19, ఏప్రిల్ 2022, మంగళవారం

రామాయణానుభవం_ 32

 🌹రామాయణానుభవం_ 32


సీత రామ లక్ష్మణులు భారద్వాజాశ్రమం చేరుకొన్నారు. ఆర్ఘ్య పాద్యాలతో రామునికి స్వాగతం పలికాడు భరద్వాజ మహర్షి. వనవాసం గురించి ప్రస్తావించి ఇక్కడ ఉందా వచ్చు అని అనుమతి ఇచ్చాడు మహర్షి.అందుకు అంగీకరించ లేదు రాముడు .ఇక్కడికి దగ్గరగా జనపదాలు ఉన్నాయి మిమ్మల్ని దర్శించడానికి వస్తుంటారు కావున ఇబ్బందికరం.


అయితే నాయనా! ఇక్కడికి దశక్రోశ దూరంలో చిత్రకూట పర్వతం ఉంది. అది మీకు అనుకూలంగా సుఖప్రదంగా ఉంటుంది అక్కడా మహర్షులు

 ఎందరోముక్తిపాందారు. ఆ పర్వత శిఖరాలను చూస్తే చాలు మనస్సులు పవిత్రమైపోతాయి. పాపపుటాలోచనలే రావు,

అది మీ ఏకాంతవాసానికి తగినదని భావిస్తాను.


అంతలోకి సాయంకాలమయ్యింది. పుణ్యకథలతో చిత్రవిచిత్రమైన గాథలతో రాత్రి గడిచింది. కృతజ్ఞతలు తెలియపరచి భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని ముగ్గురూ చిత్రకూటానికి బయలుదేరారు. భరద్వాజుడు తండ్రిలా కొంతదూరం వెంట వచ్చాడు.


అనేక నదులు దాటుతూ నడుస్తూ భరధ్వజుడు చూపిన గుర్తులతో చిత్రకూట పర్వతం చేరారు ముగ్గురూ....మధ్యలో వల్మీకి మర్షి ఆశ్రమం దర్శనమ్ చేశారు.


వేగంగా నడిచి శిఖరం చేరుకున్నారు. నా మనస్సు పరవశించిపోతోంది - ఇక్కడే నివసిద్దామన్నాడు రాముడు. చేవగలిగిన గట్టి దూలాలు పట్టుకురా. నివాసం ఏర్పాటు చేసుకుందామన్నాడు పర్ణశాల తయారయ్యింది. లక్ష్మణుడు శ్రద్ధగా నిర్మించాడు.  


లేడి మాంసం పర్ణశాలకు బలిపూజ నిర్వహించాలన్నాడు రాముడు. లక్ష్మణుడు కృష్ణ మృగాన్ని సంహరించి తెచ్చాడు. రాముడు స్నానం చేసి వచ్చి శుచిగా అగ్నిలో హోమం చేసాడు. బలిపూజ నిర్వహించాడు. ముగ్గురూ పర్ణశాలలో ప్రవేశించారు. దేవతలు ఇంద్రసభలోకి  ప్రవేశించినట్టు ప్రవేశించారు. శుభసూచకంగా పక్షులు కిలకిలారావాలు చేసాయి. ప్రకృతి సౌందర్యానికి మైమరచి ఆ ముగ్గురూ అయోధ్యమాటనే మరచిపోయారు......


**

సీతారామలక్ష్మణులు గంగను దాటి దక్షిణ తీరం వెంట నడుచుకుంటూ అడవులలోకి వెళ్ళిపోయాక, సుమంత్రుడు ఇవతలి ఒడ్డున చాలా సేపు గుహునితో వారి కథలే చెప్పుకుంటూ నిలబడి నిలబడి, బరువెక్కిన మనస్సుతో మరింక అయోధ్యకు బయలుదేరాడు. గుహుడు శృంగిబేరపురంలో తన గృహానికి వెళ్ళిపోయాడు. మూడోరోజు సాయంకాలానికి సుమంత్రుడు అయోధ్య చేరుకున్నాడు.


పట్టణమంతా పాడుపడినట్టు (శూన్యామివ) నిశ్శబ్దంగా ఉంది. శోకాగ్నిలో దగ్ధమైపోయినట్టు ఉంది

రాముడు ఏడి, రాముడు ఏడీ అంటూ వందల వేలసంఖ్యలో ప్రజలు రథం వెంట పడ్డారు. గంగను దాటి వెళ్ళిపోయారని

చెప్పగానే అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు.


 కిటికీలలోనుంచి చూస్తున్న స్త్రీల ఏడుపులు సుమంత్రుడికి వినిపించాయి తలదించుకొని మౌనంగా రథం తోలుకుంటూ దశరథమందిరం చేరుకున్నాడు.


శోకాగ్నితో ప్రజ్వరిల్లుతున్నట్టున్న దశరథమందిరంలోకి అడుగుపెట్టాడు. ఎనిమిదవ కక్ష్యదాటాడు. దీనుడై కూర్చున్న దశరథుణ్ని చూసాడు. చేరువకు వెళ్ళి నమస్కరించాడు. రాముడు చెప్పమన్న మాటలు చెప్పాడు. నిర్వికారంగా దశరథుడు అంతావిని ఒక్కసారిగా మూర్ఛపోయాడు.


కాసేపటికి తేరుకొని దశరథుడు ఆత్రం గా అడిగాడు రాముడు ఏమన్నాడు,?లక్ష్మణుడు

ఏమన్నాడు?. సీత ఏమంది అని. ?సుమంత్రుడు యథాతథంగా విన్నవించాడు. సీతాదేవి మాత్రం ఏమీ మాట్లాడలేదనీ, బొమ్మలా నిలబడి కన్నీరు పెట్టుకుందనీ వివరించాడు. తిరిగి రావడానికి రథాశ్వాలుకూడా మొరాయించాయన్నాడు. కన్నీరు కార్చాయన్నాడు.


సుమిత్ర కూడా తీవ్ర దుఃఖం తో దశరథున్ని నిందాలాపనలు చేస్తోంది. 

మహారాజా! తండ్రివై యుండి కొడుకును చంపుకున్నావు. పధ్నాలుగేళ్ళ తరవాత తిరిగివచ్చినా నా రాముడు ఈ రాజ్యం ఏలుకుంటాడనుకున్నావా? ఏలుకోడు. పరుల తిండికి పులి ఆశపడదు. నా పుత్రుడు నరశార్దూలం. హవిస్సు, ఆజ్యం, పురోడాశం

దర్భలూ, యూపస్తంభాలు ఇవి ఎలాగయితే ఒక యజ్ఞానికి వాడినవి మరొక యజ్ఞానికి పనికిరావో అలాగే రాజ్యమూను. భరతుడు స్వీకరించాక మరి నా కుమారుడు ముట్టడు.


*గతిరేకా పతిర్నార్యాః ద్వితీయా గతిరాత్మజః* 

*తృతీయా జ్ఞాతయో రాజన్! చతుర్థీ నేహ విద్యతే*


వివాహితలకు భర్త మొదటి ఆధారం,పుత్రుడు రెండవ ఆధారం,జ్ఞాతులు మూడవ ఆధారం నాల్గవ ఆధారం లేనే లేదు.


ఈ దారుణమైన మాటలు గుండెల్లో పాడుచుకున్నాయి. దశరథుడు కుమిలిపోయాడు. తనలో తాను తర్కించుకున్నాడు.


కౌసల్యా! దయచేసి నన్ను క్షమించు. ఇదిగో నమస్కరిస్తున్నాను. నీది చాలా మృదుస్వభావం. ఇతరులను కూడా ఎప్పుడూ వాత్సల్యంతో చూస్తావు. దశరథుడు దీనుడై ఇలా ప్రార్థించే సరికి కౌసల్య కన్నులు వర్షించాయి.భర్త కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించింది.


*శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్|*

 *శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః*


పుత్రశోకం తట్టుకోలేక ఏదో మాట్లాడాను. శోకం అటువంటిది. అది ధైర్యాన్నీ జ్ఞానాన్నీ సమస్తాన్ని నాశనం చేస్తుంది. శోకమంతటి శత్రువు మరొకటి లేదు.

కామెంట్‌లు లేవు: