ఒకసారి కాళిదాసుకూ భోజరాజుకూ అభిప్రాయ బేధాలోచ్చాయి.కాళిదాసు అలిగి వెళ్ళిపోయాడు. పక్కనే వున్న బోయీల పల్లెలో మారువేషం తో వుండసాగాడు.
రాజుగారికి కాళిదాసు లేనిదే పిచ్చి పట్టినట్లు వుంది.కొంతమంది అసూయాపరులైన కవులు కుట్ర చేసి తనకూ కాళిదాసుకూ విభేదాలు సృషించారని తెలుసుకొని,కాళిదాసును అవమానించినందుకు పశ్చాత్త్తాప పడ్డాడు. ఆయనను తిరిగి రప్పించాలని చారులను పంపించాడు.
వాళ్ళు ఆయన బోయీలతో పాటు వుండి పల్లకీలు మోస్తున్నట్టు చెప్పారు. రాజు ఆయనను కని పెట్టాలని పల్లకీ లో తాను విహారం వెళ్లాలని బోయీలను పిలిపించాడు. పల్లకీ లో వెడుతున్నప్పుడు భోజరాజు "అయ మాందోలికా దండ స్తవ బాధతి కిం భుజే"కావాలనే తప్పుగా చదివాడు 'బాధతే' బదులుగా 'బాధతి' అని చదివాడు. జవాబు రాలేదు. రోజూ బోయీలను మారుస్తూ రాజ్యములో తిరుగుతుండే వాడు.రోజూఅదే శ్లోకం చదివే వాడు. సమాధానం రాలేదు.
ఐదవరోజు ఆయన ఆశ్లోకం చదవగానే పల్లకీ మోస్తున్న కాళిదాసు వుండబట్టలేక " "నాయమాం దోలికా దండ స్తవ 'బాధ తి' బాధతి"
ఈ పల్లకీ దండము నన్ను బాధించుట లేదు కానీ మీ 'బాధతి' అనే శబ్దము నన్ను బాధిస్తూ వుంది. ఆ సమాధానము విని నంతనే రాజు పల్లకి ఆపించి దిగి కాళిదాసును కౌగలించుకొని క్షమించ మని వేడి ఆపల్లకీలోనే తనప్రక్కన కూర్చోబెట్టుకొని మరీ రాజ్యానికి తీసుకొని వచ్చాడు.
సంస్కృతం లో ఒక్క పదం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. కవులు అప శబ్దమును సహించలేరు. అందుకనే కాళిదాసు బయట పడ్డాడు. రాజుకు కావలిసిందీ అదే.
అందుకే పెద్దవాళ్ళు 'లలితా సహస్ర నామము"విష్ణు సహస్ర నామము" మొదలైన స్తోత్రాలను నేర్చుకునే టప్పుడు మంచి గురు ముఖంగా నేర్చుకోవాలని చెప్తారు. నామము చెప్పేటప్పుడు ఏవిధమైన అప శబ్దము రాకూడదు.అని. అలా చదవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ అని చెప్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి