13, జులై 2020, సోమవారం

# # తెలకపిండి # #


బలము పుష్టి కలిగించును.
వాతమును శ్లేష్మమును హరించును.
బాలింతలకు ఉబ్బురోగులకు మేలు చేయును.
శరీరమునందలి చెడు నీటిని హరించును.
.        దీనికి మంచి జోడీ మినప్పప్పు. 
     చాయ మినప్పప్పు కొంచెం ఉడికిన తరువాత..కొన్ని నీళ్ళు ఉండగానే తెలకపిండి గుండ వేసి కూర వండి .. వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పోపు  సామాను, వేసి వేయించి తాళింపు పెట్టాలి.  ఆ కూర అన్నంలో వేసుకుని, ఇంగువ వేసి కాచిన పప్పునూనె చేతిమీద వేసుకొని కలిపి తింటే అమోఘమైన  రుచి. ఆరోగ్యం బాగుంటుంది. శరీరం తేలిక పడుతుంది. 
ఆకలి పెరుగుతుంది. వాత దోషం,నంజు, హరిస్తాయి. మంచి రుచి. అన్న హితవు కలుగుతుంది. 
     మినప్పప్పు చాలా బలకరం. శుక్లవృద్ధి.శరీర పుష్టికరమైనది. క్షయ వ్యాధిని సైతం నిర్మూలిస్తుంది. 
     ఈ సీజన్లో ఈ కాంబినేషన్ చాలా మంచిది. 
(రిఫరెన్స్ ధన్వంతరి నిఘంటువు మొదలగునవి)
                    సుఖీభవ

కామెంట్‌లు లేవు: