20, ఆగస్టు 2021, శుక్రవారం

దేవరియా బాబా బా చరిత్ర 6 వ భాగం*

 🕉️🤘🕉️🤘🕉️🤘🕉️🤘🕉️🤘🕉️

_"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే"_


🌹 _*"కాలాతీతుడు ⏳ దేవరియా బాబా"*_🌹

బాబా ఎప్పుడూ నిద్రపోయేవారు కాదు. ఆయన ఎప్పుడు జన్మించారో, ఆయన వయసు ఎంతో, ఆయన కులం ఏమిటో ఎవరికీ తెలియదు. ఈ విషయం గురించి బాబాను ప్రశ్నించినప్పుడు... బాబా _"మనుష్యుల శరీరాలు తల్లి గర్భమునుండి వచ్చినవే. అయితే అయోనిజలై అవతరించిన వారు మనకు తెలుసు. బ్రహ్మ 'పద్మ యోని' నుండి, ద్రౌపది, దృష్టద్యుమ్నుడు _'యజ్న యోని' నుండి జన్మించారు. నా శరీరము మీరు అనుకునే మానవ శరీరం కాదు. *ఇది దివ్య దేహము.* ఏ స్త్రీ గర్భమునుండీ ఏర్పడినది కాదు. నేను నా యోగశక్తిచే ఈ దివ్య శరీరమును పవిత్ర సరయు నదీ 🌊 జలముచే ధరించాను. నా ఈ శరీరము "అయోనిజ" అయినది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే - జలమే నా స్వరూపము. జలమే నా జన్మ స్థలము"_ అని పలికారు. 🙏


బాబా వయసు కొన్ని వేల సంవత్సరములై ఉంటుంది. భూమి మీద మాట్లాడే అన్ని భాషలు బాబా అర్థం చేసుకునేవారు. మాట్లాడేవారు. ఒకసారి _"బాబా..! మీ వయస్సెంత?"_ అని శిష్యులు ప్రశ్నించినపుడు, బాబా వారితో - _*"నాయనా..! నా వయస్సు ఇంత అని నేను నిర్ధారించి చెబితే.... నన్ను చూడటానికి వచ్చే జనమునకు తగిన ఏర్పాటు చేయటానికి దేశంలోని 👮‍♂️ పోలీసులు, మిలిటరీ 💂‍♀️ అంతా కలిసి కట్టుగా ప్రయత్నించినా సరిపోదు. నన్ను చూడటానికి వచ్చే జనంతో 👩‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦 తొక్కిసలాట జరుగుతుంది. నా శరీరము అత్యంత ప్రాచీనమైనది. యోగ సాధన ద్వారా నిర్మితమైన ఈ శరీరమునకు శస్త్ర ⚔️- అస్త్రముల 🏹వల్లగాని, జల 💦 - వాయువుల 💨 వల్ల గాని, నిప్పు 🔥- నేల 〽️ వల్లగాని ఎటువంటి హానీ ఏర్పడదు"*_ అని పలికారు.


*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

🕉️🤘🕉️🤘🕉️🤘🕉️🤘🕉️🤘🕉️

కామెంట్‌లు లేవు: