10, జూన్ 2023, శనివారం

సాదాకా మేలుకో -4 సమ భావము

సాదాకా మేలుకో -4

 సమ భావము

ఒక గురువు గారు కొంతమంది శిష్యులను కలిగి అరణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో వుంది తపస్సు చేస్తూవున్నారు. జిగ్న్యాసువులు అయిన శిష్యగణం గురువుగారి వాక్కుకు కట్టుబడి అయన చెప్పే నియమాలను ఉల్లంఘించకుండా గురువుగారిని సేవిస్తూవున్నారట. కాగా ఒకనాడు గురువు గారు శిష్యులను ఉద్దేశించి నాయనలారా తపస్సు చేసుకోవటానికి సాధన సంపత్తి కావాలి దానికోసం సదా మనస్సును అధీనంలో ఉంచుకొని ఎల్లప్పుడూ పరబ్రహ్మత్వం మీదనే మనస్సును కేంద్రీకరించాలి. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలను చూడకూడదు, వారితో మాట్లాడకూడదు, వారిని స్పృసించకూడదు అలా కఠినమైన నియమాలను అలవర్చుకున్న మనస్సు స్వాధీనమై పరమాత్మా మీదకు మళ్లుతుంది అని బోధించారు. 

గురువు గారి బోధలను తూ చా తప్పకుండ పాటిస్తున్నారు శిష్యబృందం. వారు అడవిలో నివసిస్తున్నారు కాబట్టి వారికి సభ్య సమాజం చాలా దూరంగా ఉండటం వలన వారికి వారు వారి గురువుగారు మినహా వేరే మనుషులు ఆ అరణ్యంలో తారసపడటం లేదు కాబట్టి వారికి స్త్రీలను చూద్దామన్నా కనపడరు అందువలన వారు గురువుగారి ఆదేశాన్ని యధాతతంగా పాటించగలుగుతున్నారు. 

కొంతకాలం తరువాత శిష్యులు సమిధలు తీసుకొని రావటానికి అరణ్యంలోకి వెళితే వారికి అక్కడ ఒక తీవ్రంగా పారుతున్న యేరు కనిపించింది. ఆ యేటి వడ్డున ఒక యువతి ఆ యేటిని దాటటానికి ప్రయత్నిస్తూ దాటగలనో లేనో అని భయంతో ఉండటం గమనించారు.  శిష్య్లను చుసిన ఆ యువతి అయ్యలారా నేను ఆసక్తురాలను నా మీద దయతో ఈ యేటిని దాటించగలరు అని వేడుకుండి అది విన్న శిష్యులు వారికి వారి గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అరే  మనం  గురువుగాను మనకు ఏమిచెప్పారు మనలను స్త్రీలను చూడకూడదు, మాట్లాడకూడదు, అన్నారుకదా కాబట్టి మనంఆమెవైపు చూడకూడదు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆమెను వదిలి  వెళ్లారు. ఎవరు  సాయ పడటానికి ముందుకు రావటంతో ఆమె  నిరాశపడింది. అప్పుడు సత్యపాలకుడు అనే ఒక శిష్యుడు అమ్మ నీవు విచారించవలదు నేను నీకు సాయపడగలను అని ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని నదిని దాటించాడు. అతను చేసిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపి వేదిలింది. తరువాత సత్యపాలకుడు మరల నదిని దాటి ఇవతలైవడ్డుకు వచ్చి మిగిలిన తన మిత్రులను కలిసాడు.

మిత్రులంతా కూడా సత్యపాలుని మీద కోపంగా వున్నారు.  నీకు గురువు గారి మీద ఏమాత్రం గౌరవం లేదు నీకు గురువు గారి మాటపై ఏమాత్రం విలువ లేదు.  మేము గురువుగారితో చెప్పి నిన్ను ఆశ్రమనుంచి పంపిస్తాము అని బెదరించి చీదరించుకుంటూ, విస్సుకుంటూ ఆశ్రమ దోవపట్టారు. అందరు ఆశ్రమంలో గురువుగారిని కలుసుకొని సత్యపాలుడు చేసిన పని చెప్పి గురువుగారు సత్యపాలుడు సాధనకు పనికి రాదు మీ మాటలను అస్సలు గౌరవించలేదు యవ్వనంలో వున్న ఒక యువతితో మాట్లాడటమే కాకుండా అమాంతం ఆమెను తన రెండు చేతులతో మోసుకొని వెళ్లి నది అవతలి వడ్డుకు చేర్చాడు.  ఇటువంటి గురుద్రోహిని వెంటనే మన ఆశ్రమంనుండి వెళ్ళకొట్టండి అని అన్నారు. 

గురువుగారు సత్యపాలుని ఉద్దేశించి నాయనా వాళ్ళు చెప్పేది నిజమేనా నీవు ఒక యువతిని నది దాటించావా అని అడిగారు.  దానికి సత్యపాలుడు గురువుగారు నేను ఒక మనిషిని నది దాటించిన మాట నిజమే కానీ అది స్త్రీయా లేక పురుషుడా అనేది గమనించలేదు అని జవాబు చెప్పాడు.\
నీవు పూర్తిగా అబద్దం చెపుతున్నావు ఇప్పడికి మాకు ఆ అమ్మాయి మొహం జ్ఞ్యాపకం వుంది ఆమె కట్టుకున్న వస్త్రాలు, ఆమె కురులు ఒక్కసారి చుస్తే చాలు ఎవరు కూడా మరచిపోలేరు. గురువుగారు వీడు పూర్తిగా అబద్దం చెపుతున్నాడు మీరు కోరితే నేను ఆ అమ్మాయి బొమ్మను కూడా గీసి చూపించగలను వాడు అవునంటాడో  కాదంటాడో చూస్తాను అని ఆవేశంతో ఒక శిష్యుడు పలికాడు. గురువుగారు మరల సత్యపాలుని అడిగారు.  దానికి సత్యపాలుడు వినమ్రుడు గురువర్యా నేను వారు చెప్పింది ఏది కూడా గమనించలేదు అని బదులు చెప్పాడు.
గురువుగారు శిష్యులను ఉద్దేశించి ఇలా అన్నారు నాయనలారా మీరు ఆమెను తాకను కూడా తాకలేదు అని అనుకుంటున్నారు  కానీ మీరు ఇంకా ఆమె విగ్రహాన్ని మనసులో  తాకుతున్నారు. సత్యపాలుడు ఆమెను నది ఒడ్డున ఆమె స్మృతులతో సహా వదిలివేసాడు కానీ ఇంకా మీరు ఆమెను మీ మనస్సులో మోస్తున్నారు. నేను చెప్పింది పూర్తిగా ఆచరించిన వాడు సత్యపాలుడు కానీ మీరు కాదు నాయనా మనస్సును శుద్ధిగా ఉంచుకోలేని వాడు సాధనకు పనికిరాడు  అని వారలను  మందలించారు   గురువుగారు. 
సాధకుడు అలవరచుకోవలసిన అతి కఠినమైనది, ఉత్కృష్టమైనది అంటే సమభావం.మాత్రమే  ఇది సాధించటం చెప్పినంత సులువు కాదు మహా మహా తాపసులు కూడా జారి కింద పడ్డ సందర్భాలు అనేకం మనకు పురాణాలలో తెలియచేయబడింది. మహా తపోధనుడు సృష్టికి ప్రతిసృష్టి చేయగల మహర్షి విస్వామిత్రుడు వంటి వారే సమ భావనను ఆచరించలేక మేనకకు లొంగి తన దీక్ష భంగం చేసుకున్న ఉదంతం మనందరికీ విదితమే. 
కాబట్టి సాదారణ తపమాచరించి మనము ఏమాత్రము మనస్సును నిగ్రహించుకోగలము అనేది సందేహాత్మకమే కానీ సాధకుడు ఎట్టిపరిస్థితిలోను తానూ తన అకుంఠిత దీక్షను విరమించుకోవటానికి సిద్దపడదు కాబట్టి దీక్షాపరుడైన సాధకుడు నిరంతరం పరబ్రహ్మ మీదనే మనస్సును నిలపటానికోసం కఠోర నియమాలను ఆచరించవలెను. 
సాధకుడు ఇతర జీవులతో సమభావం కలిగి ఉండటం గురించి ఇంకొక కందికలో తెలుసుకుందాం. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు భార్గవశర్మ

కామెంట్‌లు లేవు: