🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*రుద్రాక్ష ధారణ వాటి ఫలితాలు*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(నిన్నటి రోజున ఏకముఖి రుద్రాక్ష గురించి తెలుసుకున్నాం. నేడు మరి కొన్ని రుద్రాక్షలు గురించి తెలుసుకుందాం.)*
*2. ద్విముఖి రుద్రాక్ష:~*
*ద్విముఖి రుద్రాక్షకు రెండు ముఖాలు ఉంటాయి. ద్విముఖి రుద్రాక్ష ‘అర్ధనారీశ్వర’ తత్వానికి సంకేతం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్విముఖి రుద్రాక్ష చంద్రగ్రహ ప్రతీక.*
*కామాన్నిజయించటానికి, శాంతికి, తత్వ విజ్ఞానానికి, సర్వపాప హరణానికి, కుండలిని శక్తి పెంపొందించుటకు ఉపయోగపడుతుంది. ద్విముఖి రుధ్రాక్ష బధ్రాక్ష రూపం లోను, రుధ్రాక్ష రూపంలోను దొరుకుతుంది. ద్విముఖి రుధ్రాక్ష ధరిస్తే గోహత్యాపాతకాలు నశిస్తాయి. వ్యాపారాలలో మెలుకువలు, క్రయవిక్రయాలలో అనుభవాన్ని ఇస్తుంది. మతిమరుపు ఉన్న వారు తప్పకుండా ద్విముఖి రుధ్రాక్షని ధరించాలి. కళలు, సాహిత్యం, కవిత్వం, సంగీతం, ఆటపాటలయందు ఆసక్తిని కలిగిస్తుంది. నిర్మలమైన మనస్సును, మంచి ఆలోచనా విధానాన్ని కలిగిస్తుంది. వశీకరణ శక్తిని కలిగిస్తుంది.*
*వాటర్ బిజినెస్ వాళ్ళు, గృహనిర్మాణ పనులు చేసేవారు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవారు, డ్యాం నిర్మాణ పనులు చేసేవారు, హోటల్ మేనేజ్ మెంట్ చేసేవారు, వ్యవసాయం చేసేవారు ద్విముఖి రుధ్రాక్షని తప్పక ధరించాలి.*
*జాతకంలో చంద్రుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న వృశ్చికంలో నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న మహాదశ అంతర్దశలలో ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది.*
*రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాల వారు, విదియ తిధిలో జన్మించినవారు, కర్కాటకరాశిలో జన్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. ద్విముఖి రుద్రాక్షను సోమవారంరోజు శివాలయంలో అభిషేకం చేయించి ద్విముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో మెడలో ధరించాలి.*
*ద్విముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-ఓం నమః।*
*3. త్రిముఖి రుద్రాక్ష:~*
*త్రిముఖి రుద్రాక్షకు మూడు ధారలు (ముఖాలు) ఉంటాయి. త్రిముఖి రుద్రాక్ష ‘అగ్నిదేవుని’ ప్రతిరూపం.*
*ఆరోగ్యానికి, అభ్యుదయానికి ఈ రుద్రాక్ష బాగా ఉపయోగ పడుతుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ చేసేవారు, వృత్తి, వ్యాపారం చేసేవారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది.*
*అగ్నిదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష వివాదాలను దూరం చేయడమే కాకుండా, దీర్ఘాయువుని ఇస్తుంది.*
*మూడు ముఖాలు కల్గిన రుద్రాక్షకి కుజుడు అధిపతి. ముఖ్యముగా స్త్రీలు మంగళసూత్రమునందు ఎడమ వైపుకు ధరించిన పవిత్రత, మాంగళ్య రక్షణ కల్గును. అగ్ని పురాణమున స్త్రీలు రుద్రాక్షలు ధరించుట గూర్చి ఈ రుద్రాక్ష ధారణ మిక్కిలి శ్రేష్టము అని, సౌభాగ్యం కలిగించునని పేర్కొనటం జరిగింది. అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని “అగ్ని రుద్రాక్ష” అనికూడ అంటారు.*
*కుజగ్రహదోషాలు ఉన్నవారు, వైవాహికజీవితంలో సమస్యలు ఉన్నవారు త్రిముఖి రుద్రాక్ష ధారణ సర్వశ్రేష్ఠం.*
*జాతకంలో కుజుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, నీచక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న కుజదశ, అంతర్దశ యందు, తదియ తిధి రోజున జన్మించిన వారు, కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్ర, ధనిష్ఠ లందు, మేష, వృశ్చిక రాశిలందు జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం.*
*త్రిముఖి రుద్రాక్షను మంగళవారం రోజు గాని, సోమవారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించి కుజ హోరాలో త్రిముఖి ధారణ మంత్రం పఠిస్తూ మెడలో ధరించిన వారికి చెవులు, చేతులు, భుజాలు మొదలగు అవయవాలకు సంబందించిన దోషాలను తొలగించి రక్తహీనత కలగకుండా ఎర్ర రక్తకణాల సమతుల్యతను కలిగిస్తాయి. ప్లేగు, ఆటలమ్మ, మశూచి వంటి భయంకరమైన వ్యాదుల నుండి రక్షణ పొందవచ్చును.*
*త్రిముఖి రుద్రాక్ష ధారణ మంత్రం :-“ఓం క్లీం నమః”।*
*ఓం నమః శివాయ।*
*(రేపు మరికొన్ని రుద్రాక్షలు గురించి తెలుసుకుందాం)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి