6, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రాద్ధ విధి

 శ్రాద్ధ విధి ( 3-122....), అశౌచవిధానము ( 5-58 .....), రాజసేవకులను పరీక్షించటం, రాజువాడే వస్తువులను పరీక్షించటం (7-219,220), రాజుకొఱకు వంటవాళ్ళు చేసిన అహారాన్ని పరీక్షించటం ( 7-217), తూనికలు - కొలతలు వంటి వాటిని తరచు పరీక్షించటం (8403), తండ్రి తాను సంపాదించిన ద్రవ్యాన్ని ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవటం ( 9-209), అన్నదమ్ములు తండ్రి ఆస్తి పంచుకున్నప్పుడు ముందుగా తండ్రి చేసిన అప్పులను తీర్చటం ( 9-218) - ఇవన్నీ ఈనాటికీ ఆచరిస్తున్నవే !


ఇక మనస్మృతిలో చెప్పిన ఈ క్రింది విషయాలు అందరూ తెలుసుకోవాలసినవి:


ఆచమన జలపరిమాణ ఎంత ఉండాలి.( 2-62)


నమస్కార విధానము - తన కుడిచేతితో గురువు ఎడమ పాదాన్ని తన ఎడమ చేతిలో కుడిపాదాన్ని ముట్టుకొని నమస్కరించాలి.


ఋగ్యజుస్సామ వేదములనుండి అకార ఉకార మకార రూపమైన ప్రణ మును, భూః భువః సువః అనే వ్యాహ్యతి త్రయమును బ్రహ్మ ఏర్పరచినాడు. అట్లాగే ఆమూడు వేదాలనుండీ గాయత్రీ మంత్రానికి సంబంధించిన “తత్సవితుర్వరేణియం, భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప చోదయాత్" అన్నపాదత్రయాన్ని ఆకర్షించాడట, కనుక ఓంకారంతో, వ్యావృతిత్రయ సహితంగా, త్రిపాది అయిన గాయత్రీ మంత్రాన్ని జపించాలని, అట్లాచేస్తే పరబ్రహ్మను పొందగలుగుతాడని మనుస్మృతి . (2-76 నుండి 82) కాని, నేడు గాయత్రీ మంత్రం 24 అక్షరాలతోనే ఉన్నది కనుక వ్యాహృతులను వదిలి వేస్తూ ఉంటారు. అది పద్ధతి కాదని మనువు !


ఓంకారమే పరబ్రహ్మము. ఆ ఓంకార జపం యజ్ఞాదులకంటె పదిరెట్లు శ్రేష్ఠం దానిని ప్రక్కవాడికి వినపడకుండాచేస్తే 100 రెట్లు శ్రేష్ఠం. మానసికంగా చేస్తే వెయ్యిరెట్లు శ్రేష్ఠం. ( 2-8385) అది తెలియక చాలా మంది ఓంకారం ఎంత గట్టిగా చెబితే అంత గొప్ప అని భావిస్తూ, సాధనచేస్తున్నారు.


కామము ఉపభోగమువలన ఉపశమిస్తుందని నేటివారి అభిప్రాయము. జాతున కామః కామనాం ఉపభోగేన శామ్యతి' అని మనువు. పైగా అది నెయ్యి పోస్తే ప్రజ్వరిల్లే అగ్నిలాగా పెరుగుతూ పోతుందే కాని తగ్గదు అని మనువు'. (2-94)

కామెంట్‌లు లేవు: