20, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము* *390వ నామ మంత్రము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*390వ నామ మంత్రము* 


*ఓం నిర్వాణ సుఖ దాయిన్యై నమః*


ప్రతీ జీవునకు అవసరమైన నిర్వాణ (మోక్ష) సుఖమును ప్రసాదించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిర్వాణసుఖదాయినీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం నిర్వాణ సుఖ దాయిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అత్యంత భక్తి ప్రపత్తులతో అర్చించు భక్తులను ఆ తల్లి భౌతికముగా సుఖశాంతులతోనూ, ఆముష్మికపరముగా ఆధ్యాత్మిక సుఖశాంతులతోను విలసిల్లజేయును.


వాణము అను శబ్దమునకు శరీరము. నిర్వాణము అనగా అశరీరము. అనగా శరీరసుఖము కాకుండా అశరీర పరమైన శాశ్వతసుఖమును ఇచ్చును. శాశ్వత సుఖము అంటే మోక్షము. అమ్మవారు నిత్యక్లిన్న (సదా దయార్ధ్రమైనది), నిరుపమా (దయార్ధ్రతలో సాటిలేనిది) గనుకనే భక్తులకు నిర్వాణసుఖమును ప్రసాదించునది అయినది. అనగా శాశ్వతమైన ఇహపరసుఖములను ప్రసాదించునది. అందుచేతనే ఆ అమ్మను *నిర్వాణసుఖదాయినీ* యని అన్నాము.


నిర్వాణసుఖము కావాలాంటే తాను సంసారంలో ఉన్నా తనలో సంసారంలేనట్టి నిర్మలమైన భక్తితత్పరతతో భౌతిక సుఖములందు వైరాగ్యముగలిగి, సత్కర్మలనాచరిస్తూ, కర్మపరిపక్వతను సాధించగా వచ్చే ఫలితమే నిర్వాణసుఖము (శాశ్వతమైన సుఖము/మోక్షము). అటువంటి మోక్షప్రదాత గనుకనే అమ్మవారు *నిర్వాణ సుఖదాయినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నిర్వాణ సుఖదాయిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: