*_మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రం లోనైనా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి, దాని అర్థం ఏమిటి??? - దాని వలన లాభం ఏమిటి??? - ఒకసారి పరిశీలిద్దాం_*
ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ...
_శాంతి మంత్రంలో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో తెలియదు, కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు..._
*మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది*
_*1,ఆధ్యాత్మిక, 2,ఆది దేవిక, 3,ఆది భౌతిక,..*_
*ఇక వీటి వివరాలు పరిశీలిద్దాము...*
మొదటి " శాంతి " పదం ... శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి, దీన్ని " ఆధ్యాత్మికం " అంటారు,
రెండవ " శాంతి " పదం ... ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని
" ఆధిభౌతికము " అంటారు,
మూడవ " శాంతి " పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధిదైవికము " అంటారు,
ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ " శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి