలి వుందని. మనమిప్పుడు ఔనా అని ఆశ్చర్యపోతున్నాం. కానే దీని ప్రస్తావన మనకు ఎన్నో పురాణాల్లో లభిస్తోంది.


దేవి భాగవతం ప్రకారం ఇటువంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల లో వున్నాయి. కొన్ని కోట్ల త్రిమూర్తులు వాటిని పాలిస్తున్నట్టు చెప్పి వున్నది.

శేష అంటే సంస్కృతంలో అన్ని పోగా మిగిలున్నది అని అర్ధం. అటువంటికి అన్ని పోగా మిగులున్నది ఒక్క మాయ ( శక్తి ) మాత్రమె. అది మాత్రమె గ్రహాలను వాటి కక్ష్యలో వుండేటట్టు చేస్తున్నది. ఇదే ఆది శేష తత్వం.


మరొక పోలిక చెప్పి ముగిస్తాను. మనకున్న కుండలినీ శక్తిని షట్చక్రాలను శేష రూపంగానే చెబుతాము. ఇక్కడ శక్తి ని పాము రూపంలో చూపిస్తున్నాము. మనమే కాదు లేటెస్ట్ డాక్టర్ సైన్ చూసినా మీకు కలిసున్న రెండు పాముల రూపంలో చూపిస్తారు. మైక్రోకాస్మ్ లో మనం చూస్తున్నదే macrocosm లో వున్నది. అంటే పరమాణు రూపంలో లో అనువు, nucleus, ఎలెక్ట్రోన్ లు తిరగడం మనం గ్రహాలలో చూస్తున్నాము. ఇటువంటి మన వేనుపాము (పిండాండం) లో వున్న శేషావతారం లో వున్నా శక్తి బ్రహ్మాండంలో వున్నది. 


కాబట్టి ఆ అనంతమైన శక్తినే సంకేతార్ధంలో ఆది శేషువు గా మనం చెప్పుకుంటున్నాము. ఆయనే అంతటా నిండి వున్నా శక్తి. అన్ని చోట్ల వ్యాపించి వున్నవాడు – విష్ణువు.

ఉచితాలు - అనుచితాలు*

  *ఉచితాలు - అనుచితాలు*


సభ్యులకు నమస్కారములు.


ఏ ఒక్క పార్టీని గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడిని ఉద్దేశించి కాదు. వ్యవస్థ ఎట్లా తయారైందో చూద్దాము.


*ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు.*

మనంతట మనమే రోడ్డేసుకోలేం,

బడి కట్టుకోలేం,

గుడి కట్టుకోలేం,

ఆస్పత్రి కట్టుకోలేం.


ఆ పనుల్ని చేయడానికి ఒక వ్యవస్థను పెట్టిన దానికి *ప్రభుత్వము* అని పేరు పెట్టారు.


ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన (ప్రజల) పనులు చేసిపెట్టే బాధ్యత నాయకులకు, అధికారులకు రాజ్యాంగం అప్పగించినది. అందుకోసం ట్యాక్సుల రూపంలో

మన (ప్రజల) డబ్బులు తీసుకుని, మన (ప్రజల) కోసం బడి కట్టాలి,రోడ్డు వేయాలి,

ఆస్పత్రి కట్టాలి, కరెంటు తయారుచేయాలి,

డ్రైనేజీలు వేయాలి,

చెరువులు కట్టాలి

ప్రాజెక్టులు కట్టాలి ఇత్యాది.


కానీ మనం (ప్రజలు) కట్టిన డబ్బులను నాయకులు *తమ పేర్లు పెట్టుకుని*

తమకు *నచ్చిన వాళ్లకు పంచుతున్నారు*.


*అసహాయులను ఆదుకొనుట మంచిదే, అందుకు ఉపాధులను కల్పించాలి*. అంతేగానీ ఉచితాలను అలవాటు చేయకూడదు


కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణలో కరిగేపోయాయి.

మొన్నే 50 వేల కోట్ల డబ్బులు పంచాం, ఇంత పంచాం, అంత పంచాం అని అధికార వర్గాలు ఘనంగా చెప్పుకున్నాయి. చెప్పుకొంటూనే ఉంటారు.


*ఎవరి సొమ్ము అది*

*ప్రజలు కట్టిన పన్నులే కదా.* మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా.


రేపటి నుంచి 

తెలంగాణలో గాని ఆంధ్రలో గాని ఇతర రాష్ట్రాల కంటే 4 (కొన్ని ) రూపాయలు ఎక్కువపెట్టి పెట్రోలు మరియు డీజిల్ కొనాలి.


*ఇటువంటి పన్నులను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకొండి*

*జనం పాలకులను నిలదీస్తారు. కడిగేస్తారు.*


కానీ తెలంగాణలో, ఆంధ్రాలో *ప్రజలు పుడితే పథకం, చదివితే పథకం,*

*పెద్దయితే పథకం,*

*స్కూలు కెళితే పథకం,*

*సంఘానికెళితే పథకం*

*వ్యవసాయం చేస్తే పథకం, పెళ్లి చేసుకుంటే పథకం*


ఉన్న ధన నిల్వలు పెంచడం కష్టం గాని, *పంచడం ఎంత సేపు, 5 నిమిషాల పని.*


డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా, అభిమానులు తీసుకుంటున్నారు. పన్నుల డబ్బులు ఈలా ఉచితాలకు పంచుతూ ఉంటే అభివృద్ధి పనులు ఎలా అవుతాయి.


చాలా సింపుల్ లాజిక్.

*మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి. ఆ డబ్బులను ఎలా వాడితే పెరుగుతాయి అన్నది నాయకుడిని బట్టి ఉంటుంది*


కులాల వారిగా ప్రజలను వేరు చేసి.... చేసే వృత్తుల వారిగా కోట్లమంది హక్కుని కొంతమందికి పంచితే మిగతా వారి తలపై అప్పులు ధరల రూపంలో గుది బండై కూర్చోవా.


*ఓ ఓటరు మహాశయా మేలుకో* ఉచితంగా ఏది రాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి.


 *ప్రభుత్వాలు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో...ఒక్కసారి గమనించండి.*


ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు ప్రజలందరి కష్టార్జితాలు, ఫలితాలు అందరికీ అందాలి. *సమాజంలో చైతన్యం తీసుకవద్దాము*


ధన్యవాదములు

రుద్రః అంటే శివుడా, విష్ణువా

 రుద్రః అంటే శివుడా, విష్ణువా?. వేదంలో రుద్రారాధనే కదా ముఖ్యంగా ఉన్నది?



" రుద్రః " విష్ణుసహస్రనామాలలో ఒక అద్భుత నామం. ఈ రుద్రః నామం గురించి ఆదిశంకరులు అద్భుతమయిన భాష్యం చెప్పారు.


రుద్రహృదయోపనిషత్తు - యజుర్వేదం - శ్రీరుద్రః రుద్రః రుద్రః అని 3 సార్లు అంటే సమస్త పాపాలు దగ్ధమయిపోతాయి అని తెలియచేస్తూంది. కరుణామూర్తి.


" రోదయతి అంతఃకాలయితి రుద్రః " - ప్రళయ సమయంలో అందరినీ ఏడిపించేవారు రుద్రుడు అని.


" రురుం ద్రావయతి ఇతి రుద్రః " - రురుం అంటే దుఃఖము, దుఃఖహేతువు రెండింటినీ కరిగించేస్తాడు, పోగొడుతాడు అని.


శివపురాణం " రుత్ దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి యః ప్రభుః రుద్రయిత్యుచ్యతే తస్మాత్ శివః పరమ కారణం " అని తెలియచేస్తూంది - దుఃఖం, దుఃఖ కారణం రెండూ పోగొడుతాడు అని.


" అత్యంతిక దుఃఖనాశకః " - ఏ దుఃఖం పోతే ఇక దుఃఖమే ఉండదో ఆ స్థితిని రుద్రుడు ఇస్తారు అని - ఆనందప్రదాత.


" ప్రణత దుఃఖద్రావకః " - దుఃఖాన్ని ద్రవింపచేయువాడు. అందుకే కష్టం రాగానే రుద్రాభిషేకం చేసుకో, పంచాక్షరి చెయ్యి అంటారు.


ఋగ్వేదం " ఋషీణాం దృతమస్య రూపముపలభ్యతే " - ఋషులకు ధ్యానం చేస్తే వెంటనే కనిపిస్తాడుట రుద్రుడు.


" రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయితి ఇతి రుద్రః " - వేదం - నాదం చివర లభించి ఆనందస్వరూపుడిగా ద్రవించువాడు అని. ఓం అని స్మరించి నప్పుడు మ్..... అంటాం చివరలో. మ్... చివరలో ప్రకృతిలో లీనమయినప్పుడు సాధకుల మీద అమృతధార కురిపిస్తారుట రుద్రుడు.


వేదం " ఓం నమోభగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే బాహి " అంది. రుద్రుడైన విష్ణువునకు నమస్కారములు అని.


అందుకే ఓ పండితుడు " రుద్రుడు కాని విష్ణువు, విష్ణువు కాని రుద్రుడు నాకు వద్దు " అన్నారు. అంటే దుఃఖం ( రుద్రుడు పోగొడుతాడు ) పోగొట్టని విష్ణువు ఎందుకు. విష్ణువు ( సర్వత్రా వ్యాపించిన వాడు ) కాని రుద్రుడు ఎందుకు అని.


" శివాయ విష్ణురూపాయ

శివరూపాయ విష్ణవే "


ఇంకా రుద్రుడు వేరు, విష్ణువు వేరు అనుకుంటే మూర్ఖత్వం. అటువంటి వారికి జ్ఞానం చమని అమ్మవారిని కోరుకుందాం.

ఆన్లైన్లో సంగీతం క్లాసులు

  ఆన్లైన్లో సంగీతం క్లాసులు


 ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు కండక్ట్ చేయబడుతున్నాయి మీ పిల్లలకి సంగీతం నేర్పించదల్చుకుంటే వెంటనే ఈ పోస్ట్ కింద కామెంట్ రూపంలో మీరు మీ వివరాలు వాట్సాప్ నంబర్ తో సహా తెలియజేయగలరు. మీ వాట్సాప్ నంబర్ తెలియజేస్తే వాట్సాప్ ద్వారా మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలము. మీరు పెట్టిన కామెంట్లు ఈ బ్లాగులో ఎవరికి కనబడవు. 


మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పర్వాలేదు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ కావచ్చు 


ప్రస్తుతం అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. మీ చిన్నారులకు కర్ణాటక సంగీతం నేర్పించడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని  వీక్షకులు అందరూ వినియోగించుకోగలరు

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - చతుర్దశి - అనూరాధ -‌‌ గురు వాసరే* (18.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 18.12.2025

  ఈ రోజు పంచాంగం 18.12.2025 

Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష చతుర్దశి తిథి బృహస్పతి వాసర అనురాధ నకత్రం ధృతి యోగః భద్ర తదుపరి శకుని కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: చతుర్దశి

 


నమస్కారః , శుభోదయం

18డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

  *🌷బృహస్పతివాసరే🌷*

 *🌹18డిసెంబర్2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం*                   

       ‌           

        *ఈనాటి పర్వం*

        *మాసశివరాత్రి*


         *స్వస్తి శ్రీ విశ్వావసు* 

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - బహుళపక్షం*


*తిథి  : చతుర్దశి* ‌రా 04.59 తె వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : అనూరాధ* రా 08.07 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : ధృతి* మ 03.06 వరకు ఉపరి *శూల*

*కరణం  : భద్ర* మ 03.47‌ ఉపరి *శకుని* రా 04.59 తె వరకు 


*సాధారణ శుభ సమయాలు:*

                *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *ఉ 08.27 - 10.14*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.26*

*వర్జ్యం    : రా 02.21 - 04.08*

*దుర్ముహూర్తం  : ఉ 10.13 - 10.57 మ 02.40 - 03.25*

*రాహు కాలం   : మ 01.28 - 02.51*

గుళికకాళం      : *ఉ 09.17 - 10.41*

యమగండం    : *ఉ 06.30 - 07.53*

సూర్యరాశి :*ధనుస్సు*                            

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.40*

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.30 - 08.43*

సంగవ కాలం         :     *08.43 - 10.57*

మధ్యాహ్న కాలం    :    *10.57 - 01.11*

అపరాహ్న కాలం    : *మ 01.11 - 03.25*


*ఆబ్ధికం తిధి         : మార్గశిర బహుళ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.25 - 05.39*

ప్రదోష కాలం         :  *సా 05.39 - 08.12*

రాత్రి కాలం           :*రా 08.13 - 11.39*

నిశీధి కాలం          :*రా 11.39 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.47 - 05.39*

<><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ సద్గరుభ్యోనమః !!* 


*అఙ్ఞానతిమిరాంధస్య* 

*ఙ్ఞానాంజనశలాకయా*

*చక్షురున్మీలితం యేన*

*తస్మై శ్రీగురవే నమః*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

నీటిలో రాయిని

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *ఎదుటి వారిని బాధ పెట్టడం సముద్రం నీటిలో రాయిని వేసినంత సులువు.. కానీ వారిని మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయుడు వెతికి తీసుకొచ్చేంత కష్టం.. అందుకే ఎవరిని బాధ పెట్టడానికి ప్రయత్నించకూడదు.. ఎదుటివారిని అపహాస్యం చేయడం వినోదం అని భావించి భ్రమ పడుతున్నారు.. వేధించటం ఒక వేదికగా చేసుకుని సంతోషపడుతున్నారు.. వికృతానికి వినోదానికి తేడా తెలియనంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారు.. కుటుంబ విలువలకు తిలోదకాలు ఇచ్చి ధర్మాన్ని కంచపరిచే పద్ధతుల తీర్థం పుచ్చుకుంటున్నారు.. పుట్టిన క్షణం నుండి ఆఖరి క్షణం వరకు ఆత్మీయులు కంటే ఎక్కువగా సాంకేతిక వస్తువుల సాంగత్యంలో మునిగి తేలుతూ అసలైన ఆప్యాయతలకు దూరమవుతున్నారు*🔥మీ *అల్లంరాజు భాస్కర శర్మ.