మహాత్ములు ఏ రకమైన పూజలు, నోములు, వ్రతాలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటె వారు ఆ దశలన్నీ దాటి పరబ్రహ్మతో తాదాప్యం చెందే దశలో వుంటారు. ఆ స్వామి ఆ పూజ ఎందుకు నిర్వహించారు అని సందేహం రావచ్చు. ఇదే ప్రశ్న గీతలో అర్జనులవారు శ్రీ కృష్ణుల వారితో అడిగారు. దానికి భగవానుడు ఉత్తములు ఏదయితే ఆచరిస్తారో అది సామాన్యులు అనుసరిస్తారని తెలిపివున్నారు. కాబట్టి ఇక్కడ కంచి పరమాచార్య స్వామి కూడా ఉపాసనకు విగ్రహంలేకుండా కూడా చేయవచ్చని చెప్పి ఉండొచ్చు.
. సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన అనే వాటిపై ఏ మానవుడు తెలుసుకుంటాడో అతను ఆత్యాత్మిక జీవనంలో మొదటి స్థాయి చేరుకుంటాడు. స్థూల దృష్టితో చుస్తే విగ్రహారాధన సగుణ ఉపాసన అని విగ్రహం లేకుండా చేసే ఆరాధనను నిర్గుణ ఉపాసన అని అనుకుంటాము. కానీ నిజానికి నిర్గుణ ఉపాసన అనేది లేదు. ఇది కొంచం చిత్రంగా అనిపిస్తుంది కదూ.
తపస్సు కూడా సద్గుణ ఉపాసనే. ఇదేమిటి ఇట్లా అన్నాను అని అనుకుంటారా కానీ ఇది నిజం. ఇక్కడ ఉపాసన అంటే ఏమిటో తెలుసుకుంటే మనకు తరువాత ఈ రెండు విషయాలు తెలుస్తాయి. ఉపాసన అనే సంయుక్త పదం రెండు పదాల కలయిక 1) ఉప, 2) ఉపాసన ఈ రెండు పాదాలకు అర్ధం ఉప అంటే సమీపంలో ఉపాసన అంటే ఉండటం అని. దేనికి సమీపంలో అంటే భగవంతునికి సమీపంలో అని జవాబు. ఎప్పుడైతే భగవంతునికి సమీపంలో అన్నారో ఇక్కడ ద్వేతం గోచరిస్తుంది. ద్వేతం అంటేనే నీవు వేరు, భగవంతుడు వేరు అనే భావన కనపడుతుంది. అక్కడ నీకన్న భిన్నంగా భగవంతుడు వున్నాడు అంటే అక్కడ సగుణాత్మకంగా భగవంతుడు వున్నాడు. ఆ భగవంతుడు నీకు బౌతికంగా ఉండక పోవచ్చు కానీ నీ మనస్సులో నీకన్నా భిన్నంగా భగవంతుడు వున్నాడు. కాబట్టి అది సూక్ష్మ దృష్టితో చుస్తే సగుణాత్మకమైన ఆరాధనే కానీ ఇంకొకటి కాదు.
మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిర్గుణోపాసన అనేది ఉన్నదా? ఉంటే అది యెట్లా వుంది.
వున్నది కానీ అది ఉపాసన రూపంలో లేదు. అందుకే దానిని నిర్గుణ ఉపాసన అనరాదు.
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య పిల్లలు ఇవ్వన్నీ సామాజిక మైనవి. సాధకుడు ఈ బంధాలను ఒకదాని తరువాత ఒకటిగా వదులుకుంటారు. అంటే బౌతికంగా అందరు వుంటారు. కానీ తన మనసులో వీరందరిపట్ల సాంగత్యాన్ని త్యధిస్తాడు అన్న మాట. ఈ ప్రపంచం కోసం మాత్రమే బంధాలు, తనకు మాత్రం ఏ బంధం లేకుండా ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక జీవనంలో తదుపరి మెట్టు. ఈ స్థితిలో నేను అనే ఒక్క భావన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మొదలైతుంది అస్సలు కధ. ఆ నేను ఎవరు అనే ప్రెశ్న ఉదయిస్తుంది. దయచేసి నేను గతంలో పోస్టు చేసిన "నేను" అనే పోస్టును ఓసారి తిలకించగలరు.
నేను అనే భావన ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు నీవు మిగులుతావు కేవలం నీవు మాత్రమే మిగులుతావు. ఆ నీవే ఈ సర్వ జగత్తుకు మూలకారణం ఐన భగవంతుడు. నిత్యం సాధకుడు ఆ భగవంతుని గూర్చే ఆలోచిస్తాడు. చివరికి తానె భగవంతుడుగా మారుతాడు. ఈ స్థితిని త్వమేవ అహం అంటారు. ఈ స్థితియే మోక్షం. ఇదే ఆధ్యాత్మిక జీవనానికి పరాకాష్ట చివరి మెట్టు. ఈ మెట్టుకి చేరిన వారికి మరల జన్మ ఉండదు. ఇటువంటి సాధనే నిర్గుణ ఉపాసన అని మనం స్థూలంగా అంటాము. కానీ ఇది నిర్గుణ ఉపాసన కాదు దీనిని నిధి జాస అంటారు. అంటే నేనే భగవంతుడిని అనే భావన దీనిని "అహం బ్రాహ్మాస్మి" అనే మహావాక్యంతో ఉపనీసుత్తులు గోషిస్తున్నాయి . ఈ స్థితిని చేరుకోటమే జిజ్ఞాసువు లక్ష్యం. నిత్యం నిష్కామ కర్మలు చేస్తూ నిది జాసలో జీవనం గడపటం సామాన్యమైన విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలం. మనం ప్రతీ విషయానికి స్పందిస్తూ ఉంటాము. అంటే మనం అరిషడ్వార్గానికి బానిసలంగా వున్నాము ఎప్పుడైతే వాటిని బానిసలుగా చేసుకోగలుగుతాడో అప్పుడు జిజ్ఞాసువు ముముక్షువు అవుతాడు తరువాత మోక్షార్ధి అవుతాడు ఆ తరువాత సాక్షాత్తు మోక్షం పొందుతాడు. జీవన్ముక్తుడు అవుతాడు.
సంసార జీవనం చేస్తూ దానితో పాటు ఆధ్యాత్మిక జీవనం సాగించ వచ్చు అని అంటారు. కానీ అది కేవలం ఏ కొద్దీ మందికో మాత్రం సాధ్యం అవ్వచ్చు అవ్వక పోవచ్చు. అటువంటప్పుడు రెండు జీవనాలను చేయటం రెండు పడవల ప్రయాణం అని నేను అనుకుంటాను. ఎందుకంటె మొదటిది స్వార్ధం, స్వలాభం, నేను, నాకు, నాది తో కూడినది. రెండవది వీటినన్నిటిని వదులుకొని నీ గూర్చు కేవలం నీగూర్చు మాత్రమే చింతించటం. అది యెట్లా సాధ్యం. కేవలం జనక మహారాజు లాంటి మహోన్నత వ్యక్తులకు మాత్రమే ఈ రెండు కలుపుకొని జీవించటం సాధ్యం కావచ్చు. మరి మనం ఈ విధిలో ఏచోట వున్నాము అన్నది ప్రతి వారు తమకు తాము ప్రశ్నించుకోవలసిన విషయం.
మన నిత్యా జీవితంలో ఒక పరిక్ష ఉత్తీర్ణుడు కావటానికి రోజుకు ఒక గంట చదివే వాడు పాస్ అవుతే రోజుకు పది గంటలు చదివే వాడు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. ఇది సామాజికం. మరి ఆధ్యాత్మికత దీనికన్నా ఎన్నో రేట్లు కష్ట సాధ్యమైనది. ఈ పరీక్ష కొన్ని వందల లేక్ కొన్ని వేల ఏళ్ళు కష్టపడితే మాత్రమే ఉత్తీర్ణత సాధ్యం. అటువంటి అప్పుడు సంసార జీవనం చేస్తూ ఒక సాధకుడు రోజుకు ఎన్ని గంటలు ఆధ్యాత్మిక జీవితం కోసం కేటాయంచగలడు. ఆ సాధన తన గమ్యాన్ని చేర్చటానికి ఎంతవరకు ఉపయోగ పడుతుంది. ప్రతి సాధకుడు . తనకు తానూ వేసుకోవలసిన ప్రశ్న.
ఓం శాంతి శాంతి శాంతిః
సర్వే జానా సుఖినోభవంతు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి