20, ఆగస్టు 2021, శుక్రవారం

*సరస సంభాషణ

 *సరస సంభాషణ*


--------------------------

సత్య భామ: " అంగుళ్యాః కః కవాటమ్ ప్రహరతి ? ( వేళ్ళతో తలుపు తట్టినది ఎవరు ? ) 


కృష్ణుడు ; " కుటిలే , మాధవః " ( కొంటె దానా , నేను మాధవుడిని ) 


సత్య భామ: " కిం వసంతః ? " ( ఏమిటి వసంతుడా ? )

(మాధవుడంటే వసంతుడు అనే అర్థం కూడా ఉంది ) 


కృష్ణుడు ;" నో చక్రీ " ( కాదు , చక్రిని ) 

( చక్రం ధరించేవాడు ) 


సత్య భామ: " కిం , కులాలో ? " ( కుమ్మరివా ? )

( చక్రి అంటే కుమ్మరి అని కూడా అర్థం ) 


కృష్ణుడు ;" నహి , ధరణీధరః " ( కాను , ధరణీ ధరుణ్ణి ) 

( ధరణిని ఉద్ధరించు విష్ణువు )


సత్య భామ: " కిం , ద్విజిహ్వః ఫణీంద్రః ? " ( రెండు నాలుకల నాగరాజువా ? )

 ( ధరణీ ధరుడు ఆదిశేషుడు కూడా ) 


కృష్ణుడు ;" నాహం , ఘోరాహి మర్దీ " ( కాదు , ఘోరమైన పామును మర్దించినవాడిని )

( ఆ పాము కాళియుడు ) 


సత్య భామ: " కిముత ఖగ పతిః ? " ( గరుత్మంతుడవా ? )

 ( గరుత్మంతుడు పాముకు శత్రువు )


కృష్ణుడు ;" నో , హరిః " ( కాదు , హరిని ) 


సత్య భామ: " కిం , కపీంద్రః ? " ( కోతివా ? )

( హరి అంటే కోతి కూడా ) 


ఇత్యేవం సత్యభామా ప్రతిజిత వచనః పాతు వ చక్ర పాణిః 


ఇలా సత్యభామ చేత మాటలలో ఓడిపోయిన కృష్ణుడు మిమ్మల్ని రక్షించు గాక !


( *పాత చందమామ 'అమరవాణి' శీర్షిక నుండి )*

కామెంట్‌లు లేవు: