30, జూన్ 2020, మంగళవారం

దేవాలయ నిర్మాణాల్లోని సాంకేతికనైపుణ్యత



ఈరోజు దేవాలయ నిర్మాణాల్లోని సాంకేతికనైపుణ్యత గురుంచి తెలుసుకుందాం......

ప్రతి రోజు దేవాలయ దర్శనం గురించి తెలుసుకుంటున్నాము

కొన్ని ప్రాచీనకాలంలో కట్టిన ఆలయాలలోని ఆధునికులకి కూడా సాధ్యం కాని వైజ్ఞానిక విశేషాల్ని గురించి తెలుసుకుందాం .

*ఇది ప్రత్యేకంగా హైందవధర్మం యొక్క విశిష్టత మరియు గౌరవం ఉండి దాని గురించి* 
*తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాళ్ళ కోసం ....*

*ఫిబోనసి గ్రాఫ్:-ద్వాదశ జ్యోతిర్లింగాల వెనక ఫిబోనసి_సీక్వెన్సు ఉంది .*

శివుని ప్రతిరూపాలుగా భావించే మొత్తం 64 జ్యోతిర్లింగాలలో ఒక 1⃣2⃣పన్నెండు అతి విశిష్ఠమైనవి .. ...

భూమిపై నివసించే సమస్త జంతుకోటికీ ఆకాశంలో కనిపించే నక్షత్రాలు,గ్రహాల నుంచి నిరంతరం వెలువడుతున్న విద్యుత్ తరంగాల నుండి ఉద్భవించే జ్యోతిరూపమైన శక్తి ఈ 12 లింగాల ద్వారా సమతౌల్యతను పొంది భూమిని ఆవాసయోగ్యంగా నిలబెట్టాయి .
అందువల్లనే సాధారణమైన ఆలయాలలో వలె వీటికి లింగప్రతిష్ఠలు గానీ ప్రాణప్రతిష్ఠలు గానీ లేకపోయినా సృష్టి ఉన్నంతకాలం జ్యోతిశ్శక్తి వెలువడుతూనే ఉంటుంది .
ఈ 12 జ్యోతిర్లింగాల స్థాపనలో దాగున్న సైన్సును పరిశీలించి చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది . మ్యాధ్స్ సబ్జెక్టులో ఏ కొంచెం పరిచయం ఉన్నవారికైనా ఫిబోనసి సీరిస్ గురించి తెలిసుంటుంది . ఈ సీక్వెన్సులోని ప్రతి సంఖ్యా దానికి ముందరి రెండు అంకెలను కలపితే వస్తుంది - 

0,1,1,2,3,5,8,13,21,34...ఇలా వీటిని ఆధారం చేసుకొని గ్రాఫ్ గీసుకుంటూ పోతే ఫిబోనసి గ్రాఫ్ ఏర్పడుతుంది . ఇది ఓ బిందువు నుండి సర్పిలాకారంగా తిరుగుతూ క్రమంగా కేంద్రం వద్ద పరిసమాప్తం అవుతుంది .

మన ఇండియా మ్యాపును తీసుకొని మన దేశంలోని జ్యోతిర్లింగాలను దానిపై గుర్తించి ఉత్తరాఖండ్ లోని కేదారి నాథ్ నుండి మొదలుపెట్టి ప్రతి జ్యోతిర్లింగాన్ని టచ్ చేసుకుంటూ వృత్తాకారపు రేఖలతో ఒక్కొక్కటిగా కలుపుకుంటూ పోతే - అది వైద్యనాథ్, రామేశ్వరం, సోమనాధ్ ..శ్రీశైలం మీదుగా సాగి సాగి మహారాష్ట్రలోని ఘృష్టీశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఆగుతుంది . ఇప్పుడు మనం పూర్తి చేసిన స్పైరల్ షేపును చూస్తే - ఇదే ఫిబోనసి సీరిస్ గ్రాఫ్!

ఈ క్లూ కనుక్కున్నది మెల్విల్లె అనే అమెరికన్ కాస్మాలజిస్టు .

కనుక్కున్న పెద్దమనిషికి ఆ రహస్యం తెలుసుకోవటానికి రోజులు,వారాలు బహుశా కొన్ని నెలలు పట్టి ఉండొచ్చు .కానీ వాటిని ఒక మనిషి ఇండియా మ్యాపు మొత్తాన్ని ఎదురుగా పెట్టుకుని చుక్కలు పెట్టేసి ఇక్కడిక్కడ ఈఈ గుడులు కడితే ఇట్లా ఫిబోనసి సీక్వెన్స్ వచ్చేస్తుంది అని ఒకేసారి కట్టెయ్యలేదు .ఒకో గుడి ఒకో కాలంలో కడుతూ మొత్తం పన్నెండూ కట్టేశాకనే సీక్వెన్సు గ్రాఫ్ పూర్తి అయ్యింది .అదీగాక ఇవన్నీ స్వయంభూ లింగాలు,అంటే ముందుగా ఇక్కడొక ఆలయం కట్టాలని నిర్ణయించుకుని శిల్పులతో చెక్కించి ప్రతిష్ఠ చేసినవి కావు!

అవి అంతకు ముందే వ్యక్తమయి ఉంటే స్థలాన్ని వెతికి కనుక్కోవాలి, లేదా అవి స్వయంవ్యక్తం అయ్యేవరకు ఎదురు చూడాలి, వ్యక్తం అయ్యాక వాటినుంచి ఏవైనా సిగ్నల్స్ వస్తే వాటిని పట్టుకుని అక్కడ ఆలయనిర్మాణం చెయ్యాలి - 

తల్చుకుంటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి!అప్పుడు మహామేధావులైన మనవాళ్ళు ఏమి చేసారో మన మెదడుతో వూహించలేము గానీ వీటిల్లో ఏ పద్ధతి ఫాలో అయినా మొత్తం దేశమంతటా ఉన్న ఆలయ నిర్మాణాలు చేసేవాళ్ళ మధ్యన ఒక నిరంతర సమాచార ప్రవాహం ఉండి తీరాలి!ఎక్కడ ఏ ఆలయం కట్టాలన్నా మొత్తం దేశంలో ఉన్న అన్ని ఆలయాల గురించిన మొత్తం సమచారం కూలంకషంగా తెలియాలి,తెలుసుకునేవాళ్ళు, జ్ఞానాన్ని పంచుకునేవాళ్ళు!

వాస్తవం ఇట్లా ఉంటే ఒక అలయంలో ఉన్న వింత మరొకదానిలో ఉండకపోవటానికి మన వెర్రి చరిత్రకారులు చేసిన విశ్లేషణ ఏమిటో తెలుసా ? ఒక రాజ్యంలో ఎవరయినా శిల్పి ఒక అపురూపమైన ఆలయం నిర్మిస్తే మరొక చోట అలాంటిది కట్టకుండా అతన్ని చంపేసేవాళ్ళట!

ఒక ఆలయం నిర్మించడం అంటే చీకట్లో ఒక్కడే కూర్చుని చేసే రహస్య మా ?
ప్లాను గీసుకోవాలి,మేస్త్రీలకి పనులు అప్పగించాలి,కట్టేటప్పుడు తేడాలు వస్తే ప్లాను మార్చి కరెక్ట్ చేసుకోవాలి,అసలు తనకి సాధ్యం కాని సమస్య వస్తే వేరేచోట ఉన్న సీనియర్లని అడగాలి - ఇదంతా కట్టాక చంపేస్తారనే భయం ఉన్నవాడు చెయ్యగలిగిన పనులా!

*ఛాయా_సోమేశ్వరాలయం మిస్టరీ వీడటానికి ఇన్నేళ్ళు పట్టింది!*

సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోళులు (నల్లగొండ/నీలగిరి చోళులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్బుతం .
ఈ ఆలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి . ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న చిన్న మండపాలు .... వీటి చుట్టూ మూడు గర్భగుడులు ఉన్న దేవాలయం ఉంటుంది . దీనినే 'త్రికూటాలయం' అంటారు .ఈ ఆలయానికి పడమర ఉన్నటువంటి 

గర్భగుడిలో శిలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చల ఛాయ, సూర్యుని స్థానముతో సంబంధం లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఏర్పడడం ఈ ఆలయం సంతరించుకున్నటువంటి అద్భుతం . ఆ నీడ ఏ వస్తువుది అన్న విషయము కూడా ఇంతవరకూ అంతు చిక్కలేదు .

దేవాలయం గర్భగుడి గోడపై గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది . అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్ధానంలో ఉంటుంది . సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు . 
ఆ నీడ ఎలా పడుతుంది ?  ఎందుకు అది వెలుతురులో ఉన్నంతవరకూ తన స్ధానాన్ని మార్చుకోదు ? అనేది ఇప్పటివరకూ ఎవరికీ అంతుచిక్కని విషయం . 
అలనాటి నిర్మాణకౌశలం, శిల్ప నైపుణ్యం మరియు శాస్త్ర సిద్ధాంతాల మేళవింపుకు ప్రతీకగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు .

ఆలయ మధ్యభాగంలో చతురస్రాకారంలో ఉండి దానికి మూడువైపులా అంటే, తూర్పు, పడమర, ఉత్తరాన మూడు గర్భగుడులు కలిగి ఉంది . అయితే మూడు గర్భగుడులు కూడా ఒకేరీతిగా ఉన్నప్పటికీ కేవలం పడమటి గర్భగుడిలో మాత్రమే ఏక నిశ్చల ఛాయను తిలకించగలము . ఆలయ శిల్పి నీడలను ఏర్పరచడానికి సూర్యకాంతిని నేరుగా ఉపయోగించకుండా పరిక్షేపణము చెందిన సూర్యకాంతిని ఉపయోగించడం జరిగింది .

అలాంటి పరిస్థితిలో సూర్యుని స్థానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది . ఆలయ శిల్పి ఉద్దేశ్యము ప్రకారం ఛాయ నిశ్చలంగా ఉండాలంటే తూర్పు లేదా పడమర ఛాయలను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది . 

ఎందుకంటే వాటిని కలిపే తలము, తూర్పు నుండి పడమరకు సూర్యుడు ప్రయాణించే దిశకు సమాంతరంగా ఉంటుంది . సూక్ష్మంగా వివరించాలంటే, పడమటి గర్భగుడి ముందు ఉన్నటువంటి కీలకమైన నాలుగు స్తంభాల నీడలు కలిసి ఏకఛాయలాగ ఏర్పడతాయి . ఈ ఛాయను మనము వెన్నెలకాంతిలో కూడా వీక్షించవచ్చు . ఏకనిశ్చలఛాయ ఏర్పాటులో 
......అయిదు ప్రధానాంశాలు కీలకపాత్ర పోషిస్తాయి అవి ....

1.స్తంభాల మధ్య దూరం.

2.స్తంభాల నుండి గర్భగుడి వెనుక గోడ దూరం.

3.స్తంభాల నుండి కాంతిలోనికి ప్రవేశించే మార్గాల దూరం

4.కాంతి జనకం (సూర్యుడు) ప్రయాణించే దిశ.

5.స్తంభాలతో కాంతి జనకాల స్థానం చేసే కోణం.

ఆలయానికి రాళ్ళతో కూడిన పునాదిని ఎంచుకోవడం ద్వారా శిల్పి భవిష్యత్తులో భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చినా కూడా నీడ చెదరకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు . 
వాస్తవానికి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో వివిధ కార్యాలకు అంటే వివాహాలకు, కచేరి, పండుగలు, మతకృత్యాలు మొదలైన వాటికి ఆలయాలే కేంద్రంగా ఉండేవి . కాబట్టి రాజులు వాటికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి నిర్మించేవారు . ఆలయాలకు భక్తులను రప్పించడానికి శిల్పులు ఏదో ఒక ప్రత్యేకతతో ఆలయాలను నిర్మించారు . ఈ క్రమంలోనే ఈ ఆలయానికి నిశ్చలఛాయను అనుసంధానించారు .

*సూర్యాపేట వాసి శేషగాని_మనోహర్_గౌడ్ కాంతిశాస్త్ర పరిజ్ఞానంతో సాధించవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించారు....*

గుడి మొత్తాన్నీ అబ్జర్వ్ చేసి ధర్మోకోల్ మోడల్ కట్టి కొవ్వొత్తుల్ని  స్తంభాలుగా వాడి చీకటిగదిలో టార్చిలైటుని సూర్యుడిగా వాడి ఎట్టకేలకు అదే ఎఫెక్టుని సాధించి మిస్టరీని చేదించగలిగాడు .
ఇందులోని అసలైన ట్రిక్కు కాంతి_పరిక్షేపణం(Light Diffusion) 
అనే దృగ్విషయాన్ని ఉపయోగించుకోవటం .కాంతి విశ్వాంతరాళంలో ప్రయాణించేటప్పుడే కాదు భూమి వాతవరణంలో ప్రయాణించేటప్పుడు కూడా కొంచెం వంగుతుంది .ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు యొక్క ఉపరితలం మీద కూడా ఆ వస్తువుకి ఉండే గురుత్వాకర్షణ వల్ల ఆ వస్తువు వైపుకి కొద్దిగా వంగుతుంది .

అరసవిల్లి, తిరువనంతపురం లో మధ్యన ఉయ్యాల వూగుతున్న సూర్యదేవుడు .

1⃣అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికీ 

2⃣బెంగుళూరు గావి గంగాధరస్వామి ఆలయానికీ 

3⃣తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయానికీ 

ఒక విచిత్రమైన సంబంధం ఉంది .
*సూర్యగమన సిద్ధాంతం* 

ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలకు తెలుసు .ఆ సూర్యగమన సిద్ధాంతం ఆధారంగా ఆలయవాస్తుని నిర్ణయించి చేసిన నిర్మాణాలు కావడం వల్లనే ఈ మూడు ఆలయాల మధ్య ఒక సారూప్యత ఏర్పడింది ....
సూర్యుడు రాశి మారే ప్రతి సమయంలోనూ ఒక సంక్రాంతి వస్తుంది . ప్రతి నెలా ఒక మాససంక్రాంతి వస్తుంది,అయితే కొన్ని ప్రత్యేకమైన సమయాలలో సూర్యకిరణాలు ఆలయంలోని అర్చామూర్తులపై ప్రసరించే విధంగా నిర్మించడం అప్పటి మనవారి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం .
అందువల్లనే ఈ మూడు ఆలయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి .
అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో సంవత్సరానికి 2రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత ....
దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి . ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు . 

మార్చి 9 నుండి 12 వరకు మేష సంక్రాంతి),
అక్టోబరు 1 నుండి 3 వరకు తుల సంక్రాంతి) 

ఉదయ సంధ్యలోని తొలి సూర్యకిరణాలు ఈ స్వామివారి పాదాలను తాకుతాయి . 

బెంగుళూరు గావి గంగాధరేశ్వరస్వామి ఆలయంలో కేవలం మకరసంక్రాంతి నాడు మాత్రమే స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి .

తులసంక్రాంతి నాడు తిరువనంతపురంలో #పద్మనాభ స్వామి ఆలయగోపురంలోని అన్ని ద్వారాల గుండా సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఆలయాన్ని నిర్మించారు .

ఈ మేష, తుల సంక్రాంతులలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి .ఇలాంటి ప్రత్యెకమైన రోజులలో ఆ రోజుకు సంబంధించిన విశేషాన్ని తెలిపే విధంగా ఈ ఆలయాలని నిర్మించటానికి శిల్పులకూ స్థపతులకూ కాలమానం, కాంతిశాస్త్రం, వాస్తుజ్ఞానం అన్నీ తెలిసి ఉండాలి - 

అన్నింటికన్నా ప్రజలకి శాస్త్రీయతని పరిచయం చెయ్యాలనే ఉత్సాహం ఉండాలి! 

చిదంబరం గొప్పదనాన్ని కీర్తిస్తున్నది హిందూమతతత్వవాదులు మాత్రమే కాదు!
చిదంబరం, కాంచీపురం, శ్రీకాళహస్తి - ఈ 3మూడు పంచభూతలింగ క్షేత్రాలు ........
సమస్త ప్రకృతికి ఆధారభూతాలైన
........... భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ......
అనే ఈ పంచభూతాలలో భాగమై కనిపించని పరమేశ్వర తత్వాన్ని గ్రహింపజేయడానికా అన్నట్టు ఈ మూడు క్షేత్రాలూ ఉన్న స్థలాలలోని విశేషాన్ని గమనిస్తే మన పూర్వీకులు ఏ ఆలయాన్నీ ఏ విధమైన ప్లానూ లేకుందా ఎక్కడో ఒకచోట కట్టేద్దాం అనుకుని హడావిడిగా కట్టెయ్యలేదని తెలుస్తుంది . అలాగే దేశంలోని అనేకమైన ఆలయాలు దేశంలోని ఇతర ఆలయాలతో సంబంధం కలిగి ఉండటాన్ని గమనిస్తే ఆనాటికే వారిలో ఆధ్యాత్మికంగా ప్రజలని ఏకం చెయ్యాలనే తపన ఎంతగా ఉందో తెలుసుకోవచ్చును . 

*1.పృధ్వీలింగమైన కంచి ఏకాంబరేశ్వర లింగం,*

*2.ఆకాశలింగమైన చిదంబరం నటరాజ మూర్తి,* 

*3.వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వర లింగం* 

ఉన్న ప్రదేశాల్ని గూగుల్ మ్యాపులో చూస్తే ఒకే సరళరేఖలా 79_డిగ్రీల_41_నిమిషాల_లాంగిట్యూడ్ మీద ఉన్నాయి!

*మానవశరీరంలోని నవరంధ్రాలకు ప్రతీకగా చిదంబరం ఆలయానికి నవద్వారాలు ఉంటాయి .* 
ఆరోగ్యవంతుడైన మానవుడు ఒకరోజు చేసే ఉఛ్చ్వాసనిశ్వాసాల మొత్తం 21,600(15X60X24=21,600), ఈ ఆలయం పైకప్పు సరిగ్గా 21,600 బంగారు పలకలతో తాపడం చేసి ఉంటుంది . ఈ 21,600 పలకలను 72,000 బంగారు మేకులు పట్టి ఉంచుతున్నాయి . 
అది మానవుని దేహంలోని నాడుల సంఖ్యకు సమానం .మన శరీరంలో ప్రసరిస్తూ కంటికి కనబడకుండా అంతర్లీనమై ఉన్న జీవశక్తియే అసలైన *చిదంబర_రహస్యం!* ప్రాచీన కాలం నుంచి ఇలాంటి సత్యాలు ఎన్నెన్నో ఒకటొకటిగా తెలుస్తూ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి .

పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిది సంవత్సరాలు పరిశోధించి చిదంబరం నటరాజస్వామి విగ్రహం ఉన్న స్థలం భౌమఅయస్కాంతక్షేత్రం యొక్క కేంద్రస్థానంలో ఉందని తేల్చిచెప్పారు .ఇదే విషయాన్ని తమిళ శాస్త్రవేత్త తిరుమూలార్ అయిదువేల యేళ్ళ క్రితమే నిరూపించినట్లు తెలుస్తున్నది . 

చిదంబరంలోని తిరుమందిరం తనలో ఇముడ్చుకున్న శాస్త్ర సాంకేతికమైన విషయాల్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం సామాన్యులకే కాదు శాస్త్రవేత్తలకి కూడా చాలా కష్టం - దాదాపు అసాధ్యం!

మార్కోపోలో కన్నా ముందే మనవాళ్ళకి ఆఫ్రికానర్స్ గురించి తెలుసు
నిశితంగా పరిశీలిస్తే మహాబలిపురం అంతరిక్ష పరిశోధనలకు చాలా అనువుగా ఉంటుంది .ఇస్రో కూడా ఇలాంటి వాతావరణంలోనే ఉంది .........
ఇక్కడి దేవాలయాలు కూడా శిల్పకళ వల్లనే ప్రత్యేకమైనాయి తప్ప పుణ్యక్షేత్రాలుగా వీటికి ప్రాధాన్యత అంతగా లేదు .అప్పటి పల్లవరాజు అంతరిక్ష పరిశోధనలు జరిపించాడనేటందుకు గణేశరధంలో చాలా ఆధారాలు కంబడుతున్నాయి .
పూర్వం ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితమే గణేశమూర్తిని ప్రతిష్ఠించి పూజాదికాలు ప్రారంభించారు .ఇక్కడి గోపుర శిల్పాలలో దేవతామూర్తులు లేకపోగా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే 
ఒక రాకెట్ లాంచింగ్ వెహికిల్,
రాకెట్ లాంటి రూపాలు కనిపిస్తాయి .
అవన్నీ ఇప్పుడు మనం ఇస్రోలో చూస్తున్న రాకెట్ లాంచింగ్ సిస్టం మాదిరిగానే ఉన్నాయి . 
గణేశరధం సమీపంలో ఉన్న ఒక ఖచ్చితమైన వృత్తాకారపు తొట్టి కూడా రాకెట్ లాంచింగ్ కోసం ఉపయోగపడే విధంగానే ఉంది .
ఆలయం పైభాగంలో త్రిశూలంలా కనిపించే ఆకారం నిజానికి తలమీద రెండు కొమ్ములతో అలంకరించబడిన హెల్మెట్ ధరించిన ఒక మానవ శిరస్సు - .........ఇలాంటి హెల్మెట్ ధరించిన రూపాలు ఏ హిందూ దేవాలయపు శిఖరకలశంలోనూ మనం చూడము .......
ఈజిప్ట్ పిరమిడ్లలో కనిపించే స్ఫింక్స్ రూపాలను పోలిన సగం మానవ ఆకారం సగం సింహం ఆకారం కలిసిన సింహికలు కూడా ఇక్కడి శిల్పాలలో కనబడుతున్నాయి . 

గోపురం మీది శిల్పాలలో ఒక చోట యూరప్ జాతీయుడి ముఖం మరొకచోట ఆఫ్రికా జాతీయుడి ముఖం స్పష్టంగా గోచరిస్తాయి .
మార్కోపోలో మన దేశానికి రావడానికి పూర్వమే ఈ శిల్పాలలో ఇతర దేశీయుల రూపాలు కనబడడం చూస్తే అప్పటికే మన దేశస్థులకు ఇతర భూఖండాల వారితో సంబంధాలు ఏర్పడిన విషయం నిర్ధారణ అవుతున్నది .
ఇక్కడ మరొక విశేషం #శ్రీకృష్ణునివెన్నముద్ద అని పిలిచే ఒక వింత రాయి .
సుమారు 20 అడుగుల పొడవు, వెడల్పు,ఎత్తు గల ఈ రాయి అసలే ఏటవాలుగా ఉన్న కొండమీద భూతలంతో 40 డిగ్రీల కోణంలో వాలిపోయి కిందవున్న రాతినేలను కేవలం రెండు చదరపు గజాల మేర మాత్రమే తాకుతూ నిలబడి చూపరులకు ఆశ్చర్యాన్నీ భయాన్నీ కలిగిస్తున్నది .చూడటానికి ఆనించినట్టు కనబడుతున్న ఈ 250 టన్నుల బరువైన రాయి పెనుగాలులకి కూడా కదలకుండా నిలబడి ఉండటం నిజంగా అద్భుతమే! 

క్రీ .శ 1908లో ఆర్ధర్ లాలీ అనే బ్రిటిష్ అధికారి ఇది చాలా అపాయకరంగా ఉందని తొలగించడానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులను కట్టి ఏడు ఎనుగులతో లాగించాలని చూసినా దానిని కదిలించలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ఒక కధనం ఉన్నది . 

ఇలాంటి రాళ్ళు పెరూలోని మకాపిచులోనూ, కొన్ని మెక్సికన్ నగరాలలోనూ, ముఖ్యంగా  గ్రహాంతరవాసులకి సంబంధించిన కధలు ప్రచారంలో ఉన్నచోట కనపడుతున్నాయి .

.... ఒకానొకప్పుడు సోమనాధ లింగం గాలిలో తేలుతూ ఉండేదట ...
13వ శతాబ్ధపు అరబ్ భూగోళశాస్త్రవేత్త #జకారియా_అల్క్వాజ్విని వ్రాసిన "వండర్స్ ఆఫ్ తింగ్స్ క్రియేటెడ్ అండ్ మార్వెల్స్ ఆఫ్ తింగ్స్ ఎగ్జిస్టెడ్" వ్రాతల సారాంశం కింద ఇవ్వబడింది . .....
ఇది సోమనాధ్ ఆలయ వివరణ మరియు దాని ధ్వంసం గురించి వివరిస్తుంది . ‘

*సోమనాధ్:* భారతీయుల చేత పవిత్రక్షేత్రంగా భావించబడి సముద్రతీరాన ఉపస్థితమైన క్షేత్రం సోమనాధ్ . ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం .
➖➖➖➖➖➖➖➖
ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత ...

హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధానదైవమఇన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగరూపంలో నిలిచి ఉండడం నాస్థికుడు కాని ఎవరికైనా ఒక వర్ణించ లేని అద్భుతం .చంద్రగ్రహణ కాలంలో లక్షకంటే అధికులైన హిందువులు ఇక్కడకి పవిత్రయాత్రార్ధం రావడం ఆనవాయితీ .

ఎప్పుడైతే సుల్తాన్ యామిను డి దౌలా మహ్ముద్ సుబుక్తిజిన్ భారతదేశం మీద దండయాత్ర చేసాడో ఆయన సోమనాధ్‌ను స్వాధీనపరచుకొని ధ్వంసం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసాడు . ఆయన అక్కడికి 416 ఎ హెచ్ (ఎ డి 1025 డిసెంబర్)లో వచ్చాడుv. రాజు ఈ లింగరూపాన్ని చూసి విస్మయం చెందాడు . తరువాత ఇక్కడి నిధులను మళ్ళించడానికి పడగొట్టడానికి అదేశాలు జారీచేసాడు . అక్కడ గొప్ప ప్రముఖల చేత ఆలయానికి దానంగా ఇవ్వబడిన అనేక స్వర్ణ మరియు రజత విగ్రహాలు, ఆభరణాలతో నిండిన పాత్రలు కనుగొనబడ్డాయి . ఆకాలం లోనే ఆలయంలో కనుగొనబడిన వస్తువుల విలువ 20 వేల దినార్లకు పైబడి ఉంది .’ - 

ఈ విధంగా మొత్తం హిందువుల ఆలయాల నుంచి ఎంత స్థాయిలో సంపద కొల్లగొట్టారో తెలుసుకుంటే హృదయమున్న ప్రతివారికీ భారతదేశం మీద అపారమయిన జాలివేస్తుంది.
హిందువుల సామాజికార్ధికాధ్యాత్మిక విషయాలన్నీ ఆలయంతో పెనవేసుకుని ఉన్నాయి .

*దేవాలయాలు*
ఆథ్యాత్మిక కేంద్రాలే కాక మన సాంకేతిక శాస్త్ర విజ్ఞానానికి కుడా ఉదాహరణలే అనడానికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే .

🌹🌹🌹#సర్వంశివసంకల్పం🌹🌹🌹

కామెంట్‌లు లేవు: