19, ఏప్రిల్ 2022, మంగళవారం

వార్ధక్యం

 శ్లోకం:☝️

*అపర్యాప్తం హి బాలత్వం*

    *బలాత్పిబతి యవ్వనం |*

*యవ్వనం చ జరా పశ్చాత్*

    *పశ్య కర్కశతాం మిథః ||*

    - యోగ వాసిష్ఠం


భావం: జీవి బాల్యదశలో ఆటల మీద ఆసక్తితో వుండి, వాటి మీద ఆసక్తి ఇంకా తీరకుండా ఉన్న సమయంలోనే, యౌవనం వచ్చి మీదపడి బాల్యాన్ని మింగేస్తోంది. ఈ యౌవనంలో కామోపభోగాల ఆశ ఇంకా తీరకుండానే, వార్ధక్యం మీదపడి యౌవనాన్ని మింగేస్తోంది. చూశావా (వసిష్ఠ) మహర్షీ! ఈ బాల్య, యౌవన, వార్ధక్య దశలే ఒకదాని మీద ఒకటి ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయో ? ఆ తరువాత " *వార్ధకే వర్ధతే స్పృహా* " అని వార్ధక్యంలో అనుభవించే శక్తి ఉండదు కానీ కోరికలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఈ వార్ధక్యం మోహాలకీ, శోకాలకీ, వియోగాలకీ, వివాదాలకీ, చింతలకూ, అవమానాలకూ ప్రముఖస్థానంగా ఉంటుందని శ్రీరాముడు నిర్ణయించాడు.🙏

కామెంట్‌లు లేవు: