*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*973వ నామ మంత్రము*
*ఓం శుద్ధ మానసాయై నమః*
నిర్మలమైన మనస్సుగలిగినది పరమేశ్వరి.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శుద్ధమానసా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం శుద్ధమానసాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులను ఆ పరమేశ్వరి నిర్మలమనస్కులుగను, భక్తిప్రపూరితమైన భగవధ్యానపరులుగను ఉండునట్లు అనుగ్రహించును.
రాగద్వేషములు ఉంటేనే మనస్సు పరిపరి విధములుగను, సమయానుకూలముగను మారుతూ ఉంటుంది. కోరికలు లేనటువంటి మనసు నిర్మలమై, పరిశుద్ధమై ఉంటుంది. అటువంటి కోరికలు లేని మనస్సు మరియు
శుద్ధమైన మనస్సు ఆత్మలో లయమంది, స్వానందంలో ఓలలాడు తురీయస్థితి యందుంటుంది. పరబ్రహ్మ స్వరూపిణియైన జగన్మాత సదా తురీయస్థితిలోనే ఉంటుంది. కాబట్టి అమ్మవారు *శుద్ధమానసా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శుద్ధమానసాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి