19, డిసెంబర్ 2025, శుక్రవారం

బ్రాహ్మణ భోజన ప్రియః*

 *బ్రాహ్మణ భోజన ప్రియః*


బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ 'బ్రాహ్మణ భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు. నిజానికి 'బ్రాహ్మణ'బహుజన ప్రియ' అని చాలా మంది ఎరుగరు. అసలు శ్లోకం ఏమిటంటే:

       " అలంకార ప్రియో విష్ణు 

          అభిషేక ప్రియః శివ 

          నమస్కార ప్రియః భాను 

          బ్రాహ్మణ భోజన ప్రియః"

 సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే 

ఇష్టం, మరేమో శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి భోజనం ఇష్టమని కాదు ఇక్కడ కొశ్చెను, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! మరేమో బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని'పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"

      కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట. అంతే కాని బ్రాహ్మణులు కడుపునిండా తినికూర్చుని  'బ్రేవ్' మని  త్రేలుస్తారని కాదు.

 1. బ్రాహ్మణుడు పేదోడైతే 'కుచేలుడై' శ్రీ కృష్ణ సేవలను అందుకొంటాడు.

 2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' చాణక్యుడై' పగ సాధిస్తాడు.

 3. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై' గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.

 4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు. 

 5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే 'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.

 6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై' లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.

బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు .

 ౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'

౨ .బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'

౩ . బ్రాహ్మణ జీవనం 'త్యాగం'

౪ .బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'

౫.బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'

౬ . బ్రాహ్మణ త్యాగం 'దధీచి'ఋషి 

౭ . బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే మయూర వర్మ'

౮ . బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'

౯ . బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్'

౧౦ .బ్రాహ్మణ భక్తి 'రావణుడు'

౧౧ .బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ మధ్వ' ఆచార్య త్రయం.

౧౨ . బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి దయానంద 

౧౩ . బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'

౧౪ . బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'

౧౫ . బ్రాహ్మణ గణితం' రామానుజo'

౧౬ . బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.

ఇదంతా ఎలా సాధ్యమైంది?

కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,

 1. బ్రాహ్మణ జన్మ 'విష్ణాంశ'

 2. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా పరిష్కారం.

 3. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'

 4. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'

 5. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'

 6. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు సాధనం'

 7. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'

 8. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'

 9. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'

 10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ ప్రాప్తి'

 11. బ్రాహ్మణ వరదానం 'మోక్ష ప్రాప్తి'

 12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'

 13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'

 14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'

 15. బ్రాహ్మణ దక్షిణ'సప్త జన్మ పాప విమోచనం'

 16. బ్రాహ్మణ ఘర్జన 'సర్వ భూత సంహారం'

 17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'

 18. బ్రాహ్మణ ఐక్యత ?(అదే డౌటు)'సర్వ శక్తి వంతం!

జయ మహాకాల, జయ పరశురామ, జయగురుదత్త.

దయచేసి నిత్య కర్మానుష్టానము చేసే బ్రాహ్మణులందరూ ఈ సందేశాన్ని పంచుకోండి.

వ్రతాచరణ

*వ్రతాచరణ వలన ప్రయోజనం*



తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ


యతేత మృత్యో రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. వ్రతాలు పూజలు, జపాలు, తీర్థయాత్రలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. ఏఏ వ్రతాలు చేసుకోవాలి, ఏఏ సమయాలలో ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను గరుడపురాణంలో విశేషంగా ప్రస్తుతించారు. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


వ్రతాలు చేసుకుంటూ ఉంటే మెల్లి మెల్లిగా పాపక్షయం అవుతుంది.

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🌷బృహస్పతివాసరే 18 డిసెంబర్ 2025🌷*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            7️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*              

                    *78 వ రోజు*

                    

*వన పర్వము ద్వితీయాశ్వాసము*


*దమయంతి స్వయంవరం*```


నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో “నిషధ రాజా!నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. 


నలుడు “అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను మీకేమి చేయాలి?” అని అడిగాడు. 


ఇంద్రుడు నలునితో “నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్ములను వరించేలా చేయాలి” అన్నాడు. 


నలుడు ఇంద్రునితో “అయ్యా! నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా అన్నాడు. 


ఇంద్రుడు నలునితో “నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతాకార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు” అన్నాడు. 


గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. 


దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి “మహాత్మా మీ రెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?” అని అడిగింది. 


నలుడు దమయంతితో “నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు” అన్నాడు. 


నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. “అయ్యా! నేను మానవకాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నాభర్త, కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, ఇతరులను వరించను” అని దమయంతి ప్రార్థించింది. 


నలుడు దమయంతితో “దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులు, జరా మరణాలు లేని వారు, వారిని కాదని జరామరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?” అని అన్నాడు. 


ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో “నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు” అన్నది. 


ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు “దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము” అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. 


స్వయంవర మండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. మనస్సులో ధ్యానించి “దేవలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. 


వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

19డిసెంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

*🪷19డిసెంబర్2025🪷*  

   *దృగ్గణిత పంచాంగం*              

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - బహుళపక్షం*


*తిథి  : అమావాస్య* ‌పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* రా 10.51 వరకు ఉపరి *మూల*

*యోగం : శూల* మ 03.47‌ వరకు ఉపరి *గండ*

*కరణం  : చతుష్పాద* సా 06.07 వరకు ఉపరి *నాగ పూర్తిగా*

*సాధారణ శుభ సమయాలు:*

             *—ఈరోజు లేవు—*

అమృత కాలం  : *మ 01.03 - 02.50*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.27*

*వర్జ్యం    : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 08.44 - 09.29 మ 12.27 - 01.12*

*రాహు కాలం   : ఉ 10.41 - 12.05*

గుళికకాళం      : *ఉ 07.54 - 09.17*

యమగండం    : *మ 02.52 - 04.15*

సూర్యరాశి : *ధనుస్సు*                          

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.41* 

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.30 - 08.44*

సంగవ కాలం         :     *08.44 - 10.58*

మధ్యాహ్న కాలం    :    *10.58 - 01.12*

అపరాహ్న కాలం    : *మ 01.12 - 03.25*

*ఆబ్ధికం తిధి         : మార్గశిర అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.25 - 05.39*

ప్రదోష కాలం         :  *సా 05.39 - 08.13*

రాత్రి కాలం           :*రా 08.13 - 11.39*

నిశీధి కాలం          :*రా 11.39 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.48 - 05.39*

<><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*సత్యప్రత్యయనీ చైవ* 

*స్వప్రకాశాత్మరూపిణీ*


               *🪷ఓం శ్రీ🪷*

 *🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

తిరుప్పావై – 4వ పాశురము*

  🌹🌷🪔🪔🛕🪔🪔🌷🌹

*శుక్రవారం 19 డిసెంబర్ 2025*


*శ్రీమతే రామానుజాయ నమ:*

_*తిరుప్పావై – 4వ పాశురము*_

_*శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో*_


_*4వ పాశురము:-*_


_*ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్*_

_*ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడార్ త్తేరి*_

_*ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు*_

_*పాళియందోళుడై ప్పర్పనాబన్ కైయిల్*_

_*ఆళిపోళ్ మిన్ని వలమ్బురి పోల్ నిన్రదిర్న్దు*_

_*తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్*_

_*వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్*_

_*మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్*_


_*తాత్పర్యము:-*_


గంభీరస్వభావుడా! వర్షనిర్వాహకుడా! ఓ పర్జన్యదేవా! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపజేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి, ఆ సముద్రజలమునంతను, నీవు పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి, సర్వజగత్కారణభూతుడగు శ్రీ నారాయణుని దివ్యవిగ్రహము వలె శ్యామలమూర్తివై, ఆ పద్మనాభుని విశాలసుందరబాహుయుగళిలో దక్షిణబాహువునందలి చక్రము వలెమెరిసి, ఎడమచేతిలోని శంఖము వలె ఉరిమి, శార్ఙ్గమను ధనస్సునుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు, మేము సంతోషముతో మార్గశీర్షస్నానము చేయునట్లు వర్షించుము.


*శ్రీమతే రామానుజాయ నమ:*

*శ్రీమన్నారాయణ రామానుజ యతిభ్యో నమ:*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🌹శుక్రవారం 19 డిసెంబర్ 2025🌹*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            7️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


     *సంపూర్ణ మహాభారతము*           

                    *79 వ రోజు*                    


*వన పర్వము ద్వితీయాశ్వాసము*


*నలదమయంతులపై కలిప్రభావం*```


దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళుతుండగా, దేవతలకు కలి పురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలి పురుషుని చూసి "ఎక్కడికి పోతున్నావు?" అని అడిగాడు. 


"భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను" అన్నాడు. 


అ మాటలకు వారు నవ్వి "దమయంతి స్వయంవరం జరిగింది. ఆమె నలుని వివాహమాడింది" అన్నారు. 


కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు, కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. 


ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యా వందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలువవచ్చని నమ్మబలికాడు. 

బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని, నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తనరాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు అయినా ఆడటం మానక, సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి "ఓడేకొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది. ఏమీ చెయ్యలేము" అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రసేనను, కుమారుడు ఇంద్రసేనను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి, నగరం వెలుపల మూడు రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడటానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేక పోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పైవస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు "దమయంతీ! ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి. ఇది, నీపుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. ఇది, దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇది ఉజ్జయినికి పోయే మార్గం.. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు, నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు" అని చెప్పాడు. "అవును నాథా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము" అని చెప్పింది. నలుడు "దమయంతీ! మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని, రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే, ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి" అన్నాడు నలుడు. 


దమయంతి "నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండటానికి అనుమతించండి" అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు.```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

రోగాన్ని గుర్తించి వైద్యులు

 *వ్రతాచరణ వలన ప్రయోజనం*



తస్మాత్ పురైవాద్దిహ పాప నిష్కృతౌ


యతేత మృత్యో రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. వ్రతాలు పూజలు, జపాలు, తీర్థయాత్రలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. ఏఏ వ్రతాలు చేసుకోవాలి, ఏఏ సమయాలలో ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను గరుడపురాణంలో విశేషంగా ప్రస్తుతించారు. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


వ్రతాలు చేసుకుంటూ ఉంటే మెల్లి మెల్లిగా పాపక్షయం అవుతుంది.

మధుమేహ నివారణా చూర్ణం -

 మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - . మధుమేహ నివారణ చూర్ణం.

       

. మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   

•. మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

  

. పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.


• తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       

. తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు . 

 

 మధుమేహ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును. 


• మధుమేహ నివారణా చూర్ణం -

 

. 14 రకాల మూలికలతో చేసిన "మధుమేహ చూర్ణం " మా దగ్గర లభ్యం అగును. ఈ చూర్ణం మధుమేహం, దీర్ఘాకాలంగా మధుమేహం ఉండటం వలన అంతర్గత అవయవాల మీద పడు దుష్ప్రభావాలను అద్భుతంగా నయం చేయును. శరీరంలో కోల్పోయిన శక్తిని పునురుద్దరించును. రక్తశుద్ధి చేయును. శరీరము నందలి వ్యర్థ పదార్ధాలను బయటకి పంపును. శరీరం శుద్ధి అగును. మధుమేహ రోగులకు సంభవించు నరాల దోషమును సంపూర్ణముగా పోగొట్టును.  


ఈ చూర్ణము కావలసిన వారు 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు. 

     

        

     కాళహస్తి వేంకటేశ్వరరావు  


. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

         

. 9885030034