మా నాన్న కూడా ఇదే చెప్పారు
ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక ధనికుడు వచ్చాడు. స్వామివారు ఆజ్ఞాపిస్తే ఎడియానా ధార్మిక కార్యక్రమానికి తను ధనం ఇవ్వడానికి సిద్ధం అని తెలిపాడు.
అందుకు స్వామివారు, “ఇంట్లోని పెద్దలతో మంచిగా ప్రవర్తించు, నీ భార్యను ప్రేమించు, సాధ్యమైనంత వరకు చెడ్డ పనులు చెయ్యొద్దు. అది చాలు” అన్నారు.
శ్రీమఠానికి ధనం ఇవ్వమని చెబుతారేమో స్వామివారు అనుకుంటున్న ఆ ధనికుడు, స్వామివారు మాటలు విని ఆశ్చర్యపోయాడు. మఠానికి ఏమీ కోరకుండా పూర్తిగా వేరే విషయాన్ని చెప్పారు. ‘నేను స్వామివారితోనే ఉండి నా నుండి స్వామివారు ఏదైనా అడిగేలా చెయ్యాలి’ అని మనసులో అనుకున్నాడు.
“నేను స్వామివారు చెప్పినట్లే చేస్తున్నాను; ఇకముందు కూడా అలాగే చేస్తాను. మీరు ఇంకా ఏదైనా చెయ్యమని చెప్పినా, దాన్ని కూడా చెయ్యడానికి సిద్ధం”
కొద్దిసేపు మౌనం తరువాత, “మీకందరకూ ‘అయ్యనార్’ కులదైవం. దేవాలయం ముందర ఉన్న సిమెంటు గుర్రపుబొమ్మ పాతదైపోయింది. దాన్ని బాగుచేయించి, రంగులు వేయించి తరువాత దేవాలయానికి కుంభాభిషేకం చేయించు”.
ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు.
“అవును స్వామి, చనిపోయే ముందు మా నాన్న సరిగ్గా ఇదే పని చెయ్యమని చెప్పారు. దాని గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. మా నాన్న ఏం చెప్పారో స్వామివారి కూడా సరిగ్గా అదే చెప్పారు, ఇది ఎలా సాధ్యం?”
అవును, అది నిజం. మరి ఎలా?
బహుశా అతని తండ్రి స్వర్గానికి వెళ్లిపోయే ముందు స్వామివారికి చెప్పాడేమో!
ఎంతో ఆనందంతో ఆ ధనవంతుడు స్వామివారి ఆజ్ఞని పాటించాడానికి వెళ్లిపోయాడు.
--- శ్రీమఠం బాలు మామ.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి