6, ఆగస్టు 2021, శుక్రవారం

పరుల భార్యను

 6. పరుల భార్యను, తనకు దగ్గరి సంబంధంలేని స్త్రీని గౌరవనీయురాలని, సోదరి అని పిలవాలి (2-29).


7. కన్యాదానం చేసి తండ్రి వరుని నుండి ధనం తీసుకుంటే, అతనికి కన్యాదాన ఫలం దక్కదు. పైగా తన సంతానాన్ని అమ్ముకున్నవాడౌతాడు. 3-51)


8. ఇంటికి వచ్చిన అతిథుల కుల గోత్రాలను అడగటం, వాంతిచేసుకొన్న అన్నమును పెట్టటంతో సమానము ( 3-109).


9. దేవకార్యంకంటే పితృకార్యం ముఖ్యము ( 3- 203).


10. సంధ్యావందనాన్ని సరియైన సమయాలలో ఎక్కువ సేపు చెయ్యటంవల్లనే ఋషులు దీర్ఘాయుస్సు, యశస్సు, బ్రహ్మవర్చస్సు, ప్రజ్ఞలను పొందగలిగినారు. ( 4-94)


11. పరస్త్రీ వ్యామోహం ఆయుక్షీణాన్ని కల్గిస్తుంది. ( 4-134)


12. తపస్సు వల్లనే పూర్వ జన్మ స్మరణ కలుగుతుంది ( 4-148)


13. సదాచారము వల్లనే దీర్ఘాయువు, ధనము, సత్సంతానము కలుగుతాయి. (4-156)


14. శ్రద్ధగా ఇయ్యకపోతే శ్రోత్రియుని అన్నమైన తినరాదు . ( 4-225)


చేసిన దానాన్ని ఇతరులకు చెప్పకూడదు. ( 4-236)


16. ప్రణవంతో చేసే ప్రాణాయామం చాలా గొప్పది. అది ఇంద్రియ దోషాలను పోగొడుతుంది. ( 6-70)


17. జలగలు, దూడలు, తేనెటీగలు ఏవిధంగా కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటాయో, రాజుకూడ ప్రజలను కష్టపెట్టక కొద్ది కొద్దిగా పన్ను తీసుకోవాలి ( 7-129)


18. దోపిడి, ఇళ్ళు తగుల బెట్టటం వంటి నేరాలను కఠినంగా శిక్షించాలి ( 8-345)


మేనరికం చేసుకుంటే చెల్లిలిని వివాహమాడిన పాపం వస్తుంది ( 11-171)


కామెంట్‌లు లేవు: