*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*
*సుభాషితం - నాస్తి విద్యాసమో బంధుః*
*శ్లోకం:*
*నాస్తి విద్యాసమో బంధుః నాస్తి విద్యాసమో సహృత్ ।*
*నాస్తి విద్యా సమం విత్తం నాస్తి విద్యాసమం సుఖం ॥*
*పద విభాగం:*
న, అస్తి, విద్యా, సమః, బంధుః, న, అస్తి, విద్యా, సమః, సహృత్,
న, అస్తి, విద్యా, సమం, విత్తం, న, అస్తి, విద్యా, సమం, సుఖం.
*ప్రతిపదార్థం:*
విద్యా సమః = విద్యతో సమానమైన, బంధుః = బంధువు లేదా చుట్టము, నాస్తి = లేడు, విద్యా సమః = విద్యతో సమానమైన, సహృత్ = స్నేహితుడు, న అస్తి = లేడు, విద్యా సమం = విద్యతో సమానమైన, విత్తం = ధనము, నాస్తి = లేదు, విద్యా సమం = విద్యతో సమానమైన, సుఖం = సుఖము, నాస్తి = లేదు.
*Meaning:*
There is no relative equal to knowledge and education. There is no friend equal to knowledge and education. There is no wealth equal to knowledge and education. There is no happiness equal to knowledge and education.
*తాత్పర్యం:*
విద్యతో సరితూగ గల బంధువు లేదు. విద్యతో సమానమైన స్నేహితుడు లేదు. విద్యతో సమానమైన ధనమూ లేదు. విద్యతో సరితూగ గల సుఖము లేదు.
విద్య యొక్క ప్రాసస్థ్యాన్ని, విద్య యొక్క ఆవశ్యకతని ఎంతోమంది మహానుభావులు, ఎన్నో గ్రంథాలలో మనకి నొక్కి వక్కాణిస్తునే ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి తెలియ జేస్తూనే ఉన్నరు. ప్రభుత్వాలు విద్య యొక్క ఆవస్యకతని దృష్టిలో ఉంచుకుని అనేకమైన అవకాసాలని కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానము బాగా పెరిగిన నేపథ్యములో, యువతకి ఉద్యోగావకాసాలు కూడా బాగా ఉన్న నేపథ్యములో ఈ విద్య యొక్క ఆవశ్యకతని అందరూ గుర్తిస్తున్నారు.
విద్య యొక్క ఆవశ్యకతని ఈ సుభాషితము ద్వారా మరొక మారు మననం చేసుకుందాము.
విద్యతో సమానమైన బంధువు లేదా చుట్టము లేడు. అవసరములో ఆదుకునే బంధువు విద్య మాత్రమే. విద్యతో సమానమైన స్నేహితుడు కూడా లేడు. అవసరార్థం తన యొక్క చదువే తన నేస్తమౌతాడు. విద్యతో సమానమైన ధనము లేదు. ఈ *విద్యాధనము ఒక్కటే ఖర్చు పెట్టిన కొలదీ పెరుగుచుండేది మరియు తరగనిది* . విద్యా ధనము ఉంటే ప్రపంచములో ఏ విధముగానైనా ద్రవ్యము సంపాదించవచ్చు. విద్యతో సమానమైన సుఖము లేదు. సరియైన విద్య ద్వారా, తగిన జ్ఞానము, విజ్ఞానము అలవడతాయి. ఈ విజ్ఞానము ఇచ్చే సుఖము బాహ్య ప్రపంచపు సుఖాలకంటే అతీతము, ఉన్నతము అయినవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి