*దేవుడి ఇంటికి సరైన దారి* - మల్లాది వెంకట కృష్ణ మూర్తి
〰〰〰〰〰〰〰〰
🔼 *'రామాపురం'* అనే ఊళ్ళో రైలు దిగండి.
⏺ *'నమ్మకం'* అనే రిక్షాని మాట్లాడుకోండి.
🔼 *భక్తి* అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.
⏺ *పాపం* అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది.
🔼 *పుణ్యం* అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.
⏺ *ప్రార్ధన* అనే వంతెనని దాటండి.
🔼 *కర్మ* అనే సర్కిల్ వస్తుంది.
⏺ *దుష్కర్మ* అనే రెడ్‌లైట్ అక్కడ వెలుగుతూండవచ్చు.
🔼 *సుకర్మ* అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి.
⏺ *భజనమండలి* అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి.
🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.
⏺మొదటి మూడిటి పేర్లు - *అసూయ స్ట్రీట్, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.*
🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు *సత్సంగం* వీధి.
⏺పక్కనే కనబడే *వదంతుల* వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు.
🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్ వస్తుంది.
అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు *వ్యామోహం.*
⏺కుడివైపు రోడ్డు పేరు *వైరాగ్యం.* వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి.
🔼ఎదురుగా మీకు *కైవల్యం* అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.
⏺ *దయగల హృదయం - భగవన్నిలయం* అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది.
☯గేటు దగ్గరున్న *ముక్తి* అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది.
ఇది *దేవుడి ఇంటికి సరైన దారి.*
మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!
🙏🙏🙏🙏☯🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి