20, ఆగస్టు 2021, శుక్రవారం

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

 

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

మనము ఇప్పుడు స్త్రీలు కూడా మగవారితో సమానంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు అని అనుకుంటున్నాము. కానీ నిజానికి మన భారతావనిలో వేదకాలంలోనే స్త్రీలు అత్యున్నత జ్ఞానం సంపాదించారంటే అతిశయోక్తి లేదు. 

గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది. కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది. సభలో కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: