6, ఆగస్టు 2021, శుక్రవారం

కర్మత్రయం, ఫలత్రయం, దోషత్రయం i

  

కర్మకాండ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము. కర్మకాండలో కర్మత్రయం, ఫలత్రయం, దోషత్రయం i


కర్మత్రయం- మనం వాడే కరణాల దృష్ట్యా మనం చేసే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. వాటిని త్రివిధం కర్మ అంటారు. 



ఎ) కాయిక కర్మ - శరీరంతో చేసేది పూజ, ప్రదక్షిణం, నమస్కారం, తీర్థయాత్ర, యజ్ఞం 

బి) వాచిక కర్మ పైకి చేసే జపం, పారాయణం వాక్కుతో చేసేది 

సి) మానస కర్మ - మనసుతో చేసేది ధ్యానం


ఫలత్రయం - ఏ కర్మ చేసినా, దానికి ఫలం ఉంటుంది. అది దృష్టఫలం కావచ్చు. అదృష్ట ఫలం కావచ్చు. అంటే కనపడే ఫలం, కనపడని ఫలం. ఆ ఫలం పుణ్యం కావచ్చు. పాపం కావచ్చు. ఉదాహరణకు ఆకలితో ఉన్న పేదవానికి అన్నం దానం చేస్తే పుణ్యం వస్తుంది. అది దృష్టఫలంగానూ, అదృష్టఫలంగానూ కూడా వస్తుంది. ఆకలి తీరిన ఆ పేదవాని ముఖంలో కలిగిన ఆనందం, అతను నోరారా మనను దీవించటం - దృష్టఫలం. ఈ మంచి కార్యం చేసినందుకు మన ఖాతాలో కొంత పుణ్యం వచ్చి చేరుతుంది. కాని అతను తినీ తినగానే, 'దుక్కలా ఉన్నావు, పనిచేసుకు బతకలేక, ఇలా ఊరిమీద పడి తింటావెందుకు?” లాంటి దుర్భాషలాడామనుకోండి. అప్పుడు అదృష్టఫలంగా పాపం కొంత వచ్చి చేరుతుంది. అలా ప్రతి కర్మకూ పుణ్యమో, పాపమో ఏదో ఒక ఫలం తెలిసో, తెలియకో చేరుతూ ఉంటుంది. ఆ ఫలాన్ని ఫలత్రయం అన్నారు. మనకు అది అర్ధ లేదా కామ లేదా ధర్మ రూపంలో కలుగుతుంది. అంటే మనం చేసే కర్మలు ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలలో మొదటి మూడింటినీ చేకూరుస్తాయి.


కామెంట్‌లు లేవు: