6, ఆగస్టు 2021, శుక్రవారం

కలౌ పారాశర స్మృతిః

 కృతేతు మానవాః ప్రోక్తాః 

త్రేతాయాం గౌతమ స్మృతి:

 ద్వాపరే శంఖలిఖితా 

కలౌ పారాశర స్మృతిః


అన్నశ్లోకం అదే విషయాన్ని చెబుతోంది. కృతయుగంలో మనుస్మృతి పరమ ప్రామాణికంగా పరిగణింపబడింది. అట్లాగే త్రేతాయుగంలో గౌతమ ధర్మశాస్త్రం, ద్వాపరయుగంలో శంఖ లిఖిత స్మృతి ప్రామాణికములు. ఈ కలియుగంలో పరాశరస్మృతి ప్రామాణికంగా ఉన్నదని అర్ధము. ఈ శ్లోకము మనుస్మృతి ప్రామాణికతనే కాక, ప్రాచీనత్వాన్ని కూడా తెలుపుతున్నది. పితృశ్రద్ధాలలో మాంసభక్షణము, దేవరన్యాయమున పిల్లలను కనటం వంటివాటిని మనుస్మృతి సమర్థిస్తూండగా పరాశరస్మృతి కలియుగంలో అవి నిషిద్ధములని చెప్పింది. అట్లాగే - నామకరణము శిశువునకు 10 లేక 12వ రోజున చెయ్యవలెనని మనుస్మృతి (230) చెబుతూ ఉంటే, 11వదినంలో చెయ్యవలెనని శంఖవచనము. ఇవన్నీ, ఆచారాలు, ధర్మాలు ఎట్లా మారుతూ వచ్చాయో తెలుపుతాయి. మొత్తం మీద - ఈనాడు మనం ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలన్నిటికీ మూలం ధర్మశాస్త్రాలే !


ఈనాడు మనం ఆచరిస్తున్న జాతకర్మ, ఉపనయనము, వివాహము వంటి పోడశ సంస్కారములు, శ్రాద్ధవిధి, జాతాశౌచ మృతాశౌచములు స్త్రీ ధర్మాలు వంటి సదాచారములు; అప్పు తీసుకొనటం, క్రయవిక్రయాలలో తలెత్తే వివాదాలు, స్వామి-సేవకుల మధ్య వివాదాలు, భూమి ఎల్లలు, స్త్రీ పురుష వివాదాలు, ఆస్తిపంపకం, జూదం, వ్యభిచారం వంటి అష్టాదశ వ్యవహారాలు; సకాలంలో కర్మలు చేయకపోవటం వలన కలిగే అనర్ధాలకు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తాలు; అన్యాయం చేసినవారికి రాజు విధించవలసిన వివిధ శిక్షలు - వంటి ఎన్నో విషయాలు ఈ ధర్మశాస్త్ర గ్రంధాలలో వివరించబడినాయి. అంటే వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్నది, తరతరాలుగా వస్తున్నది అయిన మన సంస్కృతిని నిలబెట్టినవి మన ధర్మశాస్త్ర గ్రంథాలే. అందుకే వాటిని మనం అధ్యయనం చేసి, మన సంస్కృతిని అర్థం చేసుకొని, మన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకోవాలి. అలాంటి వాటిలో అగ్రగణ్యమైనది మనుస్మృతి. కొన్ని వేల సంవత్సరాల క్రితం అందులో చెప్పిన ఆచార వ్యవహారాలే ఈనాటికీ అమలు చేస్తున్నామంటే, అవి మనకు ఎంత ఆదరణీయమో గ్రహించవచ్చు


షోడశకర్మలు, గురు ప్రాశస్త్యము (2-192......), అతిథి పూజనం ( 3-102...),

కామెంట్‌లు లేవు: