20, ఆగస్టు 2021, శుక్రవారం

లక్ష్మీ నివాసం

 ॐ                లక్ష్మీ నివాసం 


"ఏ దేశంలో 

 - బంగారు ఛాయతో (మంచి రంగుతో) వరి, గోధుమ మున్నగు సస్యాలు ప్రకాశిస్తూ ఉంటాయో,    

 - బియ్యపు గింజలు వెండిలా మెరుస్తూ ఉంటాయో,    

 - ఎక్కడ అన్నం పొల్లుగింజలు లేకుండా పొట్టు లేకుండా ఉంటుందో,    

    అక్కడ నేను నివసిస్తాను"  అంటుంది లక్ష్శీదేవి 


"ధాన్యం సువర్ణ సదృశం 

 తండులా రజతోపమాః 

 అన్నం చైవాతుషం యత్ర 

 తత్ర కృష్ణ! వసామ్యహమ్" 


వివరణ 


    ధాన్యానికి మంచి రంగు ఉంటే రైతుకి మంచిధర పలికి సంపత్కరకం అవుతుంది. 

    మంచి రంగుతో బియ్యపు గింజలు చక్కగా వెండి గింజల్లా మెరుస్తూ ఉండాలన్నా అతివృష్టి, అనావృష్టి దోషాలు లేకుండా ఉండాలి. 

    సరిగ్గా పంట చేతికందే సమయంలో అతివృష్టి కలిగితే ఆ సస్య సంపద మట్టి కొట్టుకు పోతుంది. 

    అలాగే సరైన సమయంలో వానలు పడకపోయినా మేలైన పంట పండదు. 


          వర్షం రెండు రకాలు 


1. వర్ష ఋతువులో 

  - నదులు పొంగీ, చెఱువులు బావులు నిండీ, 

  - భూమి ఇంకి పొర నీటిని కలిగియుండి మిగిలిన ఐదు ఋతువులలో ఉపయోగపడే విధంగా. 

    ఇది యజ్ఞాలవలన వాతావరణ కాలుష్యం తొలగి, భారీ స్థాయిలో నీటి నిల్వలు కలగడం. 


2. పది రోజులకొక వాన చొప్పున నెలకు మూడు వర్షాలు పడాలి. 

     పంటలు దెబ్బతినకుండా,

 - దుమ్మూ ధూళీ అణిగియుండి, 

 - చల్లదనాన్ని కలిగిస్తాయి. 

       అలా సక్రమంగా పదిరోజులకొకసారి చొప్పున, నెలలో మూడుసార్లు సక్రమంగా వర్షించడం ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. 

      మూడు వర్షాలలో 

(i) ద్విజులు తమకు శాస్త్ర విహితమైన ధర్మకర్మాచరణ చేసినపుడు మొదటి  వర్షం పడుతుంది. 

(ii) పాలకులు 

    - ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజల్ని పోషిస్తూ, 

    - అపరాధుల్ని తరతమ భేదం లేకుండా శిక్షిస్తున్నప్పుడు రెండవ వర్షం పడుతుంది. 

(iii లోకంలో స్త్రీలు భర్తకు అనుకూలంగా గృహస్థాశ్రమ ధర్మాల్ని నిలబెడుతున్నప్పుడు మూడవ వర్షం పడుతుంది. 

    ఇప్పటి వర్షాభావ స్థితులకి రహస్యం ప్రాచీనులు ఇలా ఎప్పుడో చెప్పి ఉన్నారు. 

    కనుక వర్షాల సమస్థితిపై భూమి సాఫల్యం ఆధారపడి ఉంటుంది.    


https://youtu.be/-ZKvsRfnAUk


                    =x=x=x=    


    — రామాయణం శర్మ    

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: