తత్ సత్ అనే పదం యొక్క విషయ పరిశీలన. ఆంగ్లంలో కూడా దట్ అది అనగా ఏ విషయమైతే నీకు తెలుసో దానిని తత్ అని సంబోధన. మరి అది అనగా ఏమి తత్వం పదార్ధ శక్తి లక్షణమా. ముందు పదార్ధం గురించి ఎవరైనా లేశమైన చెప్పియుండవలెనుకదా. లేనిచో ఏమీ తెలియదు. విషయ పరిశీలన యే తత్ త్వంగా మారి తెలిసిన తదుపరి తెలిసినది. అట్లు తెలిసినది కూడా అహం అని భావన కలిగి రజో గుణ రూపంలో దేహము తద్వారా మెూహము తద్వారా ఆసక్తి తద్వారా అనురాగం తద్వారా శాశ్వతమని మాయ అని భ్రాంతి కలుగుచున్నది. యిది బ్రహ్మ విషయంలో కూడా వస్తు తత్వం తెలిసిన తరవాత యిది కాదని చేసినది వేరు కలదని బాహ్యంలో హయంలో కానక నేతి నేతి యని దర్శించిన విషయం స్పష్టంగా తెలియు వరకు పరిశీలన చేయుచూ వుండవలెను.లేనిచో సత్యం తెలియదు.అసత్యం మాయామయం. దాని వివరణ ఉపనిషత్ రూప భగవద్గీత. సత్ తత్ యని తెలియ వలెను. అది పూర్ణము జీవము. జీవము సత్ జీవుడు.దేహాశ్రయమైన మాయ. దానికి లోబడిన సమస్తం నాశనమే. దీనిని త్రిగుణాత్మకమైన జగత్తు గా తెలియుట. కర్మ సూక్ష్మంగా పరిశీలనతో చేయుట జీవ లక్షణము చేయు కర్మ ఫలమును అనుభవేకవేద్యం వాసన యని తెలియుచున్నది. ఎన్ని సార్లు ఎంతమంది చెప్పినా అహంకారము ప్రబలంగా వున్న వినాశనం. వక వ్యక్తి వలన కోట్లాది ధన మాన ప్రాణములు నశించుట అధర్మం. అధర్మ వర్తనులు నశించుట సృష్టి ధర్మం. ధర్మం భూమితో సమానం. శక్తిని అను ఆత్మ శక్తి కలది కావున భూ చలనం.ధరించినది కావున ధరణి. చలనం వలన సృష్టి. యిది యే తత్ యిది యే ఎల్లప్పుడూ గల సత్ రూప సత్యం. భగవద్గీత సమస్త సారం సత్యమే.అసత్యాన్ని భగవద్గీతోపనిషత్ చెప్పలేదు. ఉపనిషత్ తత్ ఉష శక్తి రూప కాంతిని దగ్గరగా పరిశీలన చేయుట. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి